Karthika Deepam ఫిబ్రవరి 10 ఎపిసోడ్: మోనిత కొడుక్కి సౌందర్య ఇంట్లో వేడుక, షాక్ ఇచ్చిన శౌర్య .. కార్తీకదీపం గురువారం ఎపిసోడ్

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ ఫిబ్రవరి 10 గురువారం 1272 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

FOLLOW US: 

కార్తీకదీపం ఫిబ్రవరి 10 గురువారం ఎపిసోడ్

కార్తీక్, దీపని ఇంటికి తిరిగి రమ్మని కన్నీళ్లతో సౌందర్య అడిగినా ససేమిరా అనేస్తాడు కార్తీక్. నిన్నగాక మొన్న మీ దగ్గరకు వచ్చిన బాబుపై మీకు అంత అభిమానం ఉంటే కన్న కొడుకువి నీపై నాకు ఎంత ప్రేమ ఉంటుందో ఊహించలేవా... హిమ కాసేపు కనిపించకపోతే అక్కడ కన్నీళ్లు పెట్టుకుని కాళ్లుపెట్టుకున్నారు...ఇన్ని రోజులు మీరెక్కడున్నారో ఏంటో తెలియక మేం ఎంత నరకం చూసుంటామో తెలుసా అంటుంది. సరే మీరు మాట్లాడకపోతే మీరు రాను అని చెబితే నేను ఇక్కడి నుంచి వెళతా అనుకుంటున్నారా..మీకే అంత పట్టుదల, మొండితనం ఉంటే నాకెంత ఉండాలి, చెప్పకుండా వెళ్లిపోవడం, ఫోన్ పడేయడం మీకు మాత్రమే తెలుసా, ఆ పని నేను, డాడీ కూడా చేయగలం. మీరు నాతో హైదరాబాద్ కి రాకపోతే నేను మీ నాన్న ఎక్కడికైనా వెళ్లిపోతాం, అవసరమైనతే ఇద్దరం కలసి అని సౌందర్య మాట్లాడుతుండగా అలా అనొద్దు మమ్మీ అని ఆపేస్తాడు కార్తీక్. మనమంతా హైదరాబాద్ వెళుతున్నామా లేదా అని రెట్టించిన సౌందర్యతో నీ ఇష్టం మమ్మీ అంటాడు.

Also Read: లైబ్రరీలో ఇరుక్కుపోయిన టెన్షన్లో రిషి, ధ్యానంలో వసు, బయట గౌతమ్ .. గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్
ఎంత ఆశగా తాడికొండ వచ్చాను భారతి అయినా కార్తీక్ కనిపించలేదు.. నా కష్టాలు ఎప్పుడు తీరుతాయో అని బాధపడుతుంది మోనిత. భారతి మాత్రం కూల్ గా పుస్తకం చదువుకుంటుంటే.. దాన్ని తీసి విసిరికొట్టి నా బాధ పట్టడం లేదా అని ప్రశ్నిస్తుంది. అసలు నీవి కష్టాలే కావు, నువ్వు కొనితెచ్చుకున్నవి అంటుంది భారతి. నా కార్తీక్ నాకు దక్కుతాడు అందులో ఎలాంటి సందేహం లేదు కానీ ఈ గొడవలో పడి నా కొడుకుని వెతకడం మర్చిపోయానని మోనిత అంటే..నువ్వు పోలీసుల సాయం తీసుకోవాలని చెబుతుంది భారతి. బిడ్డను దూరం చేసుకున్న తల్లి బాధ చాలా కష్టమైంది, నువ్వు మొండిదానికి కాబట్టి భరిస్తున్నావ్ అంటుంది భారతి.

మరోవైపు హిమ ఇంట్లో కూర్చుని రుద్రాణి మనుషులు ఎత్తుకెళ్లడం గురించి తలుచుకుని ఏడుస్తుంది. నానమ్మ రాకపోయి ఉంటే నేను ఇంటికి వచ్చేదాన్ని కాదేమో అని శౌర్యకి చెప్పి బాధపడుతుంది. నన్ను ఈ ఊర్లోంచి ఎక్కడికో తీసుకెళతా అన్నారు, ఎప్పటికీ నిన్ను, తమ్ముడిని చూడలేను అనుకున్నా అని హిమ... నేను కూడా చాలా ఏడ్చా అని శౌర్య చెప్పుకుంటారు. ఇక ఎలాంటి భయం లేదు..మనం హైదరాబాద్ వెళ్లిపోతాం అంటుంది శౌర్య. అక్కడుంటే ఏ బాధా ఉండదంటుంది హిమ. దీపూ-ఆనంద్ ఒకేచోట ఉంటారు ఇద్దరూ కలసి ఆడకుంటారు, హైదరాబాద్ వెళ్లాక మనం నానమ్మ చెప్పిందే విందాం అంటుంది. అమ్మా-నాన్న మాట వినొద్దా అని హిమ అంటే.. వాళ్లు ఏం చెప్పినా నానమ్మకి కూడా ఓ మాట చెప్పి చేద్దాం అని క్లారిటీ ఇస్తుంది శౌర్య. 

