Gruhalakshmi November 18th: అనసూయ మీద చెయ్యెత్తిన పరంధామయ్య- ఉగ్రరూపం దాల్చిన తులసి
తులసి ఇంట్లో నుంచి వెళ్లిపోయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తులసి ఇంట్లో పూజ చేస్తుండగా పరంధామయ్య, ప్రేమ్, దివ్య, అంకిత వాళ్ళు కూడా వస్తారు. అది చూసి తులసి చాలా ఆనందంగా ఉంటుంది. ఇది మీకోసం చేసే పూజ మీకు చెప్తే ఎక్కడ గొడవలు అవుతాయో అని చెప్పలేదని సామ్రాట్ అంటాడు. ఇద్దరూ మాట్లాడకుంటూ ఉండగా సామ్రాట్ బాబాయ్ కూడా వస్తాడు. అనుకోకుండా అందరూ ఇంటికి వచ్చారని తులసి సంతోషిస్తుంది. అనసూయ ఏడుస్తూ తులసిని రాక్షసి అంటుంది. ద్రోహం చేస్తున్నావ్, తల్లిని కాకపోయినా తల్లిలా చూసుకున్నా నా గుండెల మీద తన్నావ్, మా మొగుడు పెళ్ళాల మధ్య చిచ్చుపెట్టావ్, నాశనం అయిపోతావ్ అని కోపంతో రగిలిపోతుంది. దానికి మరింత ఆజ్యం పోస్తూ తులసి మీద మరింత ఎక్కిస్తుంది. లాస్య ఆంటీ చెప్పింది కరెక్ట్, అందరినీ తనవైపు తిప్పుకుంటుందని అభి కూడా అంటాడు.
Also read: యష్ చెంప పగలగొట్టిన మాలిని- మాళవిక మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోనని తేల్చి చెప్పేసిన వేద
అనసూయని బాగా రెచ్చగొట్టి తులసి దగ్గరకి వెళ్ళేలా చేస్తుంది లాస్య. పరంధామయ్యతో పూజ చేయిస్తారు. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. దివ్య తెగ హడావుడి చేస్తుంది. తులసి ఇంటికి వెళ్ళేలోపు అనసూయ ఆవేశం తగ్గకుండా చూడాలని లాస్య మనసులో అనుకుంటుంది. వెంటనే మళ్ళీ సామ్రాట్, తులసి మీద ఎక్కిస్తునే ఉంటుంది. తులసి ఇంట్లో అందరూ పాటలు పెట్టుకుని డాన్స్ వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళతో పాటు తులసి, సామ్రాట్ అందరూ చేరి చిందులు వేస్తారు. అనసూయ ఆవేశంగా వచ్చి అదంతా చూసి రగిపోతుంది. వాళ్ళని చూసి ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారు. ఏదో గొడవ పెట్టడానికి వచ్చినట్టు ఉన్నావ్ వెళ్లిపొమ్మని పరంధామయ్య చెప్తాడు. మేము అందరం నాన్న పుట్టినరోజు జరుపుకుంటున్నాం నీకు మంచి మనసు ఉంటే మాతో వచ్చి జాయిన్ అవు లేదంటే ఇక్కడ నుంచి వెళ్లిపో అని మాధవి కూడా చెప్తుంది.
అనసూయ కోపంగా తులసి దగ్గరకి వచ్చి ఎందుకు మా మీద పగబట్టావ్, మీ మావయ్యని ఎందుకు మాకు దూరం చేస్తున్నావ్, నీమనసులో ఇంత కుళ్ళు ఉందా, అందుకే ఆ దేవుడు నీకు ఇలాంటి శిక్ష వేశాడు. దిక్కు మొక్కు లేని ఒంటరి దాన్ని చేశాడని అంటుంది. ఆ మాటకి పరంధామయ్య అనసూయ మీద చేయ్యేత్తుతాడు.
పరంధామయ్య: అసలు మనిషివేనా తులసి గురించి అలా ఎలా మాట్లాడగలిగావ్.. 50 ఏళ్ల కాపురంలో మొదటి సారి నీ మీద చెయ్యి లేపాను, గట్టిగా మాట్లాడుతున్నా భర్తని అని కాదు నువ్వు గీత దాటి మాట్లాడావ్ కాబట్టి, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ అని నేను నమ్ముతాను. ఇప్పుడు నేను తులసికి తండ్రిగా మాట్లాడుతున్నా.. ని నోటి దురుసు తగ్గించు ఇక్కడ చేసింది చాలు ఇక్కడ నుంచి బయల్దేరు, నా కూతురు ఇంట్లో ఒక్క క్షణం కూడా నిలబడటానికి వీల్లేదు
అనసూయ: ఇక్కడ నుంచి వెళ్లిపోమనడానికి మీరెవరు, ఏ జన్మలో ఏ పాపం చేశామో నా కొడుకు సంతోషం, నా సంతోషాన్ని నాశనం చేయడానికే కోడలిగా ఇంట్లోకి అడుగుపెట్టింది. పోనీలే అని ఇప్పటి వరకి భరించాను
Also Read: శౌర్యని కలిసిన సౌందర్య, దీప-కార్తీక్ ను తప్పుదారి పట్టించిన మోనిత
పరంధామయ్య: నీ సంతోషాన్ని తులసి నాశనం చేయడం కాదు నువ్వే తన సంతోషాన్ని నాశనం చేస్తున్నావ్
అనసూయ: పెళ్ళాం చేసింది మర్చిపోయి కోడలిని పొగుడుతున్నారు సిగ్గు లేకపోతే సరి. మీ సంతోషం కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తే మీరిచ్చింది ఏంటి ఇంట్లో నుంచి బయటకి వెళ్లిపొమ్మంటారా