Tollywood: టాలీవుడ్ స్టార్ హీరోస్‌కి ఓటు వెయ్యడానికి అంత బద్ధకమా?
Telugu Stars Who Doesn't Cast Their Vote: ఏపీలో అసెంబ్లీ & పార్లమెంట్, మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. స్టార్ హీరో ఒకరు ఓటు వేయలేదు. ఆయన బద్ధకం చర్చకు దారి తీసింది.
బాధ్యత ఉండక్కర్లా అని సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక మూవీలో కోప్పడతాడు. ఆ సీన్ వైరల్ అయ్యింది. ప్రజలకే కాదు, స్టార్ హీరోలకూ బాధ్యత వుండాలి. ఎన్నికల వంటివి వచ్చినప్పుడు జాగ్రత్తగా నడుచుకోవాలి. తప్పనిసరిగా ఓటు వెయ్యాలి. బాధ్యత లేకుండా ఓటు వెయ్యని స్టార్ హీరో బద్ధకం ఫిలిం ఇండస్ట్రీలో, జనాల్లో చర్చకు దారి తీసింది. ఎంత హీరో అయితే మాత్రం ఓటు వేయడానికి అతడికి అంత బద్ధకం ఏమిటని నలుగురూ నానా మాటలు అంటున్నారు.
దుబాయ్ నుంచి వచ్చిన రాజమౌళి
ముంబై నుంచి ఎన్టీఆర్, లక్ష్మీ మంచు
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దుబాయ్ నుంచి వచ్చాడు. ఎయిర్ పోర్ట్ నుంచి డైరెక్ట్‌గా పోలింగ్ బూత్ దగ్గరకు చేరుకొని ఓటు వేశారు. అందువల్ల తమ ముఖాలు అలా వున్నాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికలకు ముందు రోజు ముంబైలో వున్నారు. బాలీవుడ్ మూవీ 'వార్ 2' షూట్ చేస్తున్నాడు. కేవలం తన ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం హైదరాబాద్ వచ్చాడు. ఓటు వేసిన తర్వాత బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఫారిన్ ప్రయాణం అయ్యాడు. లక్ష్మీ మంచు కూడా ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి ఎన్నికల్లో ఓటు వేసింది. కానీ, హైదరాబాద్ సిటీలో వున్న స్టార్ హీరోస్ ఇద్దరు ముగ్గురు ఓటు వెయ్యడానికి కదల్లేదు.
ఓటు వెయ్యడానికి అంత బద్ధకమా?
టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాగ చైతన్య తదితరులు ఓటు వేశారు. అయితే టాప్ 10 లిస్టులో వున్న స్టార్ హీరోస్ ముగ్గురి నలుగురి జాడ పోలింగ్ బూత్స్ దగ్గర కనిపించలేదు. ఆ ముగ్గురిలో ఒక యంగ్ హీరో మాత్రం సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోలింగ్‌కి బలి అవుతున్నాడు. పాన్ ఇండియా లెవల్ క్రేజ్ వున్న హీరోలు అందరూ ఓటు వేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.
Also Read: పాపం యాంకర్... పొలిటికల్ పబ్లిసిటీకి పోయి కెరీర్ రిస్క్ చేసిందా? ఇప్పుడు ఫీలైతే ఎలా?
టాలీవుడ్ స్టార్ హీరో ఒకరికి ముందు నుంచి బద్ధకం అని ఇండస్ట్రీ సర్కిళ్లలో టాక్ వుంది. ఇంకొక హీరో ప్రతిదానికి బిజినెస్ లెక్కలు వేసుకుంటాడని పేరు వుంది. ఆ ఇద్దరు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కనిపించలేదు. అసెంబ్లీ అంటే కేవలం స్టేట్ సీఎం ఎన్నిక. పార్లమెంట్ అంటే పీఎం ఎన్నిక. దేశ ప్రధానిని డిసైడ్ చేసేది. అందుకని, మరింత బాధ్యతగా వుండాలి. ఐదేళ్లకు ఒక్కసారి వచ్చే ఎన్నికల కోసం ఒక్క రోజు స్టార్ హీరోస్ టైమ్ స్పెండ్ చెయ్యలేని బిజీగా వున్నార్రా అని ట్రోల్స్ చేస్తున్నారు ఆడియన్స్. ఓటు వెయ్యలేనంత బిజీగా వున్న ఆ హీరోస్ ఎవరో మీకు ఐడియా వచ్చి వుండాలి.
ఎంత హీరో అయినా రాజ్యాంగం ముందు సామాన్య పౌరుడు. ప్రతి పౌరుడు విధిగా తన బాధ్యత నిర్వర్తించాలి. హీరో అయ్యాక మరింత బాధ్యతగా వుండాలి. ఈ విధంగా ఓటు వెయ్యలేనంత పనులతో వుండటం కరెక్ట్ కాదు.
Also Read: యాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు