News
News
X

Suriya Sivakumar: తొలి ఛాన్స్ నుంచి 'ఆకాశమే నీ హద్దురా' వరకూ - సూర్య నేషనల్ అవార్డ్ కుటుంబానికి అంకితం 

National Film Awards 2022: ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న సూర్య, తన సంతోషాన్ని లేఖ రూపంలో విడుదల చేశారు.

FOLLOW US: 

నటుడిగా సూర్య (Suriya Sivakumar) ప్రతిభ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎటువంటి కథ, క్యారెక్టర్‌లో అయినా పరకాయ ప్రవేశం చేయగల కథానాయకుల్లో ఆయన ఒకరు. విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల జేజేలు ఆయనకు కొత్త కాదు. అలాగే, సినీ పురస్కారాలు కూడా! గతంలో రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు అందుకున్నారు. 'ఆకాశమే నీ హద్దురా'తో ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. 

'ఆకాశమే నీ హద్దురా' (Aakasam Nee Haddura In Telugu) సినిమాకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం ప్రకటించిన తర్వాత సూర్య ఒక లేఖ విడుదల చేశారు. అందులో తొలి సినిమా నుంచి జాతీయ పురస్కారం తీసుకొచ్చిన సినిమా వరకూ... తన జీవిత భాగస్వామి జ్యోతిక నుంచి తన పిల్లలు, తల్లిదండ్రుల వరకూ అందరినీ తలుచుకున్నారు.  

''నమస్కారం! మీరు చూపిస్తున్న ప్రేమ, శుభాకాంక్షలకు నా హృదయ పూర్వక నమస్సుమాంజలి. 'సూరారై పోట్రు' (Soorarai Pottru In Tamil, తెలుగులో ఆకాశమే నీ హద్దురా) సినిమాకు ఐదు జాతీయ పురస్కారాలు రావడంతో మేమంతా అమితానందంలో ఉన్నాం. కరోనా మహమ్మారి కాలంలో ఓటీటీలో విడుదలైనప్పుడు వచ్చిన స్పందన చూసి ఎంతో సంతోషించాం. ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో మా సంతోషం రెట్టింపు అయ్యింది. సుధా కొంగర హార్డ్ వర్క్, సృజనాత్మక దృష్టికి తగిన ఫలితం ఇది'' అని సూర్య పేర్కొన్నారు. తనతో పాటు 'ఆకాశమే నీ హద్దురా'కు జాతీయ పురస్కారాలు అందుకున్న మిగతా వారికి కంగ్రాట్స్ చెప్పారు. తన నిర్మాణ సంస్థ 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు ఇది గొప్ప గుర్తింపు అని అన్నారు. 2డీ సీఈవో రాజశేఖర్ కర్పూర సుందరపాండియన్, సంస్థలో ఇతర సభ్యుల గురించి ఆయన ప్రస్తావించారు.

జాతీయ పురస్కారం వచ్చిన సందర్భంగా తొలి సినిమా 'నెరుక్కు నేర్' అవకాశం ఇచ్చిన దర్శకుడు వసంత్ సాయి, ఆ సినిమా నిర్మాత - ప్రముఖ దర్శకుడు మణిరత్నానికి కృతజ్ఞతలు చెప్పారు సూర్య. జాతీయ పురస్కారాలు అందుకున్న మిగతా వారికీ కంగ్రాట్స్ చెప్పారు. 

'ఆకాశమే నీ హద్దురా'లో నటించడమే కాదు, నిర్మించాలని చెప్పిన జీవిత భాగస్వామి జ్యోతికకు సూర్య ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే, తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు కూడా! తన పిల్లలు దేవ్, దియాతో పాటు ఫ్యామిలీకి అవార్డును అంకితం ఇస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Also Read : 'కలర్ ఫోటో' ఎందుకంత స్పెషల్? నేషనల్ అవార్డు కంటెంట్ క్రియేటర్లకు ఎటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది?

మరింత కష్టపడి పని చేయాలనే మోటివేషన్ నేషనల్ అవార్డు ఇచ్చిందని సూర్య చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు థాంక్స్ చెప్పారు. 

Also Read : మహేష్ బాబుతో విజయ్ సేతుపతి - ఆగస్టు నుంచి

Published at : 23 Jul 2022 04:37 PM (IST) Tags: Soorarai Pottru Aakasam Nee Haddura National Film Awards 2022 Suriya Best Actor National Award National Awards 2022 Suriya Responce Post National Award Win Suriya Happiness On National Award

సంబంధిత కథనాలు

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Salman Khan: అభిమానులకు సల్మాన్ ఖాన్ గుడ్ న్యూస్, ఆ సినిమాకు మరో సీక్వెల్ - రిలీజ్ డేట్ ఇదే

Salman Khan: అభిమానులకు సల్మాన్ ఖాన్ గుడ్ న్యూస్, ఆ సినిమాకు మరో సీక్వెల్ - రిలీజ్ డేట్ ఇదే

Vijay Devarakonda : దర్శకత్వ శాఖలో పనిచేసిన విజయ్ దేవరకొండ - ఎవరి దగ్గరో తెలుసా?

Vijay Devarakonda : దర్శకత్వ శాఖలో పనిచేసిన విజయ్ దేవరకొండ - ఎవరి దగ్గరో తెలుసా?

Dj Tillu 2: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?

Dj Tillu 2: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?

NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్‌తో - క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన ప్రశాంత్ నీల్

NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్‌తో - క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన ప్రశాంత్ నీల్

టాప్ స్టోరీస్

Horoscope Today 16th August 2022: ఈ రెండు రాశులవారికి అదృష్టం, ఆ రాశివారికి విజయం, ఆగస్టు 16 రాశిఫలాలు

Horoscope Today  16th August 2022:  ఈ రెండు రాశులవారికి అదృష్టం, ఆ రాశివారికి విజయం, ఆగస్టు 16 రాశిఫలాలు

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!

ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!

Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల

Tummmala Nageswararao :  హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల