Varalaxmi Sarathkumar : క్వారంటైన్ అంత సరదాగా ఏమీ ఉండదు - కరోనా తగ్గిన తర్వాత వరలక్ష్మీ ఫస్ట్ వీడియో
Varalaxmi Sarathkumar Tested Negative: వరలక్ష్మీ శరత్ కుమార్ కొవిడ్ నుంచి కోలుకున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లారు.
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) అభిమానులకు గుడ్ న్యూస్. కరోనా నుంచి ఆమె కోలుకున్నారు. కొన్ని రోజుల క్రితం తనకు కొవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వరలక్ష్మీ శరత్ కుమార్ వెల్లడించారు. అంతే కాదు... ఫ్లాట్‌లో తన పెట్ డాగ్‌తో, క్వారంటైన్‌లో ఎలా ఎంజాయ్ చేస్తున్నదీ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు.
లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... టెస్ట్ చేయించుకోగా కరోనా నెగెటివ్ అని వచ్చిందని, త్వరలో విడుదల కానున్న తమిళ సినిమా 'పోయికాల్ కుదురై' ప్రమోట్ చేయడానికి చెన్నై వెళ్తున్నాని వరలక్ష్మీ శరత్ కుమార్ పేర్కొన్నారు.
''కరోనా ఇంకా మన చుట్టూ ఉంది. కొవిడ్ వస్తే కొంత మంది హ్యాండిల్ చేయగలరు, కొంత మంది చేయలేరు. అందుకని, జాగ్రత్తగా ఉండండి. క్వారంటైన్ ఏమీ సరదాగా ఉండదు'' అని వరలక్ష్మీ శరత్ కుమార్ తెలిపారు.
Also Read : ది గ్రే మ్యాన్ రివ్యూ: ధనుష్ హాలీవుడ్ సినిమాలో యాక్షన్ ఓకే, కథ సంగతేంటి?
View this post on Instagram
ఇటీవల వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు సినిమాలు ఎక్కువ చేస్తున్నారు. సమంత 'యశోద'లో ఆమె కీలక పాత్ర చేశారు. పాన్ ఇండియా సినిమా 'శబరి' చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ 107వ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సందీప్ కిషన్, విజయ్ సేతుపతి నటిస్తున్న 'మైఖేల్'లో ఉన్నారు. ఇంకా మరిన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.
Also Read : దర్జా రివ్యూ: లేడీ డాన్‌గా అనసూయ, ఏసీపీగా సునీల్ - 'దర్జా'గా చూడొచ్చా? సినిమా ఎలా ఉందంటే?
View this post on Instagram