Gruhalakshmi July 1st: తులసి వాళ్ళకి వణుకుపుట్టేలా వార్నింగ్ ఇచ్చిన లాస్య- దివ్య బోనమెత్తకుండా అడ్డుపడుతుందా?
లాస్య రాజ్యలక్ష్మి ఇంట్లో పాగా వేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
లాస్య మన ఇద్దరి మధ్య లేనిపోని గొడవలు సృష్టిస్తుందని దివ్య తన బాధని విక్రమ్ తో పంచుకుంటుంది. ప్రస్తుతం తన నిర్ణయాన్ని రెండు రోజులు వాయిదా వేసుకోమని అడుగుతుంది. రేపు అమ్మానాన్న ఇంటికి వస్తున్నారు అటువంటి టైమ్ లో లాస్య ఆంటీ వస్తే బాగోదని అంటుంది. కానీ విక్రమ్ మాత్రం లాస్య కేవలం తన దగ్గర జీతం కోసం పని చేసే ఉద్యోగి మాత్రమేనని చెప్తాడు. ఇక తులసి, నందు రాజ్యలక్ష్మి ఇంటికి వస్తారు. పెళ్లి చేసి పంపించి మీ అమ్మాయిని అలా వదిలేశారు ఏంటి కనీసం చూడటానికి కూడా రాలేదని రాజ్యలక్ష్మి దెప్పి పొడుస్తుంది. రావాలనే అనుకున్నాం కానీ మా ఇంట్లో సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయని తులసి అంటుంది. పుట్టింటి తరఫు నుంచి దివ్యతో మొదటి సారి బోనం ఎత్తించాలని అనుకున్నాం మీరు అనుమతిస్తే కూతురు, అల్లుడిని ఇంటికి తీసుకెళ్తామని తులసి అడుగుతుంది. మాట మాటకి బసవయ్య అడ్డం పడుతూ అవమానించేలా మాట్లాడతాడు.
Also Read: కృష్ణ జీవితాల్లో అల్లకల్లోలం- మురారీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ముకుంద
అందరూ మాట్లాడుకుంటున్న టైమ్ లో లాస్య ఎంట్రీ ఇస్తుంది. తనని చూసి నందు వాళ్ళు షాక్ అవుతారు. నువ్వు ఎందుకు వచ్చావని నందు ఆవేశంగా అడుగుతాడు. లాస్య ఇప్పుడు మా హాస్పిటల్ ఎంప్లాయ్ తన అపాయింట్ మెంట్ తీసుకోవడం కోసం వచ్చిందని రాజ్యలక్ష్మి చెప్తుంది. తనకి మాకు ఉన్న శతృత్వం తెలిసి కూడా ఎందుకు ఉద్యోగం ఇచ్చారు మీరు మమ్మల్ని అవమానించినట్టే కదా అని నిలదీస్తాడు. లాస్య కల్పించుకునేసరికి విక్రమ్ ఏవైనా విషయాలు ఉంటే బయట చూసుకోమని చెప్తాడు. మా అమ్మ దగ్గర గొంతు పెంచి మాట్లాడటం కరెక్ట్ కాదని నందుకి కూడా చెప్తాడు. ఎన్ని చెప్పినా కూడా లాస్యని పనిలో పెట్టుకోవడం తనకి నచ్చలేదని నందు అంటాడు. లాస్య దివ్యకి పక్కలో బల్లెం అవుతుందని రాజ్యలక్ష్మి సంతోషపడుతుంది. లాస్య వల్ల దివ్యకి ఎటువంటి ఇబ్బంది ఉండదని అల్లుడు హామీ ఇస్తే చాలని తులసి అడుగుతుంది. దీంతో హామీ ఇస్తాడు.
Also Read: కావ్య ఒడిలో పడుకున్న రాజ్- పోలీస్ కేసులో ఇరుక్కున్న అప్పు
కూతురు, అల్లుడిని మీతో పంపించడం లేదని అంతా కలిసే ఇంటికి వస్తాం కలిసి పండగ జరుపుకుందామని రాజ్యలక్ష్మి చెప్తుంది. దీంతో తులసి వాళ్ళు వెళ్లిపోతారు. తులసి, నందు లాస్యతో మాట్లాడతారు. మమ్మల్ని విడగొట్టింది నువ్వేనని లాస్య తులసిని అంటుంది. మీకు గుండెల్లో దడ పుట్టిస్తా, మీకు నిద్రలేకుండా చేస్తాను. కావాలని దివ్యని దెబ్బ కొట్టాలని ఈ ఇంటి పంచన చేరానని లాస్య తెగేసి చెప్తుంది. దివ్య జోలికి రాకుండా విక్రమ్ మాట ఇచ్చాడని తులసి అంటుంది. కానీ విక్రమ్ తొలుబొమ్మ మాత్రమే తల్లి చెప్పినట్టు ఆడతాడు. ఎక్కువ చేస్తే నీ కూతురితో విక్రమ్ కి విడాకులు ఇచ్చేలా చేస్తానని బెదిరిస్తుంది. నందు ఆవేశంగా చెయ్యి ఎత్తితే లాస్య సంగతి విక్రమ్ చూసుకుంటాడని తులసి సర్ది చెప్తుంది. ఈ ఇంట్లో నీ అల్లుడికి విలువ లేదు నీకూతురు ఇంట్లో నుంచి పుట్టింటికి రావడానికి ఎక్కువ టైమ్ పట్టదులేనని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది.