అన్వేషించండి

Guppedantha Manasu February 7th Update: రిషిధారను హనీమూన్ పంపించేందుకు జగతి మహేంద్ర ప్లాన్, ఈగో మాస్టర్ రియాక్షన్ ఏంటో మరి!

Guppedantha Manasu February 7th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుప్పెడంతమనసు ఫిబ్రవరి 7 ఎపిసోడ్ (Guppedanta Manasu February 7th Update)

వసుధార మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి రిషికి వివరిస్తూ ఉంటుంది. ఇంతలో వసు చేతిలో మార్కర్ కింద పడిపోవడంతో తీసేందుకు ఇద్దరూ ఒకేసారి కింద కూర్చుని తలకొట్టుకుంటారు..ఇలా ఒకసారి తల తగిలితే కొమ్ములు వస్తాయి మరోసారి కొట్టండి సార్ అని వసు అంటే..వద్దు వచ్చిన కొమ్ములు పోతాయేమో చూసుకో అంటాడు..ఇంతలో వసుధార మళ్లీ తలతో కొడుతుంది.  వసు ముక్కుపై మార్కర్ కలర్ అంటుకోవడంతో..చెబుతాడు కానీ వసుకి అర్థంకాకపోవడంతో ఫొటోతీసి చూపిస్తాడు 
వసుధార: ఒకప్పుడు మీరే తుడిచేవారు ఇప్పుడు దూరంగా ఉంటున్నారా సార్ అని అనుకుంటుంది
రిషి: దూరమయ్యావా వసుధార అనకుంటాడు
వసు: దూరం మీరే తగ్గించాలి అనుకుంటూ వెళ్లొస్తానని చెప్పివెనక్కు తిరుగుతుంది
ఇంతలో లవ్ సింబల్ కింద పడిపోతుండగా వసు, రిషి ఇద్దరు పట్టుకుంటారు.
రిషి: ఎందుకు పట్టుకున్నావ్ వసుధార 
వసు: హార్ట్ కదా సార్ 
రిషి: హార్ట్ లేని వాళ్ళు హార్ట్ గురించి బాధపడతారా
అప్పుడు వసు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..ఎప్పుడో నా జీవితంలోంచి వెళ్లిపోయావు కదా వసుధారా అని బాధపడతాడు రిషి

Also Read: ఈ రాశివారు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే డబ్బు సంపాదించే అవకాశం ఉంది, ఫిబ్రవరి 7 రాశిఫలాలు

చక్రపానికి సుమిత్ర ఫోన్ చేసి అక్కడ పరిస్థితులు ఏంటని అడుగుతుంది. అమ్మాయి జీవితం బాగుంటుందని  సంతోషించే లోపే వాళ్ళ మధ్య చిక్కుముడి వచ్చి పడింది అంటూ సుమిత్ర మాట్లాడుతుంది..ఏ దేవుడో సాయం చేస్తేకానీ వాళ్లిద్దరూ ఒకటి కారు సుమిత్ర అంటూ మట్లాడుతుండగా.. జగతి, మహేంద్ర అక్కడికి రావడంతో...షాక్ అవుతాడు
చక్రపాణి: మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది 
మహేంద్ర: మర్యాదలు పక్కనపెట్టండి కాసేపు కూర్చోండి. మీతో చిన్న పని ఉండి వచ్చాం
చక్రపాణి: కాల్ చేస్తే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడకు వచ్చేవాడిని కదా
జగతి:వీళ్లిద్దరిని చూస్తే బాధేస్తుంది భయమేస్తోంది చక్రపాణి గారు. రిషి తనంతట తానే నిజం తెలుసుకోవాలని వసుధార అనుకుంటుంది. మరోవైపు రిషి బాధను చూడలేకపోతున్నాం
చక్రపాణి: వసు బయటికి అలా మాట్లాడుతోంది కానీ రిషి సార్ గురించి చాలా బాధపడుతోంది మేడం 
మహేంద్ర: అందుకే వారిద్దరినీ పక్కపక్కన ఉండేలా ప్లాన్ చేద్దాం..ఒక ప్లాన్ చేస్తున్నాం మీరు సహాయం చేస్తే చాలంటూ.. వాళ్లిద్దర్నీ ఏదైనా టూర్ పంపించాలి అనుకుంటున్నాం
చక్రపాణి: ఆలోచనలో పడతాడు 
సరే మేము వెళ్ళొస్తామని చెప్పి అక్కడి నుంచి జగతి, మహేంద్ర వెళ్ళిపోతారు.  

Also Read: ఇగో మాస్టర్ వంకర ప్రశ్నలు, పొగరు తిక్క సమాధానాలు- రిషిధారని కలిపేందుకు మహేంద్ర స్కెచ్

కాలేజీలో వసుధార  నిలబడి ఉంటుంది..ఇంతలో వచ్చిన రిషి..లిఫ్ట్ కావాలా అని అడిగి కారు దిగి వెళ్లి అడుగుతాడు. ఇప్పుడు నేను డిబిఎస్టి కాలేజ్ ప్రాజెక్ట్ హెడ్ ని.. క్యాబ్ బుక్ చేసుకోగలను అంటుంది. పొగరు అని మనసులో అనుకుంటాడు రిషి. ఇద్దరూ కాసేపు ఫన్నీగా పోట్లాడుకుంటారు. క్యాబ్ బుక్ చేస్తుంది కానీ క్యాన్సిర్ అవుతుంది. ఎట్టకేలకు కారెక్కిన వసుధార..దారి మధ్యలో.. బొట్టు బిళ్లలు కొనుక్కోవాలి కారు ఆపండి అంటుంది. నేనే మీ డ్రైవర్ ని కాదు లిఫ్ట్ ఇస్తున్నాను అని అంటాడు రిషి. 

తర్వాత మహేంద్ర,జగతి, రిషి ముగ్గురు భోజనం చేస్తూ ఉండగా జగతి వాళ్ళు ఏదో చెప్పాలి అనుకుంటుండగా చెప్పండి డాడీ పర్లేదు ఏంటో అని అంటాడు. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టులో భాగంగా చిన్న చిన్న పల్లెటూర్లకు వెళ్లి గిఫ్ట్ లు ఇవ్వాలి అనుకుంటున్నాము అందుకు నేను జగతి వెళుతున్నాము అనడంతో సరే వెళ్ళండి డాడీ అని అంటాడు రిషి. అయితే టూర్ కి వెళ్లేది మనం కాదు రిషి వసుధార అని తెలిస్తే షాక్ అవుతారు అనుకుంటుంది జగతి.  మరోవైపు వసుధార లవ్ సింబల్ వేసి అందులో విఆర్ అని రాస్తుంది. అప్పుడు అక్షరాలు చూస్తున్న మా ఇద్దరిని ఎవరు విడదీయలేరు ఇవి రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు రిషితో గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకొుని సంతోష పడుతూ ఉంటుంది వసుధార. 
ఇంతలో చక్రపాణి అక్కడికి వచ్చి వసుధారని చూసి నవ్వుతూ ఉంటాడు. 
చక్రపాణి: త్వరలోనే మీరిద్దరు ఒకటి అవుతారని అనిపిస్తోందమ్మా
వసు: నాక్కూడా  అలాగే ఉంది నాన్న అని అంటుంది
అప్పుడు వసుధార కిటికీ దగ్గరికి వెళ్లి చందమామతో మాట్లాడుతూ ఉంటుంది. హలో చందమామ  ఎలా ఉన్నావు నీకు భయపడతానని అనుకుంటున్నావా. నేను రిషి సార్ కె భయపడను అలాంటిది నీకెలా భయపడతాను అనుకుంటూ ఉంటుంది. మరోవైపు రిషి కూడా చందమామతో మాట్లాడుతూ ఉంటాడు. హలో ఏంటి చందమామ సార్ మీరు మీ ఫ్రెండ్ ఒకటేనా, మీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు లేదంటే వెళ్ళిపోతారు. మేము జ్ఞాపకాలతో బతికేయాలా అని అనుకుంటూ ఉంటాడు రిషి.

టాప్ హెడ్ లైన్స్

Pradeep Rawat Passes Away: ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
Jagadhatri Serial Today August 4th: మర్డర్‌ కేసులో మినిస్టర్‌ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరుల దాడి
జగద్ధాత్రి సీరియల్: మర్డర్‌ కేసులో మినిస్టర్‌ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరుల దాడి
Vanda Devullu OTT: వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Dhandha Review - 'దందా' వెబ్ సిరీస్ రివ్యూ: ఛాయ్ షాట్స్‌లో సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
'దందా' వెబ్ సిరీస్ రివ్యూ: ఛాయ్ షాట్స్‌లో సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Embed widget