News
News
X

Guppedanta Manasu December 30th Update: వసుధార నాది అంటే నాది అని కొట్టుకున్న రిషి-రాజీవ్, జగతికి విశ్వరూపం చూపించిన చక్రపాణి!

Guppedantha Manasu December 30th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 
Share:

గుప్పెడంత మనసు డిసెంబరు 30ఎపిసోడ్  ( Guppedantha Manasu  December 30th Update Today Episode 647)

ఇంటికి కాల్ చేసిన రిషి..అందరూ రావాలని పేరుపేరునా చెబుతాడు. ఇంట్లో అందరూ సంతోషిస్తారు దేవయాని మాత్రం రగిలిపోతూ ఉంటుంది. మొత్తానికి రిషి..గుడ్ న్యూస్ చెప్పాడని ఫణీంద్ర అంటే..ఏం తీసుకెళ్లాలని మహేంద్ర అంటాడు. జగతి-మహేంద్ర సంతోషం చూసి కుళ్లుకుంటుంది దేవయాని. లాడ్జిలో ఉన్న రిషి వసుధార  ఫోటో చూస్తూ వసుధార నీ రాక నా  జీవితంలో అద్భుతం....లేదు నువ్వే ఒక అద్భుతం. గలగల మాట్లాడుతుంది కొత్త కొత్త విషయాలు చెబుతుంది చిన్న పిల్లల జ్ఞాపకాలు చెప్పి మురిసిపోతుంది..అంతలోనే గంభీరంగా మాట్లాడుతుంది. వసుధార నా లైఫ్ లోకి వచ్చాక నా ప్రపంచంమే మారిపోయింది...కానీ ఏంటో డల్ గా కనిపిస్తోంది..నా దగ్గర ఏమైనా దాస్తోందా అనుకుంటాడు..ఇంతలో తలుపు కొట్టిన సౌండ్ వినిపించి కాఫీ ప్లీజ్ అంటాడు రిషి...డోర్ దగ్గర రాజీవ్ ని చూసి షాక్ అవుతాడు...
రిషి: నువ్వేంటి ఇక్కడ 
రాజీవ్: ఇది మా మావగారి ఊరు... మీరే ఇక్కడికి వచ్చి నన్ను ఏంటి ఇక్కడ అని అడుగుతున్నారా అంటూ కూల్ గా మంచంపై పడుకుని మీరెందుకు వచ్చారు అని అడుగుతాడు..
రిషి: అది నీకు అనవసరం
రాజీవ్: అలా అంటే ఎలా..లోక కళ్యాణం కోసం కొన్ని తెలుసుకోవాలి కదా.. అయినా మీకింకా నాపై కోపం పోలేదు
రిషి: ఎక్కువ మాట్లాడుతున్నావ్..
రాజీవ్: అయినా అందరూ నన్ను తక్కువ మాట్లాడతావ్ అంటారే..ఈ ఒక్కసారికీ కాస్త ఎక్కువగానే మాట్లాడతాను రిషి సార్..
అసలు నేనిక్కడి ఎందుకు వచ్చానంటే...
రిషి: షటప్ అండ్ గెటౌవుట్...అని అరుస్తాడు
రాజీవ్: శుభవార్త చెబుతామని వచ్చాను .. మీ  డియరెస్ట్ స్టూడెంట్ వసుధార పెళ్లి వార్త కూడా వినరా
రిషి: తనపెళ్లితో నీకు సంబంధం లేదు
రాజీవ్: నాకేం సంబంధం లేదా..అసలా పెళ్లిలో పెళ్లికొడుకును నేనే కదా సార్..
రిషి కోపంగా కాలర్ పట్టుకుని..పిచ్చిపిచ్చిగా మాట్లాడావంటే చంపేస్తాను అని అంటాడు. అప్పుడు రిషి ఎంత సీరియస్ అయిన కూడా రాజీవ్ అలాగే మాట్లాడుతూ ఉంటాడు. రిషి కోపంతో రాజీవ్ ని బయటకు గెంటేస్తాడు. 
రాజీవ్: వసుధార మెడలో తాళిబొట్టు చూస్తే అప్పుడు నమ్ముతావేమో కదా రిషి సార్
రిషి కోపంగా వెళ్లి వసుధార ఫోటో చూసి వాడు ఏం మాట్లాడుతున్నావో విన్నావా వసుధార మనిద్దరం ఒకటే వాడు చూడు ఎలా మాట్లాడుతున్నాడో అని అనుకుంటూ ఉంటాడు.
 
Also Read: చారుశీల ఉచ్చులో పూర్తిగా చిక్కుకుపోయిన దీప-కార్తీక్, బాధలో సౌందర్య అండ్ కో!

