2023 February Monthly Horoscope: ఫిబ్రవరి నెల ఈ రాశులవారికి సమస్యలు, సవాళ్లు తప్పవు - నెలాఖరు కాస్తంత రిలీఫ్
Rasi Phalalu February 2023 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
February 2023 Horoscope Predictions: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఫిబ్రవరి నెల ఈ రాశులవారికి కొన్ని ఇబ్బందులు తప్పవు కానీ నెలాఖరుకి కొంత రిలీఫ్ ఉంటుంది.
వృషభ రాశి
వృషభరాశివారికి ఫిబ్రవరి నెల మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఏ పని చేసినా లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు కొంత కష్టంమీద నెరవేరుతాయి. నెల ప్రారంభంలో కొంత ఆందోళన ఉంటుంది. పిల్లలకు సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. నెల మధ్యలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఫిబ్రవరి రెండో వారంలో పనిభారం పెరుగుతుంది. మీ సహోద్యోగులు, సీనియర్లు, జూనియర్ల నుంచి మద్దతు సరిగా ఉండదు. నెల ద్వితీయార్ధం మీకు బావుంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభసమయం.
కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి ఈ నెల ప్రారంభంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. పనిప్రాంతంలో సహోద్యోగుల నుంచి ఎక్కువ మద్దతు లభించకపోవడం మనస్సు విచారంగా ఉంటుంది. సమయం అనుకూలంగా లేనప్పుడు ఓ అడుగు తగ్గడమే మంచిది. ఆరోగ్య పరంగా కూడా అంతగా బాలేదు జాగ్రత్త పడండి. ప్రయాణ సమయంలో భద్రత చాలాఅవసరం. ఫిబ్రవరి మూడో వారంలో ఏదైనా వ్యాపారంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. కోర్టు వివాదాలను కోర్టు వెలుపల అంగీకారంతో పరిష్కరించుకుంటే మంచిది. ఉద్యోగులకు సవాళ్లు తప్పవు. మాటపట్టింపులు, కుటుంబంలో వివాదాలు ఉండొచ్చు. నమ్మినవారి వలన మోసపోతారు. మీరు సంయమనం పాటిస్తేనే కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.
Also Read: ఈనెల ఈ రాశులవారికి ఊహించని సక్సెస్, ఆర్థిక ప్రయోజనాలు, ఆనందం - ఫిబ్రవరి రాశిఫలాలు
కన్యా రాశి
ఈ రాశి వారికి ఫిబ్రవరి నెల మిశ్రమంగా ఉంటుంది. నెల ప్రారంభంలో తీరికలేకుండా గడుపుతారు. కొన్ని పనులకు సంబంధించి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కమీషన్ పై పనిచేసే వారికి కొంత ఆందోళన ఉంటుంది. వ్యాపారాలతో సంబంధం ఉన్నవారికి సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగులు నెలాఖరుకల్లా ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడతారు. కార్యాలయంలో ప్రత్యర్థుల ఎత్తుగడలు విఫలం అవుతాయి. కష్టపడి పనిచేయడం ద్వారా విజయం సాధిస్తారు. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే ఆటంకాలు తొలగిపోతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే శుభవార్త అందుతుంది. బంధుమిత్రులవలన ధనవ్యయం ఉంటుంది. ఇంట్లోవారి కారణంగా మనోవిచారం ఉండొచ్చు.
ధనుస్సు రాశి
ఈ రాశివారికి ఫిబ్రవరి నెల మిశ్రమంగా ఉంటుంది. ఈ మాసంలో వృత్తి, వ్యాపారాలలో ఒడిదొడుకులు ఉంటాయి. మీరు తలపెట్టిన పనులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది కానీ అతికష్టంమీద పూర్తవుతాయి. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువ ఆలోచించవద్దు. పనిలో 100 శాతం ఇవ్వడానికి ప్రయత్నించండి. మీ మాటలను నియంత్రించుకోండి. వ్యాపారంతో సంబంధం ఉన్నవారు మార్కెట్లో చిక్కుకున్న డబ్బును ఉపసంహరించుకోవడం కష్టమవుతుంది. ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఉంటుంది. చెడు స్నేహాలు, దురలవాట్లకు చేరవయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్త పడండి. ఫిబ్రవరి చివరి సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ బంధం బాగుంటుంది.
Also Read: ఫిబ్రవరి 1 భీష్మ ఏకాదశి, ఈ రోజు ఇలాచేస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయం
మకర రాశి
మకర రాశివారు ఈ నెలలో ఆరోగ్యం, బంధాల విషయంలో జాగ్రత్త అవసరం. బంధుమిత్రులతో వివాదాలుంటాయి, సమయానికి తిండి నిద్ర ఉండదు. ప్రేమ, వైవాహిక బంధం బలపడాలంటే భాగస్వామి పట్ల శ్రద్ధ వహించాలి. ఫిబ్రవరి రెండో వారంలో ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తుంది. ఈ నెల మధ్యలో భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే దానినుంచి ప్రయోజనాలు పొందుతారు. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికందుతుంది. ఆస్తుల గొడవలు ఓ కొలిక్కి వస్తాయి. నెల రెండోభాగంలో విజయంతో పాటూ గౌరవం కూడా పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
కుంభ రాశి
ఫిబ్రవరి నెల ప్రారంభం కుంభరాశివారికి సవాల్ గా ఉంటుంది. ఇంటా బయటా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగా ఉంటుంది. ఉద్యోగులు లక్ష్యసాధనకు అదనపు శ్రమ అవసరం. వ్యాపార రంగాల వారికి ఈ మాసంలో మాంద్యం ఎదురుకావచ్చు. నెల మధ్యలో కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. నెలాఖరులో చేసే పనులు సక్సెస్ అవుతాయి. నమ్మినవారి వల్ల మోసపోతారు. ప్రేమ భాగస్వామితో వివాదాలుంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.