Ram Charan Acting Class Video: రామ్ చరణ్ ఫస్ట్ యాక్టింగ్ క్లాస్, గ్లోబల్ స్టార్ ఒకప్పుడు ఎలా ఉండేవాడో చూడండి
Ram Charan: రామ్ చరణ్ తండ్రిని మించిన తనయుడిగా సత్తా చాటుతున్నారు. పాన్ ఇండియా రేంజిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా చెర్రీ తొలి యాక్టింగ్ క్లాస్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Ram Charan Acting Class Video: తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ స్టార్ గా దూసుకెళ్తున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన, కొద్ది కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రికి మంచిన తనయుడిగా సత్తా చాటుతున్నారు. ‘చిరుత’ సినిమాతో మొదలైన ఆయన సినీ ప్రయాణం ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘RRR’ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకుంది. ఎప్పటికప్పుడు తనని తాను మార్చుకుంటూ ఎదిగిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. తొలుత విమర్శలు వచ్చినా, ఆ తర్వాత వాటిని అదిగమించి కెరీర్ ను హిట్ ట్రాక్ ఎక్కించారు. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు చెర్రీ.
ఫస్ట్ యాక్టింగ్ క్లాస్ లో రామ్ చరణ్
తాజాగా రామ్ చరణ్ కు సంబంధించిన వీడియో ఒకటి సోసల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో తన యాక్టింగ్ స్కూల్ కు సంబంధించినది. సినిమాల్లోకి రావడానికి ముందుకు ఆయన ముంబైలోని ఓ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ లో చేశారు. అక్కడ నటనలో మెళకులవలు నేర్చుకున్నారు. అయితే, రామ్ చరణ్ తన ఫస్ట్ యాక్టింగ్ క్లాస్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ వీడియో చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ వీడియోలో ఉన్నది చెర్రీయేనా? అని ఆశ్చర్యపోతున్నారు. గడ్డం, మీసాలు లేకుండా అస్సలు గుర్తించలేని విధంగా ఉన్నారు. వైట్ కలర్ టీ షర్ట్, జీన్స్ వేసుకుని పొడవాటి జుట్టుతో దర్శనం ఇచ్చాడు. ఫస్ట్ రోజు కేవలం యాక్టింగ్ వామప్ చేస్తూ, తన చేతులను అటూ ఇటూ తిప్పుతూ నవ్వుతూ కనిపించాడు. చరణ్‌ను చూసి వెనుక్కనున్న వాళ్లు పడీ పడీ నవ్వడం ఈ వీడియోలో చూడవచ్చు.
Em chesthunnadu ra vedu
— KIRAN 'NTR' (@NTRcult4ever) December 28, 2023
Ram hassan 😂 pic.twitter.com/2N4vWFkawD
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “కనీసం యాక్టింగ్ లో ఓనమాలు కూడా రాని రామ్ చరణ్, తనను తాను ఎంతో తీర్చిదిద్దుకున్నాడు. అద్భుత కృషితో గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. నిజంగా ఆయన గ్రేట్” అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొంత మంది ఈ వీడియోపై విమర్శలు కూడా చేస్తున్నారు.
‘గేమ్ ఛేంజర్’ మూవీతో బిజీ బిజీ
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ‘ గేమ్ ఛేంజర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. దర్శకుడు శంకర్ ఈ సినిమాను పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. బాలీవుడ్ నటి కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది నవంబర్ లో ఈ ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబుతోనూ ఓ సినిమా చేయబోతున్నారు. మరోవైపు బ్లాక్ బస్టర్ బాలీవుడ్ ఫ్రాంచైజీ ‘ధూమ్ 4’లోనూ ఆయన నటించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో ఆయన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ తో కలిసి యాక్ట్ చేయబోతున్నట్లు ప్రచారం జరగుతోంది.