Gruhalakshmi July 27th: 'గృహలక్ష్మి' సీరియల్: లాస్య ప్లాన్ సక్సెస్- దివ్య, విక్రమ్ హనీ మూన్ క్యాన్సిల్, రచ్చ చేసిన రాజ్యలక్ష్మి
రాజ్యలక్ష్మి ఇంట్లో లాస్య పాగా వేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
లాస్య బర్త్ డే పార్టీలో ఉండటం తనకి ఇష్టం లేదని నందు కోపంగా చెప్తాడు. ఈ టైమ్ లో గొడవలు వద్దని లాస్య కావాలని మొండితనం చేస్తుందని సైలెంట్ గా ఉండమని పరంధామయ్య సర్ది చెప్తాడు. దీంతో అందరూ కేక్ కట్ చేసే దగ్గరకి వెళతారు. లాస్యని చూసి సిగ్గులేని వాళ్ళని మనం ఏమి చేయలేమని దివ్య కూడ నచ్చజెపుతుంది. ఇక నందు కేక్ కట్ చేసి మొదటిగా కూతురు దివ్య, అల్లుడుకి తినిపిస్తాడు. కొడుకు దగ్గరలేని లోటు తీర్చావని విక్రమ్ ని నందు మెచ్చుకుంటాడు. లాస్య కేక్ తినిపించబోతుంటే నందు మొహం తిప్పుకుంటాడు. కానీ లాస్య బలవంతంగా నోట్లో పెడుతుంది. ఇక తులసి నందు నోట్లో కాకుండా చేతిలో పెడుతుంది. నోట్లో పెట్టొచ్చు కదా దివ్య మెల్లగా అంటుంది. ఇక నందు దాన్ని చూసుకుంటూ ఇది ఎంతో స్పెషల్ చచ్చి బతికానని తులసి భజన చేస్తాడు.
Also Read: మనసుల్ని మెలిపెట్టించేసిన కృష్ణ, మురారీ- అలేఖ్య వాళ్ళకి నిజం చెప్పేసిన ముకుంద
ఇక పార్టీలో ఆట పాటలు స్టార్ట్ అవుతాయి. దివ్య, విక్రమ్ డాన్స్ ఇరగదీస్తారు. లాస్య బేరర్ కి మత్తు కలిపిన కూల్ డ్రింక్స్ ఇవ్వమని సైగ చేస్తుంది. వాటిని నందు తీసుకుని తాగుతాడు. తులసి తీసుకుంటుంది కానీ తాగకుండ పక్కన పెట్టేస్తుంది. పరంధామయ్య, అనసూయ డాన్స్ వేస్తారు. మత్తు కలిపిన డ్రింక్ దివ్య, విక్రమ్ కూడా తాగుతారు. ఇద్దరూ మత్తులో తూగుతూ ఉంటారు. మీ హనీ మూన్ జంట చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నిద్రలేచే సరికి ఫ్లైట్ మిస్ అయిపోతుంది అప్పుడు ఉంటుంది పండగ అనుకుని లాస్య మురిసిపోతుంది. నందు లేచి డాన్స్ చేస్తూ తులసిని కూడా లాగుతాడు. వీడి వాలకం చూస్తుంటే తాగినట్టు ఉన్నాడని అనసూయ వాళ్ళకి అర్థం అవుతుంది. మత్తుగా ఉందని దివ్య, విక్రమ్ పడుకోవడానికి వెళ్లిపోతారు. దివ్య నీకు నువ్వే నీ ఆశలకు ఉరి తాడు వేసుకున్నావ్, ఇక వచ్చిన పని అయిపోయిందని జారుకుంటుంటే నందు వచ్చి ఆగమని అరుస్తాడు.
నందు: గట్టిగా పట్టుకుంటే పావు సేరు కండ లేదు నన్నే బెదిరిస్తావా?
లాస్య: నేనేం బెదిరించలేదు
నందు: ఇందాక తులసి కట్ చేసిన కేక్ పీస్ పట్టుకుంటే ఏమన్నావో గుర్తు చేసుకో.. గుర్తుకు వచ్చిందా?
లాస్య: ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో ఏం చెప్పినా గోడకి చెప్పినట్టే నేను వెళ్తాను
నందు: బుద్ది తక్కువై నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యవి. ఐదేళ్లలో వందేళ్ల నరకం చూపించిన భార్యవి. నా వాళ్ళందరినీ దూరం చేసి ఒంటరిని చేసిన భార్యవి. నాలో సహనానికి పరీక్ష పెట్టి నాతో బయటకి గెంటేసేలా చేసుకున్న భార్యవి
Also Read: దుగ్గిరాల ఇంటి ముందు మీడియా రచ్చ- సెలెబ్రెటీ అయిపోయానని చంకలు గుద్దుకున్న స్వప్న
తులసి: గొడవలు ఎందుకు వదిలేయండి
పరంధామయ్య: ఇక్కడి దాకా వచ్చిన తర్వాత ఎందుకు వదిలేయడం తేల్చుకొనివ్వు
నందు: నీ కారణంగానే తులసి లాంటి దేవతకి దూరం అయ్యాను. అన్యాయం చేశాను ఆ పాపం అంతా నీదే
లాస్య: ఆ మాట తులసిని అనమను. ఆఫీసులో నా భుజం మీద తలపెట్టి తులసి మొహం చూడబుద్ది కావడం లేదని అన్నావ్