అన్వేషించండి

Guppedantha Manasu ఫిబ్రవరి 10 ఎపిసోడ్: లైబ్రరీలో ఇరుక్కుపోయిన టెన్షన్లో రిషి, ధ్యానంలో వసు, బయట గౌతమ్ .. గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. వారం పాటూ సంక్రాంతి సంబరాలు, జగతిపై దేవయాని రివెంజ్ చుట్టూ నడిచిన ఎపిసోడ్ మళ్లీ లవ్ ట్రాక్ ఎక్కింది. ఫిబ్రవరి 10 గురువారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

జగతి మేడం గురించి మాట్లాడుదాం అనుకుంటే ఆ అవకాశమే రిషి సార్ ఇవ్వలేదని బాధపడుతుంది వసు. రమ్మన్నారు కానీ ఉండమని అడిగితే బావుండేది అనుకుంటుంది. ఇంతలో రిషి నుంచి మెసేజ్ రావడంతో... పిలవగానే పండుగకి వచ్చినందుకు ఇద్దరి థ్యాంక్స్, మా ఇంట్లో సౌకర్యాలు బావున్నాయా అని మెసేజ్ చేస్తాడు. ఏమని రిప్లై ఇవ్వాలని ఆలోచిస్తుంది వసుధార. ఫోన్ చూసుకుంటూ తన రూమ్ కి వచ్చిన రిషిని చూసి ఎక్కడికి వెళ్లావ్ ..చెబితే నేను కూడా వచ్చేవాడిని అంటాడు గౌతమ్. అందుకే చెప్పలేదంటాడు రిషి. ఓ కవిత రాశాను ఎలా ఉందో చెప్పు అని గౌతమ్ అంటే చెప్పొద్దు అంటాడు రిషి. అయినా చెబుతా విను అనడంతో తప్పుతుందా చెప్పు అంటాడు రిషి. నీ చిరునవ్వులు నాకు వరం..నీ పేరు తలుచుకుంటేనే నాకు ప్రేమ జ్వరం అంటూ వసుని తలుచుకుంటూ రాసిన కవిత రిషికి వినిపిస్తాడు. ఎలా ఉందని గౌతమ్ అంటే..ఎలాగో ఉందని రిషి రిప్లై ఇచ్చి పడుకోరా అంటాడు. ఇంతలో రిషి సెల్ మోగడంతో ఇప్పుడు మెసేజ్ లు ఏంటని ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తాడు..ఫోన్ లాగేసుకుంటాడు రిషి. సౌకర్యాలు బావున్నాయి కానీ అని ఆపేసిన వసు రిప్లై చూసి కానీ ఏంటి అనుకుని గుడ్ నైట్ అని రిప్లై ఇస్తాడు. ప్రేమంటే ఏంటని గౌతమ్ అడిగితే గుడ్ నైట్ అంటాడు. గుడ్ నైట్ కాదు గుడ్ లైఫ్ అంటాడు గౌతమ్.

Also Read: మోనిత కొడుక్కి సౌందర్య ఇంట్లో వేడుక, షాక్ ఇచ్చిన శౌర్య .. కార్తీకదీపం గురువారం ఎపిసోడ్
ఈ రోజు ఎలాగైనా నా మనసులో మాట చెప్పేస్తాను..ఐ లవ్ యూ అంటూ వసు బొమ్మ ముందు నిల్చుని మాట్లాడుతాడు. రిషి విలన్ లా తయారయ్యాడు, నువ్వేమంటావో తెలియదు.. నా ప్రేమ గెలుస్తుంది..అయినా ప్రేమని ఎవరూ గెలిపించాల్సిన అవసరం లేదు..ప్రేమ గొప్పది కాబట్టి ప్రేమే ప్రేమని గెలిపిస్తుందని ఏదేదో మాట్లాడుకుంటాడు. వసు బొమ్మ తీసుకుని బయలుదేరుతాడు. రిషి-గౌతమ్ ఇద్దరూ కాలేజీకి బయలుదేరుతారు. రిషికి కనిపించకుండా ఆ బొమ్మని గౌతమ్ దాచడం చూసి ఏమైందని అడుగుతాడు రిషి. ఏం లేదనేస్తాడు. మధ్యలో కారు ఆపేసి గౌతమ్ ని దిగమంటాడు. నేను దిగను అన్న గౌతమ్ ని కిందకు లాగేసి..సీట్లో ఉన్న చార్టుని తీసి వెనక పడేస్తాడు. వామ్మో ఇక్కడ ఇన్ని ఉన్నాయేంటి..కాలేజీ నడుపుతున్నావా స్టేషనరీ షాప్ నడుపుతున్నావా అంటాడు. ఇన్నింటి మధ్య వసు బొమ్మని ఎక్కడ వెతుక్కోవాలో అనుకుంటాడు గౌతమ్. సీట్లో కూర్చున్నట్టే కూర్చుని అందులో ఒక చార్ట్ తీసి పట్టుకుంటాడు. నేను తీసుకున్నది వసు బొమ్మేనా కాదా ..నా ప్రేమ అలాంటిది వసుదే అయిఉంటుందని ఫిక్సైపోతాడు.

