News
News
X

వీర సింహారెడ్డి సినిమా చూసిన ఏపీ ప్రభుత్వ అధికారులు- ప్రభుత్వానికి నివేదిక!

బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాపై ప్రభుత్వం వర్గాల్లో చర్చ నడుస్తోందా? బాలయ్య డైలాగులపై ప్రభుత్వ పెద్దలు రగిలిపోతున్నారా? చిత్రంలో పూర్తి డైలాగులను పరిశీలించేందుకు అధికారులు కూడా సినిమా చూశారా? 

FOLLOW US: 
Share:

బాలయ్య నటించిన వీరసింహా రెడ్డి చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నబాలయ్య అభిమానులు చిత్రం రిలీజ్ సందర్భంగా ఆనందోత్సాహాలతో ఎంజాయ్ చేశారు. దేశ విదేశాల్లో బాలయ్య అభిమానులకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని అంతా ఫీల్ అయ్యారు. అదే టాక్‌తో రెండో రోజు కూడా థియేటర్స్‌కు ప్రేకక్షులను రప్పిస్తోంది. 

సినిమా హిట్‌, కలెక్షన్లు ఇవన్నీ పక్కన పెడితే... ఇప్పుడు అందులో ఉన్న కొన్ని డైలాగ్స్‌పై చర్చ నడుస్తోంది. సినిమాలో ఉన్న డైలాగులు పూర్తిగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధంగా ఉన్నాయనే అభిప్రాయం సినిమా రిలీజ్‌కు ముందు నుండే వ్యక్తం అయ్యాయి. ఇక చిత్రం రిలీజ్ అయిన తరవాత అసలు విషయం కూడా తెలిసింది. ఇంతకీ ఆ డైలాగులు ఎందుకు పేల్చారనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సెక్టార్లలో హాట్‌ టాపిక్‌ అయింది. అంతే కాదు ప్రభుత్వం కూడా బాలయ్య చిత్రంలోని డైలాగులపై ఆరా తీసిందని సమాచారం. ప్రత్యేకంగా అధికారుల టీంను కూడా పంపి డైలాగుల చిట్టా రాసుకురమ్మన్నారనే టాక్ నడుస్తుంది. బాలయ్య తన సినిమాల్లో ప్రభుత్వాన్ని ఆ స్థాయిలో విమర్శించారా, డైలాగులతో వైసీపీని అంతగా ఇరకాటంలోకి నెట్టారా అనే చర్చ తెర మీదకు వచ్చింది.

ఇంతకీ బాలయ్య డైలాగులు ఎలా ఉన్నాయి..

పాలించటం అభివృద్ధి... ప్రజలను వేధించడం కాదు. జీతాలు ఇవ్వటం అభివృద్ధి ..బిచ్చం వేయటం కాదు. పని చేయటం అభివృద్ధి, పనులు ఆపటం కాదు. నిర్మించటం అభివృద్ధి. కూల్చటం కాదు. పరిశ్రమలు తీసుకురావటం అభివృద్ధి ఉన్న పరిశ్రమలను వెళ్ళగొట్టటం కాదు. బుద్ది తెచ్చుకో. అభివృద్ధి అర్దం తెలుసుకో. తప్పు మాట్లాడితే గొంతు కోస్తా అంటూ మాటలు తూటాల్లా పేలాయి. ఇలాంటి డైలాగులు చాలా సినిమాలో ఉన్నాయి. అయితే ఇవన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. దీంతో విజయవాడ కేంద్రంగా కొందరు అధికారులు సినిమాను వీక్షించారని చెబుతున్నారు. 

ప్రభుత్వానికి వ్యతిరేఖంగా డైలాగులు ఉన్నాయని నిర్దారణకు వచ్చారని దీన్ని ఓ నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించారని అంటున్నారు. ఈ ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా ఫస్ట్ షో ప్రదర్శిస్తుండగానే చాలా మంది ఫోన్ లలో డైలాగులు రికార్డు చేసి, బయటకు వదిలారు. దీంతో అవి చాలా ఫాస్ట్‌గా వైరల్ అయ్యాయి. దీంతో అలాంటి డైలాగులు ఎందుకు వాడాల్సి వచ్చింది, కథలో భాగంగా వచ్చినవేనా లేకపోతే, టార్గెట్‌గానే వ్యవహరించారా అనే సందేహాలు పొలిటికల్ సెక్టార్‌లో ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి.

సినిమా యావరేజ్ అనే ఇలాంటి ప్రచారమా...

బాలయ్య నటించిన చిత్రం సంక్రాంతికి యావరేజ్ టాక్‌ను నమోదు చేసుకుందని,అందులో భాగంగానే సినిమాలో ప్లస్,మైనస్‌ల విషయం పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడిచాయి. సో వాటిని ఓవర్ కమ్ చేసేందుకే పొలిటికల్ సెక్టార్లలో ఇలాంటి ప్రచారం చేసుకోవటం ద్వార కలెక్షన్లను పెంచుకొని బయటపడేందుకు ట్రిక్స్ ప్లే చేస్తున్నారంటూ అధికార పక్షం నుంచి వస్తున్న విమర్శ. ఇప్పటికే బాలయ్య బాబు అనే పదం పై మంత్రి గుడివాడ అమర్ నాథ్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. బాలయ్య బాబు కాదు, తాత అంటూ మంత్రి చేసిన కామెంట్స్ కూడ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాశంగా మారాయి. మరి ఈ వ్యవహరంపై ప్రభుత్వ పెద్దలు,అధికార పార్టీకి చెందిన నేతలు ఎలా రియాక్ట్ అవుతారనేది ఇంట్రస్టింగ్ గా మారింది. 

Published at : 13 Jan 2023 12:29 PM (IST) Tags: YSRCP Balakrishna AP Politics TDP Veera Simha Reddy

సంబంధిత కథనాలు

Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?

Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?

Mahesh Babu : ఆగస్టు నుంచి దసరాకు వెళ్ళిన మహేష్ - త్రివిక్రమ్?

Mahesh Babu : ఆగస్టు నుంచి దసరాకు వెళ్ళిన మహేష్ - త్రివిక్రమ్?

Aditi Rao - Siddharth : శర్వానంద్ ఎంగేజ్‌మెంట్‌లో సిద్ధూ, అదితి జోడీ - ప్రేమేనా గురూ!

Aditi Rao - Siddharth : శర్వానంద్ ఎంగేజ్‌మెంట్‌లో సిద్ధూ, అదితి జోడీ - ప్రేమేనా గురూ!

BJP Party on Rajamouli : రాజమౌళి ఫ్యామిలీపై కేంద్రం ప్రత్యేక ప్రేమ చూపిస్తుందా? ఇండస్ట్రీ టాక్ ఏంటంటే?

BJP Party on Rajamouli : రాజమౌళి ఫ్యామిలీపై కేంద్రం ప్రత్యేక ప్రేమ చూపిస్తుందా? ఇండస్ట్రీ టాక్ ఏంటంటే?

Prabhas Director Demand : 150 కోట్లు డిమాండ్ చేస్తున్న ప్రభాస్ దర్శకుడు?

Prabhas Director Demand : 150 కోట్లు డిమాండ్ చేస్తున్న ప్రభాస్ దర్శకుడు?

టాప్ స్టోరీస్

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక

K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక