అన్వేషించండి

Gruhalakshmi August 25th Update: తులసిని పెళ్లి చేసుకోమని సామ్రాట్ ని అడిగిన పెద్దాయన- టామ్ అండ్ జెర్రీలా కొట్లాడుకున్న ప్రేమ్, శ్రుతి

సామ్రాట్ మీద తనకున్న అనుమానాన్ని పరంధామయ్య ముందు బయటపెడుతుంది అనసూయ. దీంతో కథనం ఉత్కంఠగా మారింది.

అనసూయ తన మనసులో ఉన్న భయాన్ని పరంధామయ్య ముందు బయట పెడుతుంది. మన కొడుకు చేసిన తప్పు మనం చెయ్యొద్దు, తనని జీవితంలో ఎదగడానికి ఎంకరేజ్ చేద్దాం అని అంటాడు. ప్రపంచమంతా ఎన్ని మాటలు అన్నా పట్టించకోదు కానీ మన ఇద్దరం మాత్రం వేలెత్తి చూపిస్తే మాత్రం తట్టుకోలేదు కుప్పకూలిపోతుందని ఎమోషనల్ అవుతాడు. శ్రుతి బట్టలు ప్రేమ్ తీసుకొచ్చి ఇస్తాడు. నేను చెప్పలేదుగా ఎందుకు తెచ్చావని అడుగుతుంది.

ప్రేమ్: నువ్వు ఇక్కడ ఉంటున్నప్పుడు ని బట్టలు అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది

శ్రుతి: నేను ఇక్కడ ఎన్ని రోజులు ఉంటానో నాకే తెలియదు ఎక్కువ రోజులు నీతో ఒకే గదిలో కలిసుండటం నావల్ల కాదు

ప్రేమ్: మరి ఆ మాట అమ్మకి చెప్పేసి ఉండాల్సింది ఎందుకు ఆశ పెట్టడం

శ్రుతి: నేనేమీ ఆశ పెట్టలేదే

ప్రేమ్: నేను అంటుంది నా గురించి కాదు అమ్మ గురించి

శ్రుతి: నేను ఆశపడలేదు అంటే నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదనే కదా, కన్ఫ్యూజన్ అవకు. నేను ఇక్కడ ఉండిపోవడానికి ఒప్పుకుంది నీమీద ఇష్టంతో కాదు ఆంటీ మీద ప్రేమతో. నిజం చెప్పి ఆంటీని బాధపెట్టడం ఎందుకని ఉంటున్నా

ప్రేమ్: మారావేమో అనుకున్నా

శ్రుతి: అలాంటి పొరపాటు నేను ఎప్పుడు చెయ్యను

ప్రేమ్: నీతో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదు, అమ్మ కోసం అమ్మని బాధపెట్టడం ఇష్టం లేక ఒప్పుకున్నా

శ్రుతి: ఏయ్ కాపీ క్యాట్ లాగా నా మాటలు నాకే చెప్పకు.. అని టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటారు.

Also Read: తులసి, సామ్రాట్ గురించి నీచంగా ఆర్టికల్- రచ్చ చేసిన అభి, అనసూయ బుర్రలో విషం నింపిన నందు, లాస్య

పరంధామయ్య తులసికి ఫోన్ చేస్తాడు. నేను ఇప్పుడు సామ్రాట్ ఇంట్లో ఉన్నాను అని కోపంగా చెప్తాడు. ఏమైంది మావయ్య ఎందుకు అంతా కోపంగా ఉన్నారని తులసి కంగారుగా అడుగుతుంది. ఏం జరిగిందో ఫోన్ లో చెప్పడం కాదు వెంటనే బయల్దేరి రా తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని అంటాడు. నీ ప్రమేయం లేకుండా విషయం ఇక్కడిదాకా వచ్చిందా? చేయాల్సినదంతా చేసి అమాయకురాలిగా మాట్లాడతావా, మాటలు అనవసరం ఎవ్వరికీ చెప్పకుండా వెంటనే సామ్రాట్ ఇంటికి రా అని చెప్పి ఫోనే పెట్టేస్తాడు. తులసి కంగారుగా సామ్రాట్ ఇంటికి వస్తుంది.

పరంధామయ్య ఇంట్లో కూర్చుని తీరిగ్గా చెస్ ఆడుతూ ఉంటాడు. తులసి వచ్చి ఏమైందో అనుకుని చాలా కంగారుగా వచ్చాను అసలు ఎందుకు పిలిచారు అని అడుగుతుంది. నీకు సర్ ప్రైజ్ ఇద్దామని అందరూ అంటారు. మ్యూజిక్ స్కూల్ ఇన్విటేషన్ చూపిస్తాడు సామ్రాట్. అది చూసి తులసి సంబరపడిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. నందు ప్రేమ్ పుట్టినరోజు ఇన్విటేషన్ కార్డ్ తెచ్చి తులసికి చూపిస్తాడు. అందులో కేవలం నందు పేరు మాత్రమే ఉండటం చూసి తన పేరు వేయించాల్సింది అని అడుగుతుంది. కార్డ్ లో నా పేరు చివరన ఏముంది అంటే బీటెక్ అని చెప్తుంది తులసి. మరి నీ పేరు పక్కన్ ఏ డిగ్రీ వెయ్యమంటావ్, నీకు చదువు లేడని ఊరంతా ప్రచారం చేసుకోవడం నాకు ఇష్టం లేదు.. ఇంకెప్పుడు కార్డ్ లో నీ పేరు ఉండాలని అనుకోకు ఆ అదృష్టం నీకు లేదని సరిపెట్టుకో అని చెప్తాడు. ఆ మాటకి తులసి కన్నీళ్ళు పెట్టుకుంటుంది.

Also Read: రాధ, మాధవ్ ల సవాల్- రుక్మిణి ఈ ఇంటి దేవత అంటోన్న దేవుడమ్మ

ఇన్విటేషన్ కార్డ్ లో తులసి అనే పేరు చూసి చాలా సంతోషిస్తుంది. నా పేరు కార్డ్ లో రాసినందుకు థాంక్యూ సామ్రాట్ గారు అని అంటుంది. కార్డ్ లో మీ పేరు రాయడం అంత పెద్ద విషయం ఏమి కాదని అంటే కానీ నా వరకు చాలా పెద్ద విషయం అని అంటుంది. చాలా మంది మగవాళ్ళు కార్డ్ లో ఆడదాని పేరు వేయడానికి ఇష్టపడరు, కార్డ్ లో నా పేరు చూసి ఏనుగు ఎక్కినంత సంబరంగా అనిపించిదని ఎమోషనల్ అవుతుంది. నా పేరు తర్వాత మీ పేరు వేయించుకున్నారు మీకు చిన్నతనంగా అనిపించలేదా అని అడుగుతుంది. నాది కానిది నాది అని చెప్పుకుంటే చిన్నతనం ఎందుకు అనిపిస్తుందని అంటాడు.

తరువాయి భాగంలో..

తులసి, సామ్రాట్ కలిసి స్వీట్ రెడీ చేస్తారు. తర్వాత సామ్రాట్ బాబాయ్ ఆడది లేని ఇల్లు దీపం లేని గుడి లాంటిదని అంటాడు. రేపు నేను తీసుకొచ్చిన వ్యక్తి హనీని సరిగా చూసుకోకపోతే అని సామ్రాట్ అంటాడు. తులసి లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటావా అని అడిగేస్తాడు పెద్దాయన.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
UI Movie Leaked Online: రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్
రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్ చేసేశారు
Ind Vs Aus Series: అదరగొడుతున్న బుమ్రా.. ఆ లోపాలు సరిదిద్దుకుంటే కోహ్లీ, రోహిత్‌కు తిరుగుండదు
అదరగొడుతున్న బుమ్రా.. ఆ లోపాలు సరిదిద్దుకుంటే కోహ్లీ, రోహిత్‌కు తిరుగుండదు
Look Back 2024 - Celebrity Divorce: పెటాకులైన పెళ్లిళ్లు... 2024లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే
పెటాకులైన పెళ్లిళ్లు... 2024లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Embed widget