Vijay: విజయ్ సినిమా నుంచి నిర్మాత వాకవుట్ - 250 కోట్లు ఇవ్వలేక వచ్చేశాడా?
Vijay Last Movie Before Politics: తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా పాపులారిటీ ఉన్న హీరో విజయ్. రాజకీయాల్లోకి వెళుతున్న సంగతి తెలిసిందే. ఆయన చివరి సినిమా చిక్కుల్లో పడిందని కోలీవుడ్ టాక్.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay)కు తెలుగునాట సైతం ఫాలోయింగ్ ఉంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో అతని సినిమాలు భారీ కలెక్షన్లు సాధించిన సందర్భాలు తక్కువ. అదే సమయంలో తమిళనాట అతని సినిమాలకు వందల కోట్లు కలెక్షన్స్ వస్తున్నాయి. తెలుగులో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న విజయ్ సినిమాలు కొన్ని తమిళంలో వంద కోట్లకు పైగా వసూలు చెయ్యడం జనాల్ని సర్‌ప్రైజ్ చేసింది. అందుకే, విజయ్ సినిమాలు ప్రొడ్యూస్ చెయ్యడానికి ఆసక్తి కనబరిచారు.
విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'దిల్' రాజు 'వారసుడు' ప్రొడ్యూస్ చేశారు. తెలుగులో సోసోగా ఆడినా తమిళంలో డబ్బులు వచ్చాయి. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరు, 'ఆర్ఆర్ఆర్'తో ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ తెచ్చుకున్న డీవీవీ దానయ్య కూడా విజయ్ (Vijay DVV Danayya Movie)కు అడ్వాన్స్ ఇచ్చారు. రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ లాస్ట్ సినిమా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఆయనకు వచ్చింది. అయితే, ఆ సినిమా నుంచి ఆయన బయటకు వచ్చారనే కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ఎందుకు వచ్చారనే విషయమై ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది.
Also Read: విశ్వంభర ఇంటర్వెల్... మెగాస్టార్ కెరీర్‌లోనే బెస్ట్ బ్యాంగ్!
విజయ్ 250 కోట్లు డిమాండ్ చెయ్యడంతో...
Thalapathy Vijay Remuneration Per Movie: విజయ్ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చెయ్యడంతో డీవీవీ దానయ్య ఆ సినిమా ప్రొడ్యూస్ చెయ్యడానికి వెనకడుగు వేశారట. తన లాస్ట్ సినిమా కావడంతో విపరీతమైన హైప్ వస్తుందని, కలెక్షన్స్ భారీగా ఉంటాయి కనుక తనకు 250 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వమని దళపతి డిమాండ్ చేశారట. దాంతో దానయ్య 'నో' చెప్పారని టాక్. అదీ సంగతి. దానయ్య వాకవుట్ చెయ్యడంతో 'లియో' సినిమా ప్రొడ్యూసర్, సెవెన్ స్క్రీన్ స్టూడియో అధినేత ఎస్ఎస్ లలిత్ కుమార్, విజయ్ మేనేజర్ జగదీశ్ పళనిస్వామి ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. నిర్మాతలుగా వాళ్లు ఉన్నప్పటికీ... తెర వెనుక నిర్మాత మాత్రం విజయ్ అనేది కోలీవుడ్ టాక్. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ ఏడాది చివరిలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లి, వచ్చే ఏడాది వేసవిలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారట.
Also Read: రాజశేఖర్ కొత్త సినిమా - ప్రభాస్ కజిన్ నిర్మాణంలో...
వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'గోట్' చేస్తున్న విజయ్
ప్రజెంట్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'గోట్' (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) మూవీలో విజయ్ యాక్ట్ చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత మరొక సినిమా చేయనున్నారు. ఆ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా విజయ్, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన 'గిల్లీ' (ఒక్కడు తమిళ్ రీమేక్) రీ రిలీజ్ చెయ్యగా రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయి. రీ రిలీజుల్లో ఆ మూవీ హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
Also Read: కొరటాల చేసిన తప్పు నాగ్ అశ్విన్ చెయ్యలేదు - ఆచార్యకు, కల్కికి తేడా అదే మరి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

