Ginna Collections : అమెరికాలో 'జిన్నా'ను ఎంత మంది చూశారో తెలుసా? - షాకింగ్ కలెక్షన్స్
విష్ణు మంచు లేటెస్ట్ సినిమా 'జిన్నా'కు అమెరికాలో స్పందన ఆశించిన రీతిలో లేదని, అక్కడ కలెక్షన్స్ మరీ తక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అక్కడ సినిమాను ఎంత మంది చూశారో తెలుసా?
విష్ణు మంచు (Vishnu Manchu) కు అమెరికాలో తెలుగు ప్రేక్షకులు షాక్ ఇచ్చారని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'జిన్నా' (Ginna Movie) ను చూడటానికి ఎవరూ ముందుకు రాలేదని సోషల్ మీడియాలో ట్వీట్స్ కనిపిస్తున్నాయి. విష్ణు మంచును ట్రోల్ చేయాలని కొందరు ఎప్పుడూ కాచుకుని కూర్చుంటున్నారు. కలెక్షన్స్ చూసి వాళ్ళు హద్దులు మీరి పోస్టులు చేస్తున్నారు.
అమెరికాలో 15 మంది చూశారు!
Ginna USA Collections : సాధారణంగా అమెరికాలో గురువారం రాత్రి ప్రీమియర్ షోలు వేస్తారు. 'జిన్నా'కు ఆ విధంగా చేయలేదు. అక్కడ కూడా శుక్రవారం సినిమా విడుదల చేశారు. ఉదయం పదిన్నర గంటలకు 'జిన్నా' కలెక్షన్స్ 150 డాలర్స్ అని ట్రేడ్ వర్గాల టాక్. కొంత మంది 181 డాలర్స్ అని చెబుతున్నారు. 'జిన్నా'కు కేవలం 13 మంది మాత్రమే వెళ్లారని కొందరు, 15 మంది వెళ్లారని మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఇది.
అమెరికాలో 'జిన్నా' ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసిందని, అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని ట్వీట్స్ పడుతున్నాయి. విష్ణును ట్రోల్ చేయడానికి ఎప్పుడు ముందుండే కొందరు ఇప్పుడు మరింత వెటకారంగా ట్వీట్స్ చేస్తున్నారు. ''కనీసం మనం సినిమా తీసినా... మన ఫ్రెండ్స్ ఒక ఇరవై మంది అయినా చూస్తారు కదా! విష్ణు మంచు... ఇది మీ రేంజ్'' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ''హిట్ కొట్టేశాం అన్నా, తప్పకుండా 'సన్ ఆఫ్ ఇండియా' కలెక్షన్స్‌ను 'జిన్నా' క్రాస్ చేస్తుంది'' అని మరొకరు ట్వీట్ చేశారు. 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాపై వచ్చిన ట్రోల్స్ అన్నీ ఇన్నీ కాదు. ఆ సినిమాతో 'జిన్నా'ను కంపేర్ చేయడం అంటే వెటకారమే.
#Ginna 150$ (15 tickets) USA collection.
— Diviz (@diviznaidu) October 21, 2022
కనీసం మనం సినిమా తీసినా మన ఫ్రెండ్స్ ఒక 20 మంది అయినా చూస్తారు కదా.. @iVishnuManchu ఇది సర్ మీ రేంజ్..
Blockbuster kottesam anna.. Definitely Son of India Collections cross chesthadhi 😎#Ginna https://t.co/5ygNjFMNNU
— Vikrant (@Vikrant18877) October 21, 2022
Manchu Vishnu's #GINNA shatters All-Time records in USA 🇺🇸
— Jai (@Rowdyism8) October 21, 2022
Today ( Friday ) is it's First day here
Collection so far is $150 ( ~ 15 tickets )
సినిమా విడుదలైన కొన్ని గంటలకు 'యూనానిమస్ బ్లాక్ బస్టర్' అని 'జిన్నా' యూనిట్ పోస్టర్ విడుదల చేసింది. వాస్తవం చెప్పాలంటే... సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. అన్ని వర్గాల వారికీ నచ్చలేదు. కానీ, కొంత మందికి సినిమా నచ్చుతోంది. శుక్రవారం సాయంత్రం 'జిన్నా' చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సంతోషాన్ని వ్యక్తం చేసింది.
Also Read : 'ప్రిన్స్' రివ్యూ : శివకార్తికేయన్, 'జాతి రత్నాలు' దర్శకుడి సినిమా ఎలా ఉందంటే?
కలెక్షన్ కింగ్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. మోహన్ బాబు ఆశీసులతో... ఆయన నిర్మాణంలో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై 'జిన్నా' సినిమా రూపొందింది. దీనికి మోహన్ బాబు స్క్రీన్ ప్లే రాశారు. ఈ చిత్రానికి అసలు కథ... దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి అందిస్తే, కోన వెంకట్ స్క్రిప్ట్ రాశారు. మోహన్ బాబు స్క్రీన్ ప్లే అందించారు. 'జిన్నా' టైటిల్ కార్డ్స్‌లో ''స్క్రీన్ ప్లే, నిర్మాత - మోహన్ బాబు'' అని వేశారు. అదీ సంగతి!
స్వాతి పాత్రలో పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), రేణుకగా సన్నీ లియోన్ (Sunny Leone) నటించిన ఈ సినిమాలో అన్నపూర్ణమ్మ, రఘు బాబు, సీనియర్ నరేష్, సునీల్, 'వెన్నెల' కిశోర్, చమ్మక్ చంద్ర, సద్దాం తదితరులు ఇతర తారాగణం. ఈ సినిమాతో తన కుమార్తెలు అరియానా - వివియానాను సింగర్స్‌గా పరిచయం చేశారు విష్ణు మంచు. కోన వెంకట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ చిత్రానికి ఈషాన్ సూర్య దర్శకత్వం వహించారు. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం అందించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.