అన్వేషించండి

Anil Ravipudi: అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబినేషన్ మూవీపై కన్‌ఫ్యూజన్ - ఇంతకీ దీని కథ ఏంటి?

Venkatesh Upcoming Movie: ప్రస్తుతం వెంకటేశ్.. తనకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందించిన దర్శకుడు అనిల్ రావిపూడితో మరో సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా దాని గురించి ప్రేక్షకుల్లో చర్చ మొదలయ్యింది.

Anil Ravipudi: ఒక డైరెక్టర్, ఒక హీరో కలిసి హిట్ కొట్టారంటే మళ్లీ మళ్లీ వాళ్లు కలిసి పనిచేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. టాలీవుడ్‌లో అలాంటి హిట్ కాంబినేషన్స్ చాలానే ఉన్నాయి. అందులో ఒకటి అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేశ్ కాంబో. వెంకటేశ్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌లో చాలా క్రేజ్ ఉంది. అలా తన ఫ్యాన్స్ తనను ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించి రెండుసార్లు హిట్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు వీరిద్దరూ కలిసి హ్యాట్రిక్ హిట్ కోసం సిద్ధమవుతున్నారు. కానీ ఈ మూవీ గురించి ప్రేక్షకుల్లో ఒక కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది.

ఆ సినిమా కాదా?

ఇప్పటికే అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబినేషన్‌లో ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ లాంటి రెండు సినిమాలు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాయి. అయితే మరోసారి వెంకటేశ్, అనిల్ రావిపూడి కలిసి సినిమా చేస్తున్నారు అనగానే ఇది కూడా ఈ కామెడీ ఫ్రాంచైజ్‌కు సంబంధించిన సినిమానే అని ప్రేక్షకులు అనుకున్నారు. దీని టైటిల్ ‘ఎఫ్ 4’ అని కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇక్కడే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఒక కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. ఒకవేళ ఇది ఫ్రాంచైజ్‌లో భాగమే అయితే ఇందులో వరుణ్ తేజ్ కూడా ఉండాలి కదా, కానీ తాజాగా విడుదలయిన అనౌన్స్‌మెంట్ వీడియోలో అసలు వరుణ్ తేజ్ గురించి లేదే అన్న డౌట్ స్టార్ట్ అయ్యింది.

క్రైమ్ ఎంటర్‌టైనర్..

‘ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ తర్వాత విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కలిసి విక్టోరియస్ హ్యాట్రిక్ కోసం మరోసారి చేతులు కలపబోతున్నారు’ అంటూ కొన్నిరోజుల క్రితమే ఒక అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఇందులో వెంకటేశ్.. ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ అని కూడా రివీల్ చేశారు. మాజీ పోలీస్ ఆఫీసర్, మాజీ ప్రేమికురాలు, అద్భుతమైన భార్య.. ఈ ముగ్గురు మధ్య జరిగే కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని క్లారిటీ ఇచ్చారు. ‘ఈసారి ఒక ఎక్స్‌ట్రార్డినరీ ట్రాయాంగులర్ క్రైమ్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాం’ అంటూ ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తుంటే ‘ఎఫ్ 2’ ఫ్రాంచైజ్‌తో సంబంధం లేనట్టుగా అనిపిస్తోందని వెంకీ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)

త్వరలోనే అది కూడా..

ఒకవేళ ఈ మూవీ.. ‘ఎఫ్ 2’ ఫ్రాంచైజ్‌లో భాగం కాకపోయినా.. త్వరలోనే ఆ మూవీ కూడా తెరకెక్కబోతుందని అనిల్ రావిపూడి ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. మాజీ పోలీస్, మాజీ ప్రేమికురాలు అంటూ ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హైప్ పెంచేశాడు. సంక్రాంతికి ఈ సినిమాతో వస్తున్నామని కూడా అనౌన్స్‌మెంట్ వీడియోలో ప్రకటించేశారు మేకర్స్. ‘సంక్రాంతికి 'విక్టరీ వినోదం'తో కలుద్దాం’ అంటూ ఫ్యాన్స్‌లో జోష్ నింపారు.

Also Read: ప్రెగ్నెన్సీ సమయంలో అలాంటి అనుభవం, దానివల్లే డిప్రెషన్ - నమిత

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Deepfake Scam: డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Embed widget