Brahmamudi July 1st: కావ్య ఒడిలో పడుకున్న రాజ్- పోలీస్ కేసులో ఇరుక్కున్న అప్పు
స్వప్న దుగ్గిరాల ఇంటి కోడలు కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
మత్తులో ఉన్న రాజ్ కావ్య మీద మీద పడిపోతూ ఉంటాడు. తన నుంచి తప్పించుకుని కావ్య బయటకి వెళ్లబోతుంటే రాజ్ తన చీర కొంగు లాగి పైకి లాగేసుకుంటాడు. వెంటనే భయంగా అమ్మా నాన్న, అమ్మమ్మ, తాతయ్య, అప్పు అని గట్టిగా అరుస్తుంది. నువ్వు చెప్పినట్టే వింటానని రాజ్ అంటే కావ్య వినాలని అనుకున్నా కానీ ఇలా కాదు మీరు మీలాగే ఉంటే చాలని అమాయకంగా మాట్లాడుతుంది. కాసేపటికి కావ్య ఒడిలో పడుకుండిపోతాడు. భర్తతో జరిగిన క్షణాలన్నీ గుర్తు చేసుకుంటుంది. మీరు మత్తులో కాకుండా మనస్పూర్తిగా దగ్గరకి తీసుకుంటారా అని ఎదురుచూస్తున్నా. మీరు నా ఒడిలో ఉంటే పక్కకి జరపాలని అనుకున్న జరపలేకున్నానని సంతోషపడుతుంది. నన్ను చూస్తేనే దూరంగా ఉండే మీరు పదే పదే దగ్గర అవుతున్నారంటే ఇదేనేమో బ్రహ్మముడికి ఉన్న శక్తి అనుకుంటుంది.
Also Read: రంగంలోకి దిగిన లాస్య- అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్న దివ్య
కనకం భర్త కాళ్ళు పట్టుకుంటుంది కానీ అసహ్యించుకుంటాడు. నువ్వు చేసింది తప్పు అయితే క్షమించే వాడిని కానీ చేసింది మోసం దాన్ని ఎవరూ ఒప్పుకోరని అంటాడు. ఆ ముదనష్టపు దాని జీవితం కోసం అలా చేయాల్సి వచ్చింది. నాలాగా నా కూతురి జీవితాలు కాకూడదని అలా చేశాను. కానీ నా కన్న కూతురు నన్ను మోసం చేసి వెళ్లిపోయినప్పుడు అర్థం అయ్యింది. కావ్య ఆ ఇంట్లో పడుతున్న అవమానాలు చూసి అర్థం అయ్యింది. సేటు మోసం చేసి ఇల్లు సొంతం చేసుకోవాలని చూస్తుంటే తప్పు మీద తప్పు చేశాను. నేను ఇప్పుడు మారిపోయాను ఇక మీకు చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకొనని కనకం బాధపడుతుంది. నువ్వు మారిపోయావని నాకు తెలుసు కానీ ఏమి చేయలేను. చిన్నప్పటి నుంచి అప్పుకి ఏమి ఇవ్వలేదు. నా ఇద్దరి కూతుళ్ల పెళ్ళిళ్ళు నా చేతుల్లో లేకుండా జరిగిపోయింది. కనీసం అప్పుకి అయినా మంచి అబ్బాయిని చూసి ఇల్లు అమ్మి అయినా పెళ్లి చేయాలని అనుకున్నా. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా చేశావు. ఇప్పుడు అంత అప్పు ఎలా తీర్చను అప్పుకి పెళ్లి ఎలా చేయాలని బాధపడతాడు.
Also Read: రసవత్తరంగా మారిన కథనం- ముకుంద మనసు ముక్కలు చేసిన మురారీ
ఈ మాటలన్నీ విన్న అప్పు ఎలాగైనా నాన్నకి సహాయం చేయాలని అనుకుంటుంది. శ్రీశైలం వెళ్లేందుకు సీతారామయ్య వాళ్ళు కొడుకు, కోడళ్ళని రెడీ అవమని చెప్తారు. స్వప్న, రాహుల్ కీదా రెడీ అయి వస్తారు. ఇంట్లో వాళ్ళందరూ తనని పొగుడుతారని స్వప్న తెగ ఆశపడుతుంది. వాళ్ళని చూసి ఇంద్రాదేవి స్వప్న వాళ్ళు వచ్చారు మరి రాజ్, కావ్య ఎక్కడని అంటుంది. రాజ్ కి మెలుకువ వచ్చి చూసేసరికి కావ్య ఒడిలో ఉండటం చూసి కెవ్వుమని అరుస్తాడు. అదేంటి నువ్వు నా బెడ్ మీద ఉన్నావని బిత్తరపోతాడు. మీరు నా మాట వినకుండా ఏదేదో చేశారని కావ్య సిగ్గు పడుతూ రాజ్ ని ఉడికిస్తుంది. ఒసేయ్ నాకు భయమేస్తుందే అంటే రాత్రి నేను కూడా ఇలాగే అన్నా మీరు వినకుండా నా నోరు మూసి కొంగు లాగారని అంటుంది. నువ్వే ఏదో మత్తు మందు కలిపావని అంటాడు. చేయాల్సినదంతా చేసి నన్ను అంటారా? కానీ కావ్య ఏదో జరిగిపోయిందని బిల్డప్ ఇచ్చేలా మాట్లాడుతుంది.