Jyothi Rai: ఎన్టీఆర్ సినిమాలో 'గుప్పెడంత మనసు' ఫేమ్ జ్యోతి రాయ్?
Jyothi Rai In NTR 31: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమాలో బుల్లితెర బ్యూటీకి ఛాన్స్ వచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్.
'గుప్పెడంత మనసు' సీరియల్ ద్వారా పాపులరైన నటి జ్యోతి రాయ్. కర్ణాటకకు చెందిన ఆమెకు తెలుగునాట చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా స్మాల్ స్క్రీన్ మీద జ్యోతి రాయ్ చేస్తున్న పాత్రకు, సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫోటోలకు అసలు సంబంధం ఉండదు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమాలో ఆమెకు ఓ కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చిందట. పూర్తి వివరాల్లోకి వెళితే...
ఎన్టీఆర్ 31లో జ్యోతి రాయ్?
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా 'దేవర'. ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 5న ఆ సినిమాను పాన్ వరల్డ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 'దేవర' తర్వాత 'కెజియఫ్', 'సలార్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఆయనకు హీరోగా 31వ సినిమా. అందులో జ్యోతి రాయ్ నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు బలంగా చెబుతున్నాయి. అందుకు కారణం బుల్లితెర నటి. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె ఎన్టీఆర్ 31 పోస్టర్ షేర్ చేశారు. దాంతో ఆమె నటించవచ్చని, ఛాన్స్ రావడంతో పిక్ షేర్ చేశారని పరిశ్రమ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా డిసైడ్ అయ్యారు.
Also Read: టు మినిట్స్ కూడా లేవుగా - వైరల్ అవుతున్న ప్రభాస్ 'సలార్' డైలాగ్స్
View this post on Instagram
'గుప్పెడంత మనసు' సీరియల్ (Guppedantha Manasu serial Jyothi Rai)లో హుందాతనం ఉన్న పాత్రలో జ్యోతి రాయ్ నటిస్తున్నారు. అయితే... సోషల్ మీడియాలో గ్లామర్ గాళ్ అన్నట్లు బోల్డ్ పిక్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఒకసారి బికినీ ఫోటోలు షేర్ చేసి షాక్ ఇచ్చారు. మరి, ఆమెకు ప్రశాంత్ నీల్ ఎటువంటి క్యారెక్టర్ ఇస్తారో చూడాలి.
Also Read: రవితేజ సినిమాలో కన్నడ హీరోయిన్‌కు ఛాన్స్ - ఆమె ఎవరంటే?
View this post on Instagram
'కెజియఫ్', 'సలార్' సినిమాలు గమనిస్తే... హీరోయిన్లు గానీ, మహిళా ఆర్టిస్టుల చేత గానీ అందాల ప్రదర్శన చేయించలేదు. వాస్తవం చెప్పాలంటే... మహిళలను హుందగా చూపించారు. 'కెజియఫ్'లో రవీనా టాండన్, ఈశ్వరి రావు, 'సలార్' సినిమాలో శృతి హాసన్, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు పాత్రలను శక్తివంతంగా తీర్చి దిద్దారు. ఒకవైపు సీరియల్స్ చేస్తున్న జ్యోతి రాయ్... మరోవైపు సినిమాలు కూడా చేయడం స్టార్ట్ చేశారు. అరవింద్ కృష్ణ 'ఏ మాస్టర్ పీస్' సినిమాలో ఓ కీలక పాత్ర చేశారు. ఒక వెబ్ సిరీస్ కోసం బికినీ ధరించారు. దర్శక నిర్మాతలు తమ తమ సినిమాల్లో జ్యోతి రాయ్ కోసం స్పెషల్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
Also Read: హృతిక్ రోషన్ 'ఫైటర్' ఫస్ట్ ఫేక్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?
ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న తాజా సినిమా 'దేవర'లో కూడా ఓ సీరియల్ ఆర్టిస్ట్ ఉన్నారు. విలన్ సైఫ్ అలీ ఖాన్ భార్య పాత్రలో చైత్ర రాయ్ నటిస్తున్నారు. నెక్స్ట్ సినిమాలో కూడా సీరియల్ ఆర్టిస్ట్ ఉండొచ్చు.