అటు సౌందర్య తన వెంట తీసుకొచ్చిన పిల్లల పుస్తకాలు చూపించి బాధపడుతుంది. నువ్వైనా ఒక్కసారైనా పెద్దోడితో చెప్పాలికదా అని అన్న సౌందర్య..మేం బాగానే ఉన్నామని ఒక్కమాటైనా చెప్పి ఉంటే బావుండేది కదా అంటుంది. అన్నింటికీ మౌనంగా ఉండిపోతారు దీప-కార్తీక్. బుక్స్ తో పాటూ ఉన్న పర్స్ చూసి ఇది ఎవరిది అని శౌర్య అడగ్గా...మీ నాన్నది అని చెబుతుంది సౌందర్య.  ఆ పర్స్ అడిగి అందులో డబ్బులు తీసి చూసి ఎన్ని డబ్బులో..ఇంత డబ్బులు ఈ మధ్య ఎప్పుడూ చూడలేదంటారు హిమ, శౌర్య. చూశావా పెద్దోడా ఇక్కడున్న కష్టాలకు పర్స్ లో డబ్బులే ఎక్కువ అనుకుంటున్నారని బాధగా చెబుతుంది. అవి నిజంగా నీ డబ్బులే వాటితో దీప బంగారాన్ని తాకట్టు నుంచి విడిపించుకురా అని సౌందర్య అంటే.. తాకట్టు పెట్టానని చెప్పలేదు కదా అని దీప అంటుంది. కష్టాల్లో ఆదుకునేవి అవేకదా ఆమాత్రం ఊహించలేనా అని క్లారిటీ ఇస్తుంది సౌందర్య. ఆ డబ్బులు తీసుకుని వెళ్లి తేవాలంటే సిగ్గుగా ఉందంటాడు కార్తీక్. అవి నీ కష్టార్జితం గర్వంగా ఖర్చుపెట్టుకోవచ్చంటుంది సౌందర్య.

Also Read: రిషికి అమ్మగా జగతి ఇంట్లో అడుగుపెట్టాలన్న మహేంద్ర.. మీ ఒంటరి తనాన్ని గౌరవిస్తానన్న రిషి.. గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్
ఆస్తులు, హోదా ఏవీ లేకున్నా పర్వాలేదు అందరం కలసి ఉందాం అంటుంది సౌందర్య. ఆశ్రమంలో మీ నాన్న మాటలు వింటుంటే నిన్ను చూడకుండానే ఇద్దరం చచ్చిపోతాం అనిపించింది అంటుంది( గతంలో హోటల్ నుంచి పార్సిల్ తీసుకెళ్లినప్పుడు తండ్రి మాటలు విన్న సందర్భం గుర్తుచేసుకుంటాడు కార్తీక్). ఆశ్రమంలో మిమ్మల్ని ఓసారి చూసి పలకరించే ధైర్యం లేక వెనక్కు వచ్చేశాను. భోజనం తీసుకొచ్చి కనిపించకుండా దాక్కున్నా అని కార్తీక్.. ఇద్దరం చూశాం అని దీప చెబుతుంది. ఇంతలో అక్కడకు వచ్చిన హిమ ..డాడీ డబ్బులు చాలా ఉన్నాయి.. రెస్టారెంట్లో భోజనం చేద్దామా అంటుంది. 

