SSMB 28 Exclusive Update: మహేష్ బాబుతో విజయ్ సేతుపతి - ఆగస్టు నుంచి
సూపర్ స్టార్ మహేష్ బాబుతో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ సినిమా నిర్మిస్తోంది. ఇది ప్రేక్షకులకు తెలిసిన విషయమే. మహేష్, త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ చిత్రమిది. హీరోగా మహేష్ బాబుకు 28వ సినిమా (SSMB 28 Movie). ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ కానుంది.
మహేష్ - త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి కనిపించనున్నారని కొన్ని రోజుల క్రితం వినిపించింది. అసలు నిజం ఏంటంటే... విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. అందులో కొన్ని గ్రే షేడ్స్ ఉంటాయి. విజయ్ సేతుపతి రీసెంట్‌గా కథ, అందులో తన క్యారెక్టర్ గురించి విన్నారు. సినిమాలో నటించడం తనకు సంతోషం అంటూ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం కూడా చేశారు.
ఆగస్టు నుంచి స్టార్ట్ కానున్న SSMB 28 ఫస్ట్ షెడ్యూల్‌లో విజయ్ సేతుపతి కూడా జాయిన్ కానున్నారు. హైదరాబాద్‌లో షూటింగ్ స్టార్ట్ చేయాలనేది ప్రస్తుతానికి ప్లాన్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశారు. స్పీడుగా షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Also Read : క్వారంటైన్ అంత సరదాగా ఏమీ ఉండదు - కరోనా తగ్గిన తర్వాత వరలక్ష్మీ ఫస్ట్ వీడియో
మహేష్ బాబు సరసన పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.
Also Read : దర్జా రివ్యూ: లేడీ డాన్‌గా అనసూయ, ఏసీపీగా సునీల్ - 'దర్జా'గా చూడొచ్చా? సినిమా ఎలా ఉందంటే?
View this post on Instagram