February 6 to 12 Weekly Horoscope 2023: ఈ వారం ఈ రాశులవారిపై లక్ష్మీదేవి కృప ఉంటుంది, ఫిబ్రవరి 6 నుంచి 12 వారఫలాలు
Weekly Rasi Phalalu In Telugu : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
February 6 to 12 Weekly Horoscope 2023: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి (అశ్వని, భరణి, కృత్తిక 1 పాదాల)
ఈ రాశివారికి సూర్య సంచారం కలిసొస్తుంది. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి కానీ మీ మనసు చంచలంగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులుంటాయి. ఓర్పూ ఏకాగ్రతా అవసరం..నమ్మిన సిద్ధాంతంతోనే ముందుకు సాగాలి. స్థిరాస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకునేందుకు ఇదే మంచిసమయం ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వారం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులుంటాయి.
వృషభ రాశి (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఉద్యోగులకు గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో క్రమేపీ లాభాలొస్తాయి. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. తీసుకునే నిర్ణయాలు ధర్మమార్గంలో ఉండాలి. ఒత్తిడిని అధిగమించేందుకు ప్రయత్నించండి.మీ ప్రవర్తనతో శత్రువులు కూడా మిత్రులవుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయపడతారు. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. పారిశ్రామికవర్గాల వారికి అనుకూల సమయం. ఖర్చులు నియంత్రించుకోవాలి.
Also Read: ఈ రాశులవారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు, లాభ-నష్టాలు సమానంగా ఉంటాయి
కర్కాటక రాశి (పునర్వసు 4 పాదాలు, పుష్యమి, ఆశ్లేష)
మీకు మంచి టైమ్ నడుస్తోంది. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మీరు చేయాల్సిన పనులను వాయిదా వేయొద్దు. స్థిరాస్తి వ్యవహారాలు కలిసొస్తాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. దైవదర్శనం ఆనందాన్నిస్తుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
కన్యా రాశి (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఈ రాశివారికి దైవబలం అండగా ఉంటుంది..ప్రశాంతంగా పనులు ప్రారంభించండి సక్సెస్ అవుతారు. ఉద్యోగులు పనితీరుకి ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో సానుకూల నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లాభాలు పొందుతారు. ఓ పని అయినట్టే అయి ఆఖరి నిముషంలో ఇబ్బందులొస్తాయి. ఓర్పుతో ప్రయత్నించాలి. వారాంతంలో శుభవార్త వింటారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే పనులు ముందుకు సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. పెట్టుబడులు సమకూరతాయి.
వృశ్చిక రాశి (విశాఖ 4 పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఈ వారం ఈ రాశివారికి అనుకూలమైన సమయం. ఉద్యోగులుకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలొస్తాయి. రాజకీయ వర్గాలకు అనుకూల సమయం. మీ నిర్ణయాలు అందరకీ ఉపయోగకరంగా ఉంటాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబంలో సమస్యలుంటాయి. అనుకున్న పనులు కొంత కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కుటుంబసభ్యులతో విభేదాలు తొలగిపోతాయి.
Also Read: ఫిబ్రవరి నెల ఈ రాశులవారికి సమస్యలు, సవాళ్లు తప్పవు - నెలాఖరు కాస్తంత రిలీఫ్
మీన రాశి (పూర్వాభాద్ర 4 పాదాలు, ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంటుంది. ధర్మమార్గాన్ని వీడొద్దు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల వల్ల మేలు జరుగుతుంది. మీ ఉత్సాహమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి. సంకల్పబలంతో పనిచేస్తే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో నష్టాలున్నాయి జాగ్రత్త. కొత్త పెట్టుబడులకు అనుకూలమైన సమయం. కొన్నివిషయాల్లో రిస్క్ చేస్తేనే ఫలితం దక్కుతుంది. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. కళారంగంవారికి అనుకూల సమయం.