కట్ చేస్తే కాలేజీలో సీన్ ఓపెన్ అవుతుంది. క్లాస్ రూమ్ లో కూర్చున్న వసుధార మ్యాథ్స్ చేస్తూ లెక్కని పదే పదే కొట్టేస్తుంది. అది చూసిన రిషి ఇన్నిసార్లు కొట్టేశావేంటి..నేను చెప్పినా అర్థంకాలేదా, ప్రాబ్లెమ్ నీలో ఉందా నాలో ఉందా అంటాడు. ఇద్దరి లోపం కాదు సార్ ..మీరింకా చెప్పలేదు..చెప్పనది కూడా ప్రాక్టీస్ చేస్తున్నా అంటుంది. నేను చెప్పకముందే ప్రాక్టీస్ చేస్తున్నావంటే నేను చెప్పడం ఎందుకు రేపటి నుంచి క్లాస్ నువ్వే చెప్పు అంటాడు. ఏదీ నన్ను చూడనివ్వు అని వసు పక్కనే కూర్చుంచాడు. లెక్కని ఎక్స్ ప్లైన్ చేస్తున్న రిషిని చూస్తూ ఉండిపోతుంది వసుధార ( బ్యాంగ్రౌండ్ లో ఏ కన్నులూ చూడని సాంగ్ ప్లే అవుతుంది). చిన్నప్పుడు రిషి సార్ కి కూడా మేడం ఇలాగే చెప్పేవారేమో అని ఊహించుకుంటుంది వసు. తాను చెప్పింది వినడం లేదని గమనించిన రిషి ఏమైందని అడుగితే ఏం లేదు అనేస్తుంది వసు. సడెన్ గా ఎక్కడికో వెళ్లిపోతావ్ ఏంటి..లెక్ అర్థమైందా అంటే కాలేదు అని రిప్లై ఇస్తుంది. సరే ఈవెనింగ్ కలసిప్పుడు లెక్క చెబుతాను అనేసి వెళ్లిపోతాడు. 

Also Read: రిషికి అమ్మగా జగతి ఇంట్లో అడుగుపెట్టాలన్న మహేంద్ర.. మీ ఒంటరి తనాన్ని గౌరవిస్తానన్న రిషి.. గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్
కాలేజీ బయట నిల్చున్న గౌతమ్.. ఓ ప్రేమ, పిచ్చి అంటూ పాటలు పాడుకుంటాడు. తన వెంటతీసుకొచ్చి చార్టు ఓపెన్ చేసి వసు బొమ్మ చూస్తుంటాడు. రిషి గాడు వసుధార కళ్లు ఎంత బాగా గీశాడో అనుకుంటాడు. ఈ బొమ్మని వసుకి ఇచ్చి క్రెడిట్ అంతా మనమే కొట్టేయాలి...ఈ రిషి డ్యూటీ అప్పగించి వెళ్లాడు..కారు దగ్గర కాపలా అనుకుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన పుష్ప...కార్ లో చార్టులున్నాయంట కదా తీసుకొచ్చి మహేంద్ర సార్ కి ఇమ్మన్నారని చెబుతుంది.

రేపటి ( శుక్రవారం) ఎపిసోడ్ లో
లైబ్రరీలో రిషి..వసుధార ఉన్నారన్న విషయం చూసుకోని లైబ్రేరియన్ లైట్స్ ఆఫ్ చేసి డోర్స్ వేసుకుని వెళ్లిపోతాడు. ఇప్పుడేం చేద్దాం అని వసు అడిగితే లైబ్రేరియన్ కి కాల్ చేద్దాం..ఇద్దరం ఇక్కడే ఉన్నామని తెలియకూడదు మాట్లాడకు అని చెబుతాడు. కాల్ తీయడం లేదని రిషి టెన్షన్ పడుతుంటే..వసు మాత్రం ఓ బెంచ్ పై కూర్చుని ధ్యానం చేస్తుంటుంది. అన్నిటికీ టెన్షన్ పడితే ఎలా సార్ అంటుంది....

Also Read: కార్తీక్ కోసం తాడికొండ తిరిగొచ్చిన మోనిత.. సౌందర్య ఏం చేయబోతోంది .. కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Best Budget 9 Seater SUV: చవకైన 9 సీటర్లలో బెస్ట్ కారు ఇదే - పెద్ద ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఆప్షన్!
చవకైన 9 సీటర్లలో బెస్ట్ కారు ఇదే - పెద్ద ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఆప్షన్!
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Best Budget 9 Seater SUV: చవకైన 9 సీటర్లలో బెస్ట్ కారు ఇదే - పెద్ద ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఆప్షన్!
చవకైన 9 సీటర్లలో బెస్ట్ కారు ఇదే - పెద్ద ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఆప్షన్!
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
iPhone 15 Pro Max Offer: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
Bengalore: సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Embed widget