పదిరోజుల్లో కార్తీక్, బాబుని తీసుకొస్తానని ఛాలెంజ్ చేశాను కానీ అది నిలబెట్టుకునేలా లేదని బాధపడుతుంది మోనిత. నాతో పాటూ భారతిని ఇబ్బంది పెడుతున్నా అని ఆలోచించి..నా వల్ల ఇబ్బంది పడడం ఇష్టం లేదు వెళదాం పద అంటుంది. కట్ చేస్తే కార్తీక్ వెళ్లి బంగారం విడిపించి తీసుకొచ్చి ఇస్తాడు. దీప ఆభరణాలు వేసుకుంటుంటే చూసి మురిసిపోతాడు కార్తీక్. ఇద్దరూ ఒకర్నొకరు పొగుడుకుంటారు. ఇంతలో అక్కడకు వచ్చిన పిల్లలు ఆనంద్..మనం హైదరాబాద్ వెళ్లిపోతున్నాం అంటారు. కోటేశ్-శ్రీవల్లి బాబుని ఎవరి దగ్గర్నుంచి తెచ్చుకున్నారో చెప్పారా అని సౌందర్య అడిగితే లేదంటారు కార్తీక్ దీప. బ్యాగులు సర్దుకుని బయలుదేరుతుండగా అక్కడకి వచ్చిన రుద్రాణి...మీ పాటికి మీరు వచ్చి చెక్కు రాసి మొహాన కొడితే ఎలా అంటుంది. ఈ చెక్ నాకు వద్దని చెప్పి తిరిగి ఇచ్చేసి నన్ను క్షమించండి సారూ అని...క్షమించండి డాక్టర్ గారూ , దీపమ్మా మన్నించమ్మా అంటుంది. పిల్లలు అంటే ఇష్టం, డబ్బు అధికారం అంటే పిచ్చి ఉండేది.. అహంకారంతో ఎన్నో కష్టాలు పెట్టాను...ఈ మేడం మీ గురించి చెబుతుంటే నా బుర్ర తిరిగిపోయిందంటుంది. ఎపిసోడ్ ముగిసింది...

రేపటి (శుక్రవారం) ఎపిసోడ్ లో
నానమ్మ మనం ఎక్కడికైనా వెళ్లొద్దాం అని హిమ అంటే..ఎక్కడికీ వెళ్లేది లేదు మనింట్లోనే పార్టీ చేసుకుంటున్నాం కదా అంటుంది సౌందర్య. దేనికి అని కార్తీక్ అడిగితే..ఏ తల్లి బిడ్డో మనింటికి చేరాడు అందుకే అంటుంది సౌందర్య. తమ్ముడు నాన్నలాగే ఉంటాడు కదా అని షాకిస్తుంది శౌర్య....

Also Read: కార్తీక్ కోసం తాడికొండ తిరిగొచ్చిన మోనిత.. సౌందర్య ఏం చేయబోతోంది .. కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్

Published at : 10 Feb 2022 09:07 AM (IST) Tags: Karthika Deepam Nirupam Paritala doctor babu premi viswanath Monitha Karthik Deepa Small Screen Serials Rudrani karthika Deepam Serial Today Episode karthika deepam latest episode Sobha Shetty Vantalakka కార్తీక దీపం కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ Karthika Deepam Written Update Future story of Karthika Deepam Nirupam Paritala as Karthik Premi Viswanath as Deepa Shobha Shetty as Monitha Bhavana Reddy as Rudraani. Written UpdateKarthika Deepam 2022 Karthika Deepam 10February Episode

సంబంధిత కథనాలు

Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్

Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్

Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు

Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు

Raghava Lawrence: రాఘవ లారెన్స్ ఈవిల్ గెటప్ - 'రుద్రుడు' రిలీజ్ డేట్ ఫిక్స్

Raghava Lawrence: రాఘవ లారెన్స్ ఈవిల్ గెటప్ - 'రుద్రుడు' రిలీజ్ డేట్ ఫిక్స్

Satyadev: కొరటాల శివతో సత్యదేవ్ సినిమా - 'కృష్ణమ్మ' ఫస్ట్ లుక్

Satyadev: కొరటాల శివతో సత్యదేవ్ సినిమా - 'కృష్ణమ్మ' ఫస్ట్ లుక్

Prashanth Neel-Ramya: నరేష్ మూడో భార్యతో 'కేజీఎఫ్' డైరెక్టర్‌కు ఉన్న రిలేషన్ ఏంటి?

Prashanth Neel-Ramya: నరేష్ మూడో భార్యతో 'కేజీఎఫ్' డైరెక్టర్‌కు ఉన్న రిలేషన్ ఏంటి?

టాప్ స్టోరీస్

IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం

IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం

PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ

PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ

Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు

IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?

IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?