చక్రపాణి-సుమిత్ర
చక్రపాణి వసుధార అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు చక్రపాణి కూల్ గా మాట్లాడుతూ సుమిత్ర కూతురు పెళ్లి విషయంలో నాకు అధికారం ఉండదా ఎవరు మంచివాడు ఎవరు చెడ్డవాడు కూతురికి తగిన వాడిని చూసి హక్కు లేదా అనడంతో సుమిత్ర ఏంటండీ ఇంత కూల్ గా మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. అప్పుడు చక్రపాణి, సుమిత్ర ఇద్దరు వసుధార గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సుమిత్ర ఇందాక అమ్మాయి అబ్బాయి ఫోటో చూపించింది చాలా బాగున్నాడు ఆనందంతో వెంటనే చక్రపాణి సీరియస్ అవుతూ కొంచెం కూల్ గా మాట్లాడేసరికి నీకు చులకన అయ్యానా అని గట్టిగా అరుస్తాడు.

Also Read: రిషిసార్ నాకు కాబోయే భర్త - తండ్రికి తేల్చి చెప్పిన వసు, పెళ్లి చెడగొట్టేందుకు రాజీవ్-దేవయాని నయా ప్లాన్!

తన గదిలో కూర్చున్న పసుధార...జగతి ఇచ్చిన గిఫ్ట్ తెరిచి చూడగా అందులో మంగళసూత్రం ఉండడంతో అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు వసు ఆ తాళిని చూసి సంతోష పడుతూ ఉంటుంది. ఇంతలోనే చక్రపాణి కోపంతో రగిలిపోతూ వసుధార గదిలోకి వస్తాడు. ఏంటమ్మా పెళ్లికి ఒపించమని మీ అమ్మని రాయబారానికి పంపించావా అని అడుగుతాడు. మీరు మీరు ఏం మాట్లాడుకున్నా నాకు అక్కర్లేదు నేను ఈ పెళ్లికి మాత్రం ఒప్పుకోను అని అనడంతో వసుధార షాక్ అవుతుంది.
వసు: నాన్న నేను మీ పెద్దరికం గౌరవిస్తున్నాను కానీ మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు 
చక్రపాణి: వసుధారని ఏమి అనలేక సుమిత్ర మీద సీరియస్ అవుతాడు
ఇంతలోనే జగతి ఫోన్ చేయడంతో వసుధార చేతిలో నుంచి ఫోన్ లాక్కుంటాడు చక్రపాణి. అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయగా వసుధార అక్కడ అంతా ఓకేనా అని జగతి అనడంతో, వెంటనే చక్రపాణి గట్టిగటిగా అరుస్తూ అమ్మ తల్లి టీచరమ్మ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడతాడు..
వసు: నాన్న ఫోన్ ఇవ్వు అనడంతో చక్రపాణి వసుధార మీద సీరియస్ అవుతాడు
జగతి: నేను చెప్పేది వినండి చక్రపాణి గారు అనడంతో చక్రపాణి వినిపించుకోకుండా జగతి మీద అరుస్తూ ఉంటాడు. 
రిషి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న చక్రపాణితో...ఊరు పేరు లేని వాడు కాదు రిషి నా కొడుకు డిబిఎస్టి కాలేజ్ ఎండి అనడంతో చక్రపాణి షాక్ అవుతాడు. 
చక్రపాణి: టీచరమ్మా ఏం స్కెచ్ వేసావ్ టీచరమ్మ ఓవర్ గా మాట్లాడుతూ ఉంటాడు. అసలు నీ మొగుడు ఎవడో నీ సంసారం ఏంటో అసలు నీ ఊరు ఏంటో నీకే తెలియదు. ఎవర్నో తీసుకొచ్చి నా కొడుకు అని చెప్పి నా కూతురు గొంతు కోస్తున్నావా అని అంటాడు. జగతి: చక్రపాణి గారు మర్యాదగా మాట్లాడండి రిషి నా కన్న కొడుకు అనడంతో అయితే ఈ పెళ్లికి అసలు ఒప్పుకోను అని అంటాడు.

Published at : 30 Dec 2022 09:46 AM (IST) Tags: Guppedanta Manasu Serial Guppedanta Manasu Serial Today Episode Guppedanta Manasu Serial Written Update Guppedanta Manasu Serial December 30th Episode

సంబంధిత కథనాలు

Vani Jayaram Death : వాణీ జయరామ్ తలపై గాయం నిజమే - మృతిపై ఇంకా వీడని మిస్టరీ

Vani Jayaram Death : వాణీ జయరామ్ తలపై గాయం నిజమే - మృతిపై ఇంకా వీడని మిస్టరీ

Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్

Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్ - 'ఖుషి' ఖుషీగా...

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్ - 'ఖుషి' ఖుషీగా...

VBVK Trailer : విడుదలకు ముందు లాభాల్లో 'వినరో'

VBVK Trailer : విడుదలకు ముందు లాభాల్లో 'వినరో'

Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?

Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?

టాప్ స్టోరీస్

Cake Recipe: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఇలా టేస్టీ కేక్ తయారు చేసేయండి

Cake Recipe: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఇలా టేస్టీ కేక్ తయారు చేసేయండి

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Kotamreddy Security: కోటంరెడ్డికి ఏపీ సర్కార్ షాక్, సెక్యూరిటీ సగానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ

Kotamreddy Security: కోటంరెడ్డికి ఏపీ సర్కార్ షాక్, సెక్యూరిటీ సగానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