అన్వేషించండి

Raj Tarun: మీడియాకు ముఖం చాటేసిన పురుషోత్తముడు - కేసులు, క్వశ్చన్స్ దెబ్బకు భయపడ్డాడా?

Purushothamudu: 'పురుషోత్తముడు' ఈ శుక్రవారం (జూలై 26న) థియేటర్లలోకి వస్తోంది. అయితే, ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో రాజ్ తరుణ్ కనిపించడం లేదు.

యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) మీడియాకు ముఖం చాటేస్తున్నాడు. ఆయన కొత్త సినిమా 'పురుషోత్తముడు' ఈ శుక్రవారం (జూలై 26న) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. అయితే... ఆయా ప్రోగ్రాంలలో రాజ్ తరుణ్ అసలు కనిపించడం లేదు. కేసులు, క్వశ్చన్స్ దెబ్బకు ఆయన భయపడి అయినా ఉండాలి. లేదంటే ఈ గొడవ ఎందుకు? అని అవాయిడ్ చేయడానికి అయినా సరే మీడియాకు ముఖం చాటేశాడని అనుకోవాలి. 

రాజ్ తరుణ్ లేకుండా వీడియో ఇంటర్వ్యూలు
కొత్త సినిమా విడుదలకు ముందు హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, యూనిట్ సభ్యులు ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆనవాయితీ. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు తప్ప మిగతా అందరూ ఇంటర్వ్యూలు ఇస్తారు. ఒకవేళ అలా కుదరని పక్షంలో కామన్ వీడియో ఇంటర్వ్యూ రికార్డ్ చేసి అందరికీ పంపిస్తారు. చిన్న సినిమా హీరో హీరోయిన్లు అయితే యూట్యూబ్ చాన్నాళ్లకు విడివిడిగా ఇంటర్వ్యూలు ఇస్తారు. 

'పురుషోత్తముడు'కు ముందు రాజ్ తరుణ్ సైతం యూట్యూబ్ ఛానళ్లు అన్నిటికీ ఇంటర్వ్యూలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. అయితే, ఇప్పుడు పరిస్థితులు ఈ యంగ్ హీరోకి అనుకూలంగా లేవు. ఆయన మీద లావణ్య కేసు పెట్టడం, విచారణకు రమ్మని పోలీసుల నుంచి నోటీసులు రాగా రాలేనని లేఖ రాశారు రాజ్ తరుణ్. 

లావణ్య కేసు నేపథ్యంలో మీడియా అందరికీ ఇంటర్వ్యూ ఇవ్వడానికి రాజ్ తరుణ్ సుముఖంగా లేరని అనుకున్నా... యూనిట్ సభ్యులతో కలిసి కామన్ ఇంటర్వ్యూ ఇస్తే బావుండేది. సినిమా ప్రచారానికి హెల్ప్ అయ్యేది. కానీ, ఆయన అలా కూడా చేయడం లేదు. మీడియాతో పాటు చిత్ర బృందానికి సైతం ముఖం చాటేసినట్టు తెలుస్తోంది. ఇటీవల 'పురుషోత్తముడు' టీమ్ ఓ కామన్ ఇంటర్వ్యూ రికార్డ్ చేయగా... దర్శక నిర్మాతలతో పాటు హీరోయిన్ హాసినిని నటుడు ప్రవీణ్ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఫోటోలు రిలీజ్ చేశారు. అందులో రాజ్ తరుణ్ లేడు.

Also Readబాలయ్య వీరాభిమానిగా 'బాలు గాని టాకీస్' హీరో - కొత్త సినిమా అనౌన్స్ చేసిన ఆహా


'పురుషోత్తముడు' టీమ్ సోమవారం (జూలై 22న) కొన్ని యూట్యూబ్ ఛాన్నాళ్ళకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలకు సైతం రాజ్ తరుణ్ రాలేదు. డుమ్మా కొట్టారు. రాజ్ తరుణ్ మీడియా ముందుకు వస్తే తప్పకుండా లావణ్య గురించి, ఆమె పెట్టిన కేసుల గురించి ప్రశ్నలు ఎదురు అవుతాయి. వాటిని అవాయిడ్ చేయడానికి ఆయన మీడియా ముందుకు రావడం లేదని ఫిల్మ్ నగర్ గుసగుస. 

'పురుషోత్తముడు' విడుదలైన వారం తర్వాత... ఆగస్టు 2వ తేదీన 'తిరగబడర సామి' సినిమా థియేటర్లలోకి రావడానికి రెడీ అయ్యింది. అందులో మాల్వీ మల్హోత్రా హీరోయిన్. ఆవిడ మీద సైతం లావణ్య ఆరోపణలు చేసింది. ఆ సినిమా ప్రచార కార్యక్రమాలకు రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా వచ్చే అవకాశాలు అసలు కనబడటం లేదు.

Also Read: నితిన్, నాగ చైతన్య సినిమాలపై గేమ్ ఛేంజర్ ఎఫెక్ట్ - ఆ హీరోలు ఇప్పుడు ఏం చేస్తారో?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget