Trinayani Serial Actor Chandu: చావలేదు, చంపేశారు - 'త్రినయని' సీరియల్ యాక్టర్ చందు తండ్రి సంచలన ఆరోపణలు
Trinayani Serial Actor Chandrakanth: 'త్రినయని' సీరియల్ యాక్టర్ చంద్రకాంత్‌ది ఆత్మహత్యపై ఆయన తండ్రి అనుమానాలు వ్యక్తం చేశారు. హత్య జరిగిందనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు.
Serial Actor Chandrakanth Father Sensational Comments: 'త్రినయని' సీరియల్ యాక్టర్ చందు అలియాస్ చంద్రకాంత్ మరణించిన సంగతి తెలిసిందే. సహ నటి పవిత్ర జయరాం మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారనేది అందరికీ తెలిసిన విషయం. అయితే... చందు తండ్రి తన కుమారుడిది ఆత్మహత్య కాదని, హత్య అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్న కొడుకు మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. చందు దహన సంస్కారాల తర్వాత ఆయన ఏమన్నారంటే...
కుమారుడి మరణంపై తండ్రి అనుమానం
చంద్రకాంత్ మరణించడానికి ఒకట్రెండు రోజుల ముందు పెద్ద మనుషులతో పంచాయతీ జరిగిందని ఆయన తండ్రి వివరించారు. పవిత్ర తనను పిలుస్తోందని, రెండు రోజుల కంటే ఎక్కువ భూమ్మీద తాను ఉండనని కుమారుడు చెబితే తాను హెచ్చరించినట్టు ఆయన వివరించారు.
''పిల్లలను నీ పిల్లలలా చూసుకో, నేను వెళ్లిపోతానని అన్నాడు. నేను తిట్టాను. పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఊరుకోనని అన్నా. అప్పుడు అటువంటిది ఏమీ లేదన్నాడు. మృతి విషయం తెలియడానికి ముందు రోజు మా ఇంటి నుంచి వెళ్లాడు. ఎక్కడికి వెళుతున్నావని మా ఆడబిడ్డ అడిగింది. కార్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కోసమని చెప్పాడు. మాతో అలా చెప్పి పవిత్ర ఫ్లాట్ దగ్గరకు వెళ్లాడు. తెల్లారి ఊరి వేసుకున్నట్టు సమాచారం వచ్చింది'' అని చందు తండ్రి పేర్కొన్నారు. అది ఉరి కింద తనకు అనిపించలేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఆత్మహత్య కాదని ఎందుకు అంటున్నారంటే?
చందుది ఆత్మహత్య కాదని ఎందుకు అనిపించింది? మీరు ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు? అని ప్రశ్నించగా... ''నేను చందు మరణించిన ఫ్లాట్ దగ్గరకు వెళ్లా. దారిలో ఉండగా కానిస్టేబుల్ నుంచి ఫోన్ వచ్చింది. స్నేహితుడితో కలిసి వెళితే నా ముందు డోర్ బద్దలుకొట్టారు. బాల్కనీలో ఉరి వేసుకున్నాడని అక్కడి జనాలు చెప్పారు. బాల్కనీలో వేలాడుతున్న బాడీని కిందకు దించారు. ఉరి వేసుకున్న వాడు రెండు కాళ్లను దగ్గరకు ఎలా కట్టుకుంటాడు? రెండు కాళ్లకు శారీ ఫాల్స్ లాంటిది కట్టేసి ఉంది. అదెవరు కట్టారో నాకు సమాధానం చెప్పాలి'' అని చందు తండ్రి తెలిపారు.
నిజ జీవితంలో కూడా చందు విలనే!
'త్రినయని' సీరియల్ మొదలైనప్పటి నుంచి చందు తమ కుటుంబానికి పూర్తిగా దూరం అయ్యాడని తండ్రి తెలిపారు. పవిత్ర జయరాం మాయలో పడి తమను పట్టించుకోవడం మానేశాడని ఆయన వివరించారు. సీరియళ్లలో మాత్రమే కాదని, నిజ జీవితంలో కూడా అతడు విలన్ అని ఆరోపించారు. ఆ విలనిజం భార్య మీద చూపించాడని, కొట్టడం వంటివి చేశాడన్నారు.
Also Read: పిల్లల ముందు పవిత్రతో బెడ్ రూంలోకి - పెళ్లాన్ని చిత్రహింసలు పెట్టిన చందు
పవిత్ర పరిచయమైన తర్వాత ఐదేళ్ల నుంచి దూరం అయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. చందును పెళ్లి చేసుకున్నట్లు పవిత్ర తమకు ఫోన్ చేసి చెప్పిందని, మీ వయసు ఏంటి? ఆయన వయసు ఏంటి? అని ప్రశ్నించినా ఆవిడ వినలేదని చందు తండ్రి పేర్కొన్నారు.
Also Read: చందు కంటే ముందు ఐదుగురితో ఎఫైర్లు - పవిత్ర జయరాం అక్రమ సంబంధాలపై శిల్ప