Mangalavaaram 2: 'మంగళవారం 2'లో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్... పాయల్ రాజ్‌పుత్ కంటే బోల్డుగా చేస్తుందా?
Mangalavaaram 2 Actress: పాయల్ రాజ్ పుత్, అజయ్ భూపతి కాంబోలో వచ్చిన హిట్ మూవీ 'మంగళవారం'. ఇప్పుడు తెరపైకి రాబోతున్న 'మంగళవారం 2'లో యంగ్ తెలుగు హీరోయిన్ యాక్ట్ చేయబోతోంది అనే టాక్ నడుస్తోంది.

మోస్ట్ అవైటింగ్ సీక్వెల్స్ లో 'మంగళవారం 2' సినిమా కూడా ఒకటి. గ్లామరస్ హీరోయిన్ పాయల్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన 'మంగళవారం' మూవీ 2023లో రిలీజై, సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాకు సీక్వెల్ ఉండబోతుందని మేకర్స్ ముందుగానే ప్రకటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు శర వేగంగా జరుగుతుండగా, తాజాగా సీక్వెల్ కోసం ఓ క్రేజీ హీరోయిన్ ని మేకర్స్ సెలెక్ట్ చేశారనే వార్త వైరల్ గా మారింది.
'మంగళవారం 2' కోసం క్రేజీ హీరోయిన్
2023లో తెరపైకి వచ్చిన 'మంగళవారం' మూవీకి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఇందులో నందిత శ్వేత, దివ్య పిళ్లై, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్, పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్స్ పోషించారు. డిఫరెంట్ పాయింట్ తో రూపొందిన ఈ సినిమాలో అజనీష్ లోక్నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించింది. అలాగే పాయల్ రాజ్ పుత్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఇప్పుడు 'మంగళవారం 2' కోసం మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. కానీ ఇది సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అని సమాచారం.
ఇప్పటికే అజయ్ భూపతి 'మంగళవారం 2' స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేయగా, త్వరలోనే షూటింగ్ కూడా షురూ కాబోతోందని అంటున్నారు. ఇక ఈ ప్రీక్వెల్ పై ఉన్న బజ్ కారణంగా ఓ బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఈ సినిమా నిర్మాణంలో భాగం కాబోతుందని టాక్ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం 'మంగళవారం 2' సినిమాలో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ సెకండ్ పార్ట్ లో కనిపించబోదని తెలుస్తోంది. ఆమె ప్లేస్ ని యంగ్ హీరోయిన్ శ్రీలీల రీప్లేస్ చేయబోతుందని అంటున్నారు. ప్రస్తుతానికి మేకర్స్ శ్రీలీలతో సంప్రదింపులు జరుపుతుండగా, త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.
Also Read: పట్టుదల రివ్యూ: హాలీవుడ్ స్టైల్‌లో అజిత్, త్రిష యాక్షన్ ఫిల్మ్ - హిట్టా? ఫట్టా?
ఇప్పటికే కథ నచ్చడంతో శ్రీలీల ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. కానీ ఈ విషయంపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. కానీ ఈ వార్తలు గనుక నిజమైతే పాయల్ ను శ్రీలీల మరిపిస్తుందా ? అనేది ఆసక్తికరంగా మారింది. గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ పాయల్ రాజ్ పుత్, శ్రీలీల మాత్రం డ్యాన్సింగ్ క్వీన్... అయినప్పటికీ శ్రీలీల గనుక ఈ ఛాన్స్ కొట్టేస్తే, తన యాక్టింగ్ స్కిల్స్ నిరూపించుకునే మంచి ఛాలెంజింగ్ ఛాన్స్ దొరికినట్టే.
శ్రీలీల ఖాతాలో ఉన్న సినిమాలు
ఇదిలా ఉండగా, రీసెంట్ గా 'పుష్ప 2' మూవీలో ఐటమ్ సాంగ్ తో థియేటర్లు దద్దరిల్లేలా చేసిన శ్రీలీల ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. నితిన్ 'రాబిన్ హుడ్', రవితేజతో 'మాస్ కా జాతర', సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తో ఓ మూవీ, శివ కార్తికేయన్ తో 'పరాశక్తి' చేస్తూ బిజీగా ఉంది.





















