By: ABP Desam | Updated at : 14 Feb 2022 10:03 AM (IST)
Edited By: RamaLakshmibai
Guppedantha Manasu February 14th Episode 373 (Image Credit: Star Maa/Hot Star)
గుప్పెడంత మనసు (Guppedantha Manasu ) ఫిబ్రవరి 14 సోమవారం ఎపిసోడ్
లైబ్రరీ డోర్స్ లాక్ తీసిన గౌతమ్..లోపలున్న వసుని చూసి షాక్ అవుతాడు. నువ్వేంటి ఇక్కడ అనేలోగా లోపల నుంచి రిషి బయటకు వస్తాడు. చూసుకోవాలి కదా ఇంకెవరైనా ఉండిపోయి ఉంటే పెద్ద హడావుడి జరిగేది..లాక్స్ వేసేటప్పుడు ఓసారి చూసుకోండి అంటాడు. నన్ను-వసుని లోపలుంచి తాళాలు వేసి ఉండాల్సింది అనుకుంటాడు గౌతమ్. భయపడ్డావా వసుధార అంటే.. సార్ ఉండగా నాకేంటి అంటుంది. ఆ మాటలు విన్న రిషి.. తను అప్పుడే భయపడినట్టు ఉంటుంది, అప్పుడే ధైర్యంగా ఉంటుంది..నాపై తనకు ఎంత నమ్మకమో... తను నాకు ప్రత్యేకం.. మరి నేనో అని ఆలోచిస్తాడు. ఇంతసేపు లోపలున్నారంటే ఏం మాట్లాడుకుని ఉంటారు అని గౌతమ్ ఆలోచిస్తాడు. నువ్వు నాకెందుకు కాల్ చేయలేదని రిషిని గౌతమ్ అడగ్గా..చెబితే రచ్చ చేస్తావని చెప్పలేదని క్లారిటీ ఇస్తాడు. నువ్వు MD ( మిత్రద్రోహి) అని మనసులో అనుకుంటాడు గౌతమ్.
వసుధారని అద్దంలోంచి చూస్తూ కార్ డ్రైవ్ చేస్తుంటాడు రిషి. వీడికి లక్ బావుంది, ఇంత మంచి గోల్డెన్ ఛాన్స్ నాకు రాలేదేంటి, అసలు లోపల ఏం జరిగి ఉంటుందని ఆలోచిస్తాడు గౌతమ్. అదృష్టం, దురదృష్టం అని రెండుంటాయి..కొందరికి అదృష్టం చూయింగ్ గమ్ లా అంటుకుంటుంది ఏం చేస్తాం అంటాడు. సడెన్ గా ఈ అదృష్టం, దురదృష్టం గురించి మాట్లాడుతున్నావేంటి అన్న రిషితో...ఏమోలో అని నిట్టూరుస్తాడు. వసుధారతో లైబ్రరీ ఇష్యూ గురించి మాట్లాడాలనుకున్న గౌతమ్ కి తొడపాసం పెడతాడు రిషి. అంత గట్టిగా అరిచారేంటి అన్న వసు ప్రశ్నకి ... అప్పుడప్పుడు నేను గట్టిగా అరుస్తుంటా అని సమాధానం చెబుతాడు. ఇంతకుముందు ఇలా అరిచే అలవాటు లేదుకదా ఎప్పటినుంచి స్టార్ట్ అయిందని రిషి కౌంటర్ వేయడంతో, ఇప్పుడే మొదలైందంటాడు గౌతమ్. తొడపాసం పెట్టిన బాధకన్నా వీళ్లిద్దరూ లైబ్రరీలో ఉండిపోయిన బాధే ఎక్కువ ఉందనుకుంటాడు. నాక్కూడా ఎప్పుడో అప్పుడు ఇలాంటి ఛాన్స్ ఇవ్వు దేవుడా అని నమస్కారం పెట్టుకుంటాడు.
Also Read: తమ దగ్గరున్న ఆనంద్ మోనిత కొడుకే అని దీప-కార్తీక్ తెలుసుకుంటారా, కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
జగతికి కాల్ చేసిన మహేంద్ర.. ఇక్కడ నాకు వెలితిగా ఉందని బాధపడతాడు. ఇదే ఫీలింగ్ చాలా ఏళ్లుగా నేను అనుభవిస్తున్నానంటుంది జగతి. పండుగ వచ్చింది వెళ్లింది..మళ్లీ వస్తుంది.. నేను వచ్చాను వెళ్లాను..మళ్లీ రాను అని చెబుతుంది జగతి. అక్కడకు వస్తానన్న మాటలకు అడ్డుపడిన జగతి.. వద్దు అటు ఇటు తిరిగి అలసిపోవద్దు, రిషి బాధపడతాడు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. వసుధారని ఇంటిముందు దించేసి వెళ్లిపోతారు రిషి, గౌతమ్. కట్ చేస్తే ఇంట్లో సోఫాలో కూర్చున్న మహేంద్ర, ఫణీంద్రని చూసి ఇద్దరూ బిజీగా ఉన్నారు కానీ రిషి ఇంకా రాలేదని గమనించారా అని అడుగుతుంది దేవయాని. రిషి చిన్నపిల్లాడు కాదు వస్తాడు అని రిప్లై ఇస్తాడు మహేంద్ర. మీరేం మాట్లాడరేంటని ఫణీంద్రను రెట్టిస్తుంది, మహేంద్ర ఎలాగూ రిషిని పట్టించుకోవడం లేదు, మీరు కూడా పట్టించుకోకుంటే ఎలా అంటుంది. దేవయాని అస్తమానం ఏదో టాపిక్ తీసుకొచ్చి నీ ధోరణిలో నువ్వు మాట్లాడుతావ్ అని కోప్పడతాడు ఫణీంద్ర. అక్కడకు వచ్చిన ధరణితో రిషి ఏమైనా కాల్ చేశాడా అంటే లేదు మావయ్యగారు అని రిప్లై ఇస్తుంది. ఇంతలో అక్కడకు వచ్చిన రిషితో..నువ్వు కొంచెం లేటయ్యే సరికి పెద్దమ్మ నాకు క్లాస్ ఇస్తోందంటాడు ఫణీంద్ర. షార్ట్ ఫిలిం గురించి డిస్కస్ చేద్దామా అన్న మహేంద్రతో..ఇప్పుడే వచ్చాడుకదా అప్పుడే పని మొదలెట్టారా , రెస్ట్ ఇవ్వండి అని దేవయాని, బాగా చెప్పారు పెద్దమ్మా అనేసి రిషి వెళ్లిపోతాడు.
ఈ టైమ్ లో నేను చేయాల్సింది చేసేస్తా అని చెప్పి గౌతమ్ బయటకు వెళతాడు. వసుధార ఆ లైబ్రరీ ఇన్సుడెంట్ అలా జరగాల్సింది కాదు బ్యాడ్ లక్ అని గౌతమ్ మాట్లాడుతుంటాడు. భయపడ్డావా అంటే రిషి సార్ ఉన్నారు కదా అంటుంది ( వాడున్నాడు కాబట్టే నా భయం) అనుకుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన జగతిని చూసి మేడం మీరెప్పుడు వచ్చారని అడుగుతుంది. ఫోన్లో ఎవరు రిషినా అంటే గౌతమ్ గారు అంటుంది..అటు వైపు గౌతమ్..జగతి మేడంకి ఫోన్ ఇవ్వమంటాడు. వసు, రిషి ఇద్దరూ లైబ్రరీలో ఇరుక్కుపోయిన విషయం మొత్తం చెప్పేస్తాడు. అదెలా అంటే.. వాళ్లిద్దరూ లోపల ఉండగా లైబ్రేరియన్ బయట నుంచి లాక్ చేసుకుని వెళ్లిపోయాడంట..ఆ విషయంలో వసుధార భయపడిందేమో అని ధైర్యం చెప్పేందుకు కాల్ చేశానంటాడు. ఓకే గౌతమ్ అని ఫోన్ వసుధారకి ఇచ్చేస్తుంది జగతి. కాలేజీ లైబ్రరీలో ఏం జరిగిందని జగతి అడుగుతుంది. మొత్తం చెబుతుంది వసుధార. రిషి సార్ ఉంటే నాకు భయమే ఉండదు, ధైర్యంగా ఉంటుందన్న వసుతో ఓసారి రిషికి కాల్ చేయి అంటుంది. వసుకాల్ చేస్తోందేంటి అనుకుని లిఫ్ట్ చేసిన రిషి..నేను జగతిని మాట్లాడుతున్నా అనే గొంతువిని ఆగిపోతాడు. మీకు థ్యాంక్స్ చెప్పాలని కాల్ చేశాను, థ్యాంక్యూ వెరీమచ్ అంటుంది. ఎందుకు అన్న రిషితో..లైబ్రరీలో జరిగిన సంఘటన గురించి అని క్లారిటీ ఇస్తుంది. వసుధారకి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలియదా అని అనుకుంటాడు రిషి.
Also Read: లైబ్రరీలో ఏం జరిగిందని నిలదీసిన జగతి, రిషి ఏం సమాధానం చెబుతాడు, గుప్పెడంతమనసు శనివారం ఎపిసోడ్
రేపటి ( మంగళవారం) ఎపిసోడ్ లో
లైబ్రరీ మేటర్ ఎందుకు చెప్పావ్, ఏది చెప్పాలో ఏం చెప్పకూడదో తెలియదా అంటే నేను చెప్పలేరు సార్ అంటుంది వసుధార. ఇందుకే కదా నిన్ను హాస్టల్ కి ( గతంలో వసుని హాస్టల్ కి పంపించమని జగతికి చెప్పిన సీన్ ప్లే అవుతుంది) అనేసి తడబడతాడు. ఆ తర్వాత కాలేజీలో షార్ట్ ఫిలిం వర్క్ అయిపోయినట్టేనా, మిగిలిన వర్క్ ఉంటే వసు నువ్వు చూసుకో అని చెబుతాడు. అంతా వెళ్లండి అంటూనే మేడం మీతో మాట్లాడాలి అని ఉండమంటాడు.
Sita Ramam Teaser: కశ్మీర్ కొండల్లో ఒంటరి సైనికుడికి ప్రేమలేఖ - ఎవరా అజ్ఞాత ప్రేయసి?
Pathaan First Look: షారుఖ్ ఖాన్ 'పఠాన్' - తెలుగులోనూ వచ్చెన్, విడుదల తేదీ కూడా
DJ Tillu 2 Launched: సూపర్ హిట్ 'డీజే టిల్లు'కు సీక్వెల్, క్రేజీ అప్డేట్ ట్వీట్ చేసిన ప్రొడ్యూసర్
Chinmayi Sripada: డాడీ డ్యూటీస్‌లో రాహుల్ రవీంద్రన్ - చిల్డ్రన్ ఫోటోలు షేర్ చేసిన చిమ్మాయి
Virata Parvam: విరాట పర్వానికి కమల్ హాసన్‌కు లింకేంటి? వెంకటేష్ ప్రభు కార్తీక్ రాజా పేరు ధనుష్‌గా ఎలా మారింది?
Maharashtra Politcal Crisis: శివసేన కార్యకర్తలు వీధుల్లోకి వస్తే సీన్ వేరేలా ఉంటుంది, షిండేకి సంజయ్ రౌత్ వార్నింగ్
RBI Blockchain: నీరవ్ మోదీ తరహా దొంగల కోసం 'బ్లాక్ చైన్' వల పన్నుతున్న ఆర్బీఐ!
Govt Teachers Properties : ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు అందించాలి, తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంచలన నిర్ణయం!
Bharat NCAP Crash Test Rating: వచ్చే ఏడాది నుంచి కార్లకు ఆ పరీక్ష తప్పనిసరి, స్టార్ రేటింగ్‌తో రోడ్డు భద్రత