IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Guppedantha Manasu మార్చి 4 ఎపిసోడ్: బంధం, ప్రేమ, స్నేహం, అసూయ- గుండె బరువెక్కించిన శుక్రవారం ఎపిసోడ్

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.జగతి నా భార్య అని మహేంద్ర ప్రెస్ మీట్లో చెప్పడంతో వాతావరణం వేడెక్కింది. ఈ రోజు కూడా ఆ హీట్ కొనసాగింది. మార్చి 4 శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

FOLLOW US: 

గుప్పెడంత మనసు మార్చి 4 శుక్రవారం ఎపిసోడ్
గౌతమ్ కారు డ్రైవ్ చేస్తుంటే రిషి పక్కసీట్లో కూర్చుని కాలేజీలో తండ్రి మాటలు తలుచుకుంటాడు. ఓ దగ్గర సడెన్ గా కారు ఆపుతాడు.
గౌతమ్: నువ్వు సైలెంట్ గా ఉండొద్దు, నిన్ను చూస్తుంటే భయం వేస్తోంది, ఏదైనా మాట్లాడు, ఇదే నీతో వచ్చిన బాధ..అన్నీ మనసులో దాచుకుంటావ్, తక్కువ మాట్లాడతావు, తక్కువ ఎక్ర్ ప్రెస్ చేస్తావ్...అలా మనసులో ఉన్నవన్నీ భారమైపోతాయ్.. నా మాట విను ప్లీజ్..ఏం జరిగింది, ఎందుకు దాచావ్ అని నేను అడగను...నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి..నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను ప్లీజ్ మాట్లాడు అని సముదాయిస్తాడు.
రిషి: మాట్లాడానికి ఏముంటుంది రా.. చిన్నప్పుడు వదిలేసి వెళ్లిపోయింది...నేను నా ఒంటరితనం 
గౌతమ్: అన్నీ ఇచ్చి ఆనందాన్ని తీసుకెళ్లిపోతాడు..ఏదో ఒక లోపం పెట్టకపోతే తనని తల్చుకోం అనుకుంటాడేమో. ఈ సందర్భంలో నేను ఏమీ మాట్లాడను కానీ ఒక్కటి మాత్రం నిజం..నీ ఆనందం నాకు ఆనందం అయినప్పుడు, నీ బాధ నాక్కూడా బాధే కదా..మనసులోంచి ఆ భారాన్ని తీసేయ్యిరా అంటాడు.

Also Read: నువ్వు నటివి అయితే నేను మహానటిని, మోనితకి విశ్వరూపం చూపించిన సౌందర్య
దేవయాని ఇంట్లో
జగతి ఒంటరి కాదు, నా అర్థాంగి అంటూ మహేంద్ర అన్న మాటలు గుర్తుచేసుకున్న దేవయాని... జరిగింది అంతా మీరు చూశారు కదా ఇప్పుడేం చేద్దాం అని ప్రశ్నిస్తుంది. కొన్ని విషయాల్లో కల్పించుకోపోవడమే మంచిది...కాలేజీలో జగతి-మహేంద్ర మధ్య జరిగిన విషయాన్ని అనవసరంగా పెద్దది చేయాలని చూడకు, ఇంతకన్నా నేను చెప్పలేనని క్లారిటీ ఇస్తాడు ఫణీంద్ర. అలా మాట్లాడతారేంటి తప్పుకదా అని దేవయాని అంటే..తప్పొప్పుల గురించి కాదు..ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే ఈ టాపిక్ ఇంట్లో ఎత్తొద్దని చెప్పేసి ఫణీంద్ర వెళ్లిపోతాడు. అప్పుడే ఎంట్రీ ఇస్తాడు మహేంద్ర. దేవయాని వైపు సీరియస్ గా చూస్తూ పైకి వెళ్లిపోతుంటాడు..ఆ వెనుకే రిషి రావడం చూసిన దేవయాని.. ఈ అవశానాన్ని మనం వాడుకోవాలి అనుకుంటుంది. 

దేవయాని: మహేంద్రా  ఏం మాట్లాడకుండా వెళుతున్నావేంటి , రిషి వచ్చాడు మహేంద్ర...నాన్నా నీకోసమే ఎదురు చూస్తున్నాను ఇంకా రాలేదేంటని, అప్పటి నుంచి ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా ఎక్కడికి వెళ్లావ్...అసలు ఈ రోజు మహేంద్ర మనింటింకి వస్తాడా అనుకున్నాను, మనింటికే వచ్చాడు ( మహేంద్ర-రిషిని గమనిస్తుంటుంది) ఏంటి మహేంద్ర నువ్వు చేసింది కరెక్టేనా 

