Gruhalakshmi June 24th: ఊహించని ట్విస్ట్, విక్రమ్ అరెస్ట్- దివ్యని కట్టడి చేసేందుకు రాజ్యలక్ష్మి మరో ఎత్తుగడ
నందు, లాస్యకి విడాకులు రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
లాస్య తనకి జరిగిన అవమానం తలుచుకుని రగిలిపోతూ ఉంటుంది. ఒంటరిగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే రాజ్యలక్ష్మి ఫోన్ చేస్తుంది. సిగ్గు లేకపోతే సరి పని మనిషి చేతిలో పరువు పోగొట్టుకుంటావా? రాములమ్మ తులసి నమ్మిన బంటని తెలిసి గుట్టు అంతా తీసుకెళ్ళి తన చేతిలో పెడతావా అని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. నువ్వు వేరు కాపురం పెడితే దివ్య దిగులు పడి నోరు జారుతుంది అప్పుడు దివ్యతో ఆడుకుందామని అనుకున్నా కానీ నా ప్లాన్ ఫెయిల్ చేశావని తిడుతుంది. తనకి ఈ గతి పట్టించిన వాళ్ళని వదిలిపెట్టేది లేదని దివ్యని వాళ్ళకి దూరం చేస్తానని లాస్య శపథం చేస్తుంది. ఇక నుంచి దివ్య పక్కనే ఉండి యుద్దం చేస్తానని అందుకు సాయం చేయమని చెప్పి లాస్య ఏదో ప్లాన్ చెప్తుంది. ఆ పని చేస్తానని రాజ్యలక్ష్మి మాట ఇస్తుంది.
Also Read: సంతోషంగా గడుపుతున్న కృష్ణ,మురారీ- బ్లాక్ మెయిల్ ఆటకి దిగిన ముకుంద
నందు, తులసి కలిసి ఇంటికి వస్తారు. కంగ్రాట్స్ చెప్తుంది. జీవితంలో సాధించింది ఏమి లేదని నిరాశగా మాట్లాడతాడు. కోర్టు కేసులో గెలిచాను ఏమో కానీ ఎవరూ లేని ఒంటరి వాడిని అయ్యానని బాధపడుతుంటే నందు ధైర్యం చెప్తుంది. మాధవి నందు రాగానే సంతోషంగా కౌగలించుకుంటుంది. లాస్య వల్ల ఇంటికి రావడం మానేశాను గొడవ పడి మిమ్మల్ని దూరం చేయడం ఎందుకని రాలేదు. ఇప్పుడు విషయం తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చేశానని చెప్తుంది. లాస్య వల్ల మీరు అందరూ ఇబ్బంది పడ్డారని ఇంట్లో వాళ్ళకి క్షమాపణ చెప్తాడు. ఒక చేత కానీ భర్తలా మిగిలిపోయానని బాధపడతాడు. లాస్య పీడ వదిలిపోయినందుకు అందరూ సంతోషిస్తారు. అటు దివ్య ఇంటికి సంతోషంగా వస్తుంది. ప్రియని పట్టుకుని గిరాగిరా తిప్పేస్తుంది. తండ్రి జీవితంలో నుంచి లాస్య డిలీట్ అయిపోయిందని సంతోషంగా చెప్తుంది. ఇంట్లో అందరినీ పేరు పేరునా పిలిచి గుడ్ న్యూస్ కోర్టు విడాకులు గ్రాంట్ చేసిందని సంబరపడుతుంది.
Also Read: భర్త ప్రేమ చూసి మురిసిపోయిన కావ్య- డాక్టర్ రాకతో స్వప్న గుట్టు రట్టు అవుతుందా?
విక్రమ్ దగ్గరకి వెళ్ళి తన సంతోషాన్ని పంచుకోవాలని చూస్తుంది. తను వెళ్ళి పక్కన కూర్చుంటే చిరాకుగా వెళ్ళిపోతాడు. సోరి చెప్పినా కూడా విక్రమ్ కరగడు. దివ్య బాధగా విషయం చెప్పకుండా వెళ్ళిపోతుంది. నందు డల్ గా ఉండేసరికి కేఫ్ తిరిగి మొదలు పెట్టమని తులసి సలహా ఇస్తుంది. లాస్య వల్ల కేఫ్ పరువు పోయిందని దాన్ని నడపడం కష్టమని చెప్తాడు. తనకి ఆలోచించుకోవడానికి కాస్త సమయం ఇవ్వమని అడుగుతాడు. దివ్య గదిలోకి వచ్చి విక్రమ్ వైపు కూడా చూడకుండా ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. కనీసం పట్టించుకోలేదని తిట్టుకుంటూ ఉంటాడు. విక్రమ్ టీవీ చూస్తూ ఉంటాడు. అందులో అన్నీ రొమాంటిక్ సాంగ్స్ వస్తూ ఉండటంతో కంట్రోల్ తప్పబోతాడు. దొరికిందే సందు అని దివ్య కూడ ట్రైల్స్ వేస్తుంది. చివరకు పెళ్ళాం బుట్టలో పడిపోతాడు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial