'త్రినయని' సీరియల్ ఫేమ్ చందు ఫ్యామిలీ లైఫ్, పవిత్రతో రిలేషన్షిప్ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు చందుది తెలంగాణ. సీరియళ్లలోకి రాకముందు అతడు శిల్ప అనే ఆమెతో ప్రేమలో పడ్డారు. పదకొండేళ్ల ప్రేమ తర్వాత చందు, శిల్ప పెళ్లి చేసుకున్నారు. ఆ దంపతులకు ఓ బాబు, పాప. చందు కుమార్తె వయసు 8 ఏళ్లు. బాబు వయసు 4 ఏళ్లు. వాళ్లిద్దరూ కొన్నాళ్ల నుంచి తల్లి దగ్గర పెరుగుతున్నారు. 'కార్తీక దీపం', 'రాధమ్మ కూతురు', 'సూర్యకాంతం'తో పాటు 'త్రినయని' సీరియల్, కొన్ని సినిమాలు చేశారు. 'త్రినయని' సీరియల్ చేసే సమయంలో పవిత్ర, చందు మధ్య పరిచయమైంది. అది ప్రేమకు దారి తీసింది. పవిత్రా జయరాంకు పెళ్లైంది. ఆమెకు 22 ఏళ్ల కొడుకు, 19 ఏళ్ల కుమార్తె ఉన్నారు. భర్త నుంచి వేరుపడిన పవిత్ర, చందుతో కలిసి మణికొండలో సహ జీవనం చేశారట. నాలుగేళ్లుగా భార్యకు దూరంగా చందు ఉన్నారట. పవిత్ర కుమార్తె ప్రతీక్ష కాలేజీకి వెళ్లి పేరెంట్ గా సంతకం చేశాడని చందు భార్య శిల్ప ఆరోపించారు. చందు, పవిత్ర మరణాలతో వాళ్లిద్దరి జీవిత భాగస్వాములు, పిల్లలు అనాథలు అయ్యారు. (all images courtesy: chandrakanth_artist / instagram)