Vinayaka Chavithi 2025 : సినీ సెలబ్రెటీల ఇళ్లలో గణపతి పూజల సందడి, భక్తిశ్రద్ధలతో గణపతి బప్పాకు స్వాగతం పలికిన నటులు!
Ganesh Chaturthi 2025: సినీ సెలబ్రెటీల ఇంట్లో గణపతి పూజల సందడి. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Vinayaka Chavithi 2025 Wishes: గణేష్ చతుర్థి పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. బాలీవుడ్ తారలు కూడా గణేష్ ఉత్సవ్ సందడిలో మునిగిపోయారు. భక్తి శ్రద్ధలతో గణపయ్యకు స్వాగతం పలుకుతున్నారు. జ్ఞానం, సంపద కొత్త ప్రారంభానికి దేవుడైన వినాయకుడిని పూజించే ఈ ఉత్సవంలో, భక్తులు మండపాలను అలంకరిస్తారు , డ్రమ్స్, సంగీతాలతో సాంప్రదాయ ఆచారాలతో ఇళ్లలోకి..మండపాల్లోకి ఘనంగా స్వాగతం పలుకుతారు. ప్రతిష్టించినన్ని రోజులు మంత్రాలు, హారతులు, ప్రార్థనలు, లంబోదరుడికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తారు. తొమ్మది రోజులు లేదా పదకొండు రోజుల పాటు జరిగే ఉత్సవాలను ఘనంగా ప్రారంభిస్తారు. ఈసారి బాలీవుడ్ నటుడు సోనూ సూద్ నుంచి హాస్య నటుడు భారతి సింగ్, టీవీ నటి అంకిత లోఖండే వరకు తమ ఇళ్లలో పార్వతీ తనయుడికి స్వాగతం పలికారు.
లంబోదరుడిని ఇంటికి తీసుకువచ్చిన సోనూ సూద్
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తన ఇంట్లో గణపతి బప్పాకు స్వాగతం పలకడం ద్వారా ఉత్సవాన్ని ప్రారంభించాడు. సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు. గణపతి విగ్రహాన్ని తన కారులో ఉంచుకుని, హారతి ఇస్తూ కనిపించాడు
View this post on Instagram
భారతి , హర్ష్ కూడా గణపతి బప్పాను ఇంటికి తీసుకువచ్చారు
హాస్య నటి భారతి సింగ్ ఆమె భర్త హర్ష్ లింబాచియా కూడా ఆగస్టు 27న గణపయ్యకు స్వాగతం పలికారు. హర్ష్ , భారతి తమ కుమారుడు గోలాతో కలిసి గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకువస్తున్న వీడియో పోస్ట్ చేశారు. ఇల్లంతా భక్తి ఆనందంతో నిండిపోయింది. పర్యావరణం పట్ల అవగాహన కల్పిస్తూ, భారతి హర్ష్ ప్రతి సంవత్సరం బయోడిగ్రేడబుల్ మట్టి విగ్రహాలను ఎంచుకుంటారు. భారతి సింగ్ మరియు ఆమె భర్త హర్ష్ తరచుగా సోషల్ మీడియాలో తమ వేడుకలకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తారు.
View this post on Instagram
అంకిత లోఖండే కూడా బప్పాకు స్వాగతం పలికింది
సోనూ సూద్, భారతి సింగ్ హర్ష్ లింబాచియా మాత్రమే కాకుండా, అంకిత లోఖండే కూడా తన తల్లితో కలిసి బప్పాకు స్వాగతం పలుకుతూ కనిపించింది. వైరల్ అవుతున్న వీడియోలో.. గణపతి విగ్రహానికి తిలకం దిద్దింది..ఆ తరువాత ఆమె పూజలు చేస్తూ కనిపిస్తుంది.
View this post on Instagram
వినాయక చవితి పూజా విధానం - పసుపు గణపతి పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
పసుపు గణపతి పూజ తర్వాత మీరు తీసుకొచ్చిన గణేష్ విగ్రహానికి పూజ చేసే విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
వినాయక చవితి రోజు చదవాల్సిన కథలు సంస్కృతంలో కాకుండా మీకు అర్థమయ్యేలా చదువుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి






