మహేంద్ర: ఇక్కడ ఎవరూ ఎవ్వరికీ సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు వదినగారూ, తప్పా-ఒప్పా అనే ప్రశ్నించే అధికారం, అసరం కూడా ఎవ్వరికీ లేదనే నేను అనుకుంటున్నాను, ఒక విత్తనం భూమిలో నాటితే మొలకెత్తడానికి టైం పడుతుంది...ఓ నిజం బయటపడడానికి ఒక్కోసారి టైం పడుతుంది...ఆ టైమ్ ఈ రోజు వచ్చింది అనుకుంటున్నాను...నేను చెప్పింది నిజం, అబద్ధాన్ని నిజం చేయాలని చూడలేదు..నిజాల్ని నిజం అని చెప్పడం తప్పని నేను భావించడం లేదు..నిజం ఏంటో ప్రపంచానికి తెలపాల్సిన అవసరం నేను కల్పించలేదు...సందర్భం వచ్చింది నేను చెప్పాను. నా మనసుకి నచ్చింది, మా మనస్సాక్షి చెప్పిందే నేను చేశాను, నేను చేసిన దానికి నేనేం ఫీలవడం లేదు...మహేంద్ర భూషణ్ సన్నాఫ్ దేవేంద్ర భూషణ్ ...ఓ పని చేయడానికే ఆలోచిస్తాడు, చేశాక ఆలోచించడు...జగతి నా భార్య అని చెప్పినందుకు నేను గర్వపడుతున్నాను. 

ఈ మాటలు చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు మహేంద్ర- రిషి కోపంగా చూస్తుంటాడు.. రిషి ముందు డ్రామా ప్రారంభిస్తుంది దేవయాని. అసలేం జరుగుతోంది నాన్న, మన కళ్లముందే జరుగుతున్నా మనం చూస్తూ ఉండిపోయాం నాన్న, ఇది కరెక్టేనా, ఇలా ఇంటి పరువు తీయడం కరెక్ట్ కాదు కదా అని ఆజ్యం పోస్తుంది. అప్పుడు వచ్చిన గౌతమ్ ..రిషి ఎక్కడ అని అడుగుతాడు. వాడు మూడాఫ్ లో ఉన్నాడంటే..నేను మాట్లాడుతుంటే నా మాటలు వినిపించుకోకుండా వెళ్లిపోయాడు... ఈ విషయం విన్నాక నా బుర్ర పేలిపోయింది, ఈ విషయం దాచిపెట్టినా అందరికీ తెలిసింది అన్న విషయం బాధ ఉంటుంది కదా అంటాడు. రిషిని ఓదార్చడం కాదు రిషి బాధని తగ్గించాలి అంటుంది దేవయాని. జగతి...మహేంద్ర అంకుల్ భార్య అని నాకు తెలియదు...కానీ గొప్ప విషయం కదా అంటాడు. అసలు ఏం జరిగిందో నీకు తెలియక అలా మాట్లాడుతున్నావ్ అంటూ ఎక్కించేందుకు ప్రయత్నించిన దేవయానితో..నేను మళ్లీ వస్తానంటూ వెళ్లిపోతాడు గౌతమ్.

Also Read: రిషి-వసు మధ్య మాటల యుద్ధం, జగతి విషయంలో స్ట్రాంగ్ గా నిలబడిన మహేంద్ర
వసు-గౌతమ్
ఆటోలో ఇంటికి వెళుతున్న వసుధార కూడా కాలేజీలో జరిగిన విషయాన్ని, రిషి మాటల్ని తలుచుకుంటుంది. రిషికి కాల్ చేస్తుంది కానీ..రిషి ఫోన్ రూమ్ లో పెట్టేసి.. లాన్ లో నిల్చుంటాడు.  ధరణి, దేవయాని, మహేంద్ర ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్ నుంచి రిషిని గమనిస్తుంటారు. మరోవైపు జగతి కూడా గుమ్మం ముందు విషాదంగా కూర్చుంటుంది. జగతి మేడం రిషి మదర్ అంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉందనుకుంటాడు గౌతమ్. మహేంద్ర అంకుల్ ని-జగతి మేడంని నోటికొచ్చినట్టు మాట్లాడాను నా గురించి ఏమనుకున్నారో అనుకుంటాడు. అంకుల్ కి జగతి మేడంకి సారీ చెప్పాలి, రిషిని ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు..వాడు ఇన్ని రోజులూ ఇంత బాధని మనసులో పెట్టుకున్నాడా అనుకుంటాడు. వసుధార కాల్ చేస్తోంది ఏంటి అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తాడు రిషి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో గౌతమ్ కి కాల్ చేస్తుంది వసుధార. రిషి సార్ ఎలా ఉన్నారని అడుగుతుంది...ఏం మాట్లాడాలో నాకు అర్థంకావడం లేదు..జగతి మేడం రిషి మదర్ అని తెలిశాక నేనింకా ఆ షాక్ లోనే ఉన్నాను, ఈ విషయం మీ అందరకీ తెలిసినా మీరెందుకు చెప్పలేదా అని అడగను కానీ నేను నోటికొచ్చినట్టు మాట్లాడినా ఏమీ అనలేదు అందుకుSorry చెబుతున్నా అంటాడు. మీరు రిషి సార్ పక్కనే ఉండండి..అన్ని విషయాల్లో బావుంటారు కానీ మేడం విషయంలో అలా ఉండరు. అందరి ముందూ అలా జరిగేసరికి బాధపడ్డారు. మీరు రిషి సార్ తో జగతి మేడం టాపిక్ అస్సలు మాట్లాడొద్దు అంటుంది. అదేంటి అందరూ ఓదార్చమంటారు, నువ్వంటి అలా చెబుతున్నావ్ అంటాడు. 

రేపటి( శనివారం) ఎపిసోడ్ లో
రిషి ఏం చేస్తున్నారో అనుకుంటూ కాలేజీ మెట్లపై కూర్చుంటుంది. ఇంతలో  రిషికారు వచ్చి ఆగుతుంది. ఇంత పొద్దున్నే వచ్చావేంటి అని వసుని అడిగితే..మీరూ వచ్చారేంటి అంటుంది. నాకంటూ వేరే ప్రపంచం ఏముంది..ఇల్లు, కాలేజీ, డాడ్ ఇవే నా ప్రపంచం, ఇవే నా లోకం అంటాడు. కాలేజీ లోపలకు వెళుతూ గేట్ దగ్గర జగతి ఎదురుపడడంతో ఆగిపోతాడు... 

Published at : 04 Mar 2022 09:31 AM (IST) Tags: గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Guppedantha Manasu 4th March Episode 389

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu మే 27 (ఈరోజు) ఎపిసోడ్: వంటల పోటీలకు వెళ్తున్న జానకీరామచంద్రకు సునంద షాక్- స్వీట్‌ షాప్ ఓపెన్ చేస్తున్నామని ఆహ్వానం

Janaki Kalaganaledu మే 27 (ఈరోజు) ఎపిసోడ్: వంటల పోటీలకు వెళ్తున్న జానకీరామచంద్రకు సునంద షాక్- స్వీట్‌ షాప్ ఓపెన్ చేస్తున్నామని ఆహ్వానం

Karthika Deepam మే 27(ఈ రోజు) ఎపిసోడ్: రెస్టారెంట్‌లో జ్వాలతో క్లోజ్‌గా ఉంటున్న నిరుపమ్‌- రగిలిపోతున్న హిమ

Karthika Deepam మే 27(ఈ రోజు) ఎపిసోడ్: రెస్టారెంట్‌లో జ్వాలతో క్లోజ్‌గా ఉంటున్న నిరుపమ్‌- రగిలిపోతున్న హిమ

Guppedantha Manasu మే 27(ఈరోజు) ఎపిసోడ్: ఐలవ్‌యూ చెప్పిన రిషి- నీది ప్రేమే కాదంటూ సింపుల్‌గా రిజెక్ట్ చేసిన వసుధార

Guppedantha Manasu మే 27(ఈరోజు) ఎపిసోడ్: ఐలవ్‌యూ చెప్పిన రిషి- నీది ప్రేమే కాదంటూ సింపుల్‌గా రిజెక్ట్ చేసిన వసుధార

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్‌డేట్, మరీ అంత త్వరగానా?

Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్‌డేట్, మరీ అంత త్వరగానా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్‌, నిఫ్టీ

Rahul Gandhi: ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ సతమతం, ప్రశ్న అడగ్గానే ఏం చెప్పాలో అర్థం కాలేదా? - వీడియో వైరల్

Rahul Gandhi: ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ సతమతం, ప్రశ్న అడగ్గానే ఏం చెప్పాలో అర్థం కాలేదా? - వీడియో వైరల్

Mahanadu 2022: టార్గెట్‌ 2024గా మహానాడు- పసుపు పండగతో టీడీపీలో కొత్త ఉత్తేజం

Mahanadu 2022: టార్గెట్‌ 2024గా మహానాడు- పసుపు పండగతో టీడీపీలో కొత్త ఉత్తేజం

Yoga Day Utsav: యోగా ఉత్సవ్ డే ప్రారంభం- యంగ్‌గా ఉండాలంటే యోగా చేయమంటున్న సెలబ్రెటీలు

Yoga Day Utsav:  యోగా ఉత్సవ్ డే ప్రారంభం- యంగ్‌గా ఉండాలంటే యోగా చేయమంటున్న సెలబ్రెటీలు