Sundeep Kishan: సందీప్ కిషన్ రెమ్యూనరేషన్ పెంచాడా? త్రినాథరావు నక్కిన సినిమా బడ్జెట్ అంత ఎక్కువా?
Sundeep Kishan New Movie: 'ధమాకా' విజయం తర్వాత సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు నక్కిన సినిమా చేస్తున్నారు. ఆ సినిమా బడ్జెట్, హీరో రెమ్యూనరేషన్ గురించి టాక్ ఏమిటంటే?

హిట్స్ వచ్చిన తర్వాత హీరో హీరోయిన్లు, దర్శక రచయితలు తమ రెమ్యూనరేషన్ పెంచడం కామన్. యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ఆ రూటులో వెళుతున్నాడని సమాచారం. రీసెంట్‌గా 'రాయన్'గా ఆయన హిట్ అందుకున్నాడు. ఆ సినిమాలో సందీప్ కిషన్ సోలో హీరో కాదు. కానీ తన క్యారెక్టర్, వైన్ షాప్ దగ్గర ఫైట్ చాలా హైలైట్ అయ్యింది. కొంత క్రేజ్ వచ్చిన మాట నిజం. అందుకని, రెమ్యూనరేషన్ పెంచినట్టు ఉన్నాడు.
ఇప్పుడు సందీప్ కిషన్ ఆరు కోట్లు అడుగుతున్నాడా?
ప్రజెంట్ త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఆ మూవీకి ఆరు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ గుసగుస. 'ధమాకా' విజయం తర్వాత ఆ డైరెక్టర్ చేస్తున్న సినిమా ఇది. బాక్సాఫీస్ బరిలో ఆ మూవీ వంద కోట్లు కలెక్ట్ చేసింది. కామెడీ తీయడంలో దర్శకుడికి సపరేట్ స్టైల్ వుంది. అందుకని, క్రేజ్ బావుంది. పైగా, సందీప్ కిషన్ హిట్ కొట్టి వున్నాడు. సో, రెమ్యూనరేషన్ పెంచారని టాక్.
Sundeep Kishan - Trinadha rao nakkina..'s combinational film 'Majaka' Budget might touch or exceeds Rs.30 Crores. (Highest in sundeep kishan career as solo hero)
— Phani Kumar (@phanikumar2809) August 27, 2024
Sundeep Kishan demanding Rs.6 crores as his remuneration@sundeepkishan @TrinadharaoNak1 @RajeshDanda_ @HasyaMovies… pic.twitter.com/Cqfotu5Ulc
సందీప్ కిషన్ కెరీర్‌లో భారీ బడ్జెట్ సినిమా ఇదేనా?
హీరోగా సందీప్ కిషన్ 30వ సినిమా ఇది. అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. కానీ, ఈ సినిమాకు 'మజాకా' టైటిల్ కన్ఫర్మ్ చేశారట. ఇంకో విషయం ఏమిటంటే... ఈ సినిమా సందీప్ కిషన్ కెరీర్ మొత్తంలో భారీ బడ్జెట్ సినిమా కాబోతుందట. సుమారు 30 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని టాక్. ఈ బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ అయిన సినిమాల్లో సందీప్ కిషన్ యాక్ట్ చేశాడు. కానీ, సోలో హీరోగా కాదు. సోలో హీరోగా ఆయన బిగ్ బడ్జెట్ ఫిల్మ్ ఇదేనని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల టాక్.
Also Read: 'సరిపోదా శనివారం' సినిమా ఫస్ట్ రివ్యూ... మూడు గంటలు ఇంట్రడక్షన్ సాంగ్ లెక్క కొడితే!
సందీప్ కిషన్, త్రినాథ రావు నక్కిన సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజేష్ దండా ప్రొడ్యూసర్. బాలాజీ గుత్తా కో ప్రొడ్యూసర్. ఈ ఏడాది జూన్ నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. లవ్, ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్, త్రినాథ రావు నుంచి ఆశించే కామెడీ అన్నీ సినిమాలో ఉంటాయట. సందీప్ కిషన్‌ను డైరెక్టర్ చాలా కొత్తగా చూపించబోతున్నారట. ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తుండగా... నిజార్ షఫీ ఛాయాగ్రహణ బాధ్యతలు చూస్తున్నారు. రావు రమేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

