Gruhalakshmi January 31st: గాయపరుచుకున్న నందు, కాపాడిన తులసి- పరంధామయ్యకి కలిసొచ్చిన ఆస్తి
లాస్య నిజస్వరూపం బయటపడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
దివ్య చదువు కోసం ఢిల్లీ వెళ్ళడం కోసం బయలదేరుతూ అందరితో ఎమోషనల్ గా మాట్లాడుతుంది. అందరూ తనకి ఎమోషనల్ గా వీడ్కోలు చెప్తారు. తులసి కూతురిని తలుచుకుంటూ నిద్ర కూడా పోకుండా ఉంటుంది. ‘ఈ అమ్మని ఒంటరిగా వదిలేసి దూరంగా వెళ్ళావ్, ఒక్కదానివే ఎలా ఉంటావో అని భయం లేదు నేను ఎలా ఉండాలో అని దిగులుగా ఉంది. ఇల్లంతా బోసిగా ఉంది’ అని కూతురి ఫోటో చూసుకుంటూ బాధపడుతుంది. నందు చీకట్లో గొయ్యి తవ్వుతూ ఉంటాడు. సౌండ్ విని తులసి బయటకి వచ్చి అది చూసి కంగారుపడుతుంది. తులసి వచ్చి ఆపినా కూడా ఆపకుండా అలాగే తవ్వుతూ ఉంటాడు. దీంతో తులసి ఆపండి అని గట్టిగా అరుస్తుంది. నందు చేసిన పని వల్ల తన చేతులు కందిపోతాయి. అది చూసి తులసి ఫీల్ అవుతుంది.
Also Read: మాళవిక చెంప పగలగొట్టిన వేద- భ్రమరాంబిక ముందు నిజం బట్టబయలు
ఇంట్లో ఎవరూ నాకు విలువ ఇవ్వడం లేదని నందు అసహనంగా మాట్లాడతాడు. విలువ ఇవ్వకపోతే నేను వచ్చి మిమ్మల్ని ఆపుతాను, ఇదొక జబ్బు దీనికి మందు లేదు. మీ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచించండి దారి దొరుకుతుంది. ఓపిక ఉండాలి, ప్రయత్నం ఉండాలి. మీ బాధ మీరు పడుతున్నా అని అనుకుంటున్నారు కానీ ఇంట్లో వాళ్ళందరిని బాధపెడుతున్నారని అనేసి వెళ్ళిపోతుంది. గార్డెన్ లోకి పందికొక్కు వచ్చి పెద్ద గొయ్యి తీసిందని పరంధామయ్య తిడతాడు. ఆ గొయ్యి తీసింది నందు అని తెలిసి తులసి నవ్వుకుంటుంది. నందు మాత్రం తలపట్టుకుంటాడు. అందరూ పందికొక్కుని తిడుతూ ఉండగా పోస్ట్ మ్యాన్ వచ్చి కవర్ ఇస్తాడు.
అది తులసి ఓపెన్ చేసి చదవబోతుంటే లాస్య లాగేసుకుంటుంది. చదవడానికి నేను ఉన్నా కదా ఇంటి కోడలిని అని అంటుంది. సిటీలో అప్పుడెప్పుడో మనం కొన్న స్థలం కబ్జా చేశారు కదా ఇప్పుడు దానికి సంబంధించి జడ్జిమెంట్ వచ్చింది. మీకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్తుంది. అది విని అందరూ సంతోషపడతారు. ఆస్తి కలసిరావడం నాకోసం ఏమో నా బిజినెస్ మా నాన్న అండగా నిలబడటానికి ఏమో అని నందు మనసులో అనుకుని పైకి మాత్రం కంగ్రాట్స్ చెప్తాడు. ఆస్తి వచ్చిందని అందరూ సంతోషపడుతూ ఉంటారు. తనకి కలిసొచ్చిన ఆస్తి నందుకి ఇస్తాడా ఇవ్వడా అని లాస్య ఆలోచిస్తూ బొమ్మాబోరుసు వేస్తుంది. అందులో బొరుసు పడి ఆస్తి ఇవ్వడు అనేగా అని తిట్టుకుంటుంది. మళ్ళీ మూడు సార్లు వేస్తాను అనుకుని కాయిన్ ఎగరేయగానే నందు పట్టుకుంటాడు.
Also Read: వసుధార వద్దకు బయల్దేరిన రిషి- టెన్షన్ లో మహేంద్ర
తండ్రి దగ్గరకి వెళ్ళి ఆస్తి అడగమని లాస్య చెప్తుంది. పరంధామయ్య తులసిని పిలిచి మాట్లాడతాడు. ఆస్తి కలిసొచ్చింది కదా దాన్ని ఏం చేయాలని అడుగుతాడు. అది మీ ఆస్తి కదా మీ ఇష్టం అని అంటుంది. అత్తయ్యని అడగండి సలహా ఇస్తుందని అంతే మీ అత్తయ్య కూడా నిన్నే అడగమని చెప్పిందని అంటాడు. ఆస్తి మీ దగ్గరే ఉంచుకోమని తులసి చెప్తుంది. అలా ఉంటేనే అందరికీ మంచిదని అంటుంది.