By: RAMA | Updated at : 07 Feb 2023 05:56 AM (IST)
Edited By: RamaLakshmibai
Horoscope Today 07th February 2023 (Image Credit: Freepik)
Horoscope Today 07th February 2023: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం
మేష రాశి
ఈ రోజు ఈ రాశివారికి చాలా మంచి రోజు అవుతుంది. ఏదైనా ముఖ్యమైన పనిని సకాలంలో పూర్తి చేస్తారు. ఎవరికైనా సహాయం చేయడానికి వెనుకాడరు. మీరు రోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం
వృషభ రాశి
ఈ రోజు ప్రశాంతంగా ఉంటారు. స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులకు, వ్యాపారులకు తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారుల నుంచి అవసరమైన సహకారం అందదు. ఏదో విషయంలో చికాకుగా ఉంటారు
మిథున రాశి
కార్యాలయంలో కొత్త సమీకరణాల కారణంగా మీరు అన్ని సమయాలలో బిజీగా ఉంటారు. నిలిచిపోయిన కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు ఊపందుకుంటాయి. ఉద్యోగులు ఈరోజు ప్రమోషన్‌కు సంబంధించిన శుభవార్త అందుకుంటారు..ప్రభుత్వ ఉద్యోగులు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవుతారు
కర్కాటక రాశి
ఈ రాశివారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఈ రోజు మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలు రానివ్వకండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. విద్యార్థులు భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకుని ఈరోజు చదువుకోవాలి.
Also Read: ఈ రాశులవారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు, లాభ-నష్టాలు సమానంగా ఉంటాయి
సింహ రాశి
ఈ రాశివారికి రోజు ప్రారంభంలో కొన్ని అడ్డంకులు ఉండొచ్చు. బిజీబిజీగా ఉంటారు. ఈ రోజు మీరు ఆర్థిక ప్రణాళికలో ప్రయోజనాలను పొందుతారు. ఇరుగుపొరుగు వారి నుంచి ఒత్తిడి ఉండొచ్చు. ఈరోజు విద్యార్థులు తమ స్నేహితులతో సరదాగా స్పెండ్ చేస్తారు.
కన్యా రాశి
ఈ రోజు ఈ రాశికి చెందిన కొందరు సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది..వాటిని ధైర్యంగా తిప్పికొట్టడంలో సక్సెస్ అవుతారు. ఉద్యోగులకు కింది అధికారుల వల్ల కొన్ని ఆకస్మిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది
తులా రాశి
ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో పెద్ద నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండవచ్చు. మీ అవగాహన, వినయంతో అందరి మెప్పు పొందుతారు. కుటుంబంలో నెలకొన్న సమస్యలు ఈరోజు పరిష్కారమవుతాయి.
వృశ్చిక రాశి
మీ ప్రత్యర్థులు కొందరు మిమ్మల్ని తప్పుగా నిరూపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి రావొచ్చు. మీరు ఆలోచనల దృఢత్వంతో జాగ్రత్తగా పని చేస్తారు.
Also Read: ఈ వారం ఈ రాశులవారిపై లక్ష్మీదేవి కృప ఉంటుంది, ఫిబ్రవరి 6 నుంచి 12 వారఫలాలు
ఈ రోజు మీ కోరికలు కొన్ని నెరవేరుతాయి. మీరు క్రమపద్ధతిలో పని చేస్తే అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం.
మకర రాశి
ఈ రోజు ఈ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అనవసర ఖర్చు మానుకోండి. ప్రభుత్వం ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. మీ మాటతీరుతో ఆకట్టుకుంటారు. వివాహితుల జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు.
కుంభ రాశి
ఈ రోజు భగవంతుని స్మరణలో గడుపుతారు. ఉద్యోగ-వ్యాపారాలలో అనుకూల పరిస్థితి ఉంటుంది. ఈరోజు మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఏదైనా పని గురించి ఆలోచించి త్వరగా నిర్ణయం తీసుకుంటారు.
మీన రాశి
ఈ రోజు ఈ రాశివారు మిశ్రమ ఫలితాలు పొందుతారు...మొదట్లో కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ ఎట్టకేలకు పూర్తవుతాయి. ప్రశాంతంగా ముందుకు సాగడం వల్ల మంచి జరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
Magnetic Mud Pot: చేతిలో డబ్బులు నిలవడం లేదా? ఈ మ్యాజిక్ మట్టి కుండ మీ ఇంట్లో పెట్టేసుకోండి
Sri Rama Pattabhishekam 2023: శ్రీరామ పట్టాభిషేకం ఫొటో ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా!
Sri Rama Pattabhishekam 2023: పాలకులు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారు, కలియుగంలో రామరాజ్యం సాధ్యమా!
మార్చి 31 రాశిఫలాలు, ఈ రాశివారు ఇతరుల మాటకాదు మనసు చెప్పింది వినండి!
Sri Rama Navami 2023: నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం
Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!
Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?
PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా- ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు