News
News
X

Thank You First Day Collections: నో థాంక్యూ - నాగ చైతన్య కెరీర్ ఏడేళ్ళు వెనక్కి వెళ్ళిందా?

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'థాంక్యూ' ఫస్ట్ డే కలెక్షన్స్ ఏమంత చెప్పుకోదగ్గ రీతిలో లేవనేది ఇండస్ట్రీ టాక్.

FOLLOW US: 

అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) కథానాయకుడిగా నటించిన 'థాంక్యూ' శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. విమర్శకుల నుంచి సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఆశించిన రీతిలో సినిమా లేదని చాలా మంది పెదవి విరిచారు. అక్కినేని అభిమానులు కొంత మందికి సినిమా నచ్చింది. చైతన్య నటనకు పేరు వచ్చింది. అయితే... థియేటర్లకు జనాలు మాత్రం రాలేదు.
 
'థాంక్యూ' సినిమా చూడటానికి ఫస్ట్ డే ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రాలేదు? రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కారణమా? జనాల్లో సినిమా ఏ ఆసక్తి కలిగించలేదా? కారణం ఏమైనా ఓపెనింగ్స్ బాలేదని చెప్పాలి. మొదటి రోజు వసూళ్లు దారుణంగా ఉన్నాయనేది ట్రేడ్ పండితుల మాట. 

Thank You First Day Box Office Collection: 'థాంక్యూ'కు కృష్ణా జిల్లాలో ఫస్ట్ డే షేర్ 12 లక్షలు వచ్చిందని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం మీద కోటి డెబ్బై లక్షలు (రూ. 1.70 కోట్లు) కలెక్ట్ చేసిందట. ఇటీవల కాలంలో అక్కినేని నాగ చైతన్య నటించిన సినిమాలు అన్నీ మంచి విజయాలు సాధించాయి. వసూళ్ళ పరంగానూ మంచి నంబర్స్ నమోదు చేశారు.

ఏడేళ్ళ క్రితం విడుదలైన చైతన్య సినిమాలకు కూడా ఇంత కంటే ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయని ట్రేడ్ వర్గాల ఖబర్. అక్కినేని నాగ చైతన్యను 'థాంక్యూ' ఏడేళ్ళు వెనక్కి తీసుకు వెళ్ళిందా? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క సినిమా పరాజయం పాలైనా తర్వాత సినిమాతో హిట్ అందుకుని, మళ్ళీ ఫామ్‌లో వచ్చిన హీరోలు ఉన్నారు. చైతన్య కూడా నెక్స్ట్ సినిమాతో భారీ విజయం అందుకోవాలని ఆశిద్దాం.

Also Read : 'కలర్ ఫోటో' ఎందుకంత స్పెషల్? నేషనల్ అవార్డు కంటెంట్ క్రియేటర్లకు ఎటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది?

'థాంక్యూ'లో నాగ చైతన్య సరసన రాశీ ఖన్నా కథానాయికగా నటించారు. మాళవికా నాయర్ హీరో స్కూల్ లైఫ్ లవ్ ఇంట్రెస్ట్ రోల్ చేశారు. అవికా గోర్ రోల్ ఏంటనేది ప్రస్తుతానికి సుస్పెన్స్. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథ అందించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు. 'దిల్' రాజు, శిరీష్ నిర్మించారు.

Also Read : తొలి ఛాన్స్ నుంచి 'ఆకాశమే నీ హద్దురా' వరకూ - సూర్య నేషనల్ అవార్డ్ కుటుంబానికి అంకితం

View this post on Instagram
 
A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)

Published at : 23 Jul 2022 06:07 PM (IST) Tags: Raashi Khanna Akkineni Naga Chaitanya Thank You First Day Collections Thank You Box Office Thank You Failed At Box Office

సంబంధిత కథనాలు

Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో లవ్‌పై రష్మిక షాకింగ్ రిప్లై, ఫ్యాన్స్ హర్ట్!

Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో లవ్‌పై రష్మిక షాకింగ్ రిప్లై, ఫ్యాన్స్ హర్ట్!

Vijay Devarakonda - Rashmika : విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి చేసుకుంటారా?

Vijay Devarakonda - Rashmika : విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి చేసుకుంటారా?

Controversial Issues: నెగిటివిటీతో పాపులారిటీ- బూతుపురాణమే ట్రెండ్, వివాదాలతో హిట్లు

Controversial Issues: నెగిటివిటీతో పాపులారిటీ- బూతుపురాణమే ట్రెండ్, వివాదాలతో హిట్లు

Suchi Leaks: ‘వాళ్లు నాతో బలవంతంగా శృంగారం చేశారు’ - ఆ సింగర్ వ్యాఖ్యలపై స్పందించిన ధనుష్!

Suchi Leaks: ‘వాళ్లు నాతో బలవంతంగా శృంగారం చేశారు’ - ఆ సింగర్ వ్యాఖ్యలపై స్పందించిన ధనుష్!

Vijay Devarakonda: రష్మికతో తనకున్న బంధం ఏంటో చెప్పేసిన విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda: రష్మికతో తనకున్న బంధం ఏంటో చెప్పేసిన విజయ్ దేవరకొండ!

టాప్ స్టోరీస్

BJP Politics: అటు ఈటల, ఇటు బండి - కరీంనగర్‌లో బీజేపీ వ్యూహం ఫలించేనా?

BJP Politics: అటు ఈటల, ఇటు బండి - కరీంనగర్‌లో బీజేపీ వ్యూహం ఫలించేనా?

Raghavendra Rao: పిచ్చి పిచ్చిగా ఉందా? సుధీర్ అభిమానులపై రాఘవేంద్రరావు ఆగ్రహం

Raghavendra Rao: పిచ్చి పిచ్చిగా ఉందా? సుధీర్ అభిమానులపై రాఘవేంద్రరావు ఆగ్రహం

Vemulawada: ధర్మగుండం తెరవండయ్యా! రాజన్న భక్తుల వేడుకోలు - కొవిడ్ తర్వాత పట్టించుకోకుండా

Vemulawada: ధర్మగుండం తెరవండయ్యా! రాజన్న భక్తుల వేడుకోలు - కొవిడ్ తర్వాత పట్టించుకోకుండా

Araku Train: పర్యాటకులకు పంద్రాగస్టు కానుక, అరకు రైలుకు నాలుగో గాజు బోగి!

Araku Train: పర్యాటకులకు పంద్రాగస్టు కానుక, అరకు రైలుకు నాలుగో గాజు బోగి!