Gunde Ninda Gudi Gantalu August 27th Episode: మీనాతో రోహిణి పందెం! బాలు గెలిపిస్తాడా, బుక్ చేస్తాడా! వినాయక చవితి ట్విస్ట్ - గుండెనిండా గుడిగంటలు ఆగష్టు 27 ఎపిసోడ్!
Gundeninda GudiGantalu Today episode: సంజయ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది మీనా..మరోవైపు రోహిణి బెట్ కట్టింది.. ఈసారి బాలు గెలుస్తాడా ఓడిపోతాడా? ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుండెనిండా గుడిగంటలు ఆగష్టు 27 ఎపిసోడ్ (Gunde Ninda Gudi Gantalu August 27 Episode)
మొత్తం సంజయ్ చేయాడని తెలుసుకున్న మీనా నేరుగా వాళ్లింటికి వెళుతుంది. అప్పటికే మౌనిక..బాలు బయటపడిన వీడియో చూపించడం సెటైర్స్ వేయడంతో సంజయ్ ఫైర్ అవుతాడు. కొట్టేందుకు చేయెత్తగానే మీనా వచ్చి పట్టుకుని.. లాగిపెట్టి కొడుతుంది. ఏయ్ అని లేచేలోగా ఎయ్ అని రివర్స్ లో అరిచి..నా భర్తను ఇరికించింది, కారు సీజ్ చేయించింది నువ్వే అని నాకు తెలుసు.. నా ఆడపడుచు సౌభాగ్యాన్ని ఒక్క క్షణం పక్కనపెడితే నీ రక్తం కళ్లచూసేదాన్ని అని విశ్వరూపం చూపిస్తుంది. అప్పటివరకూ మీనాను సైలెంట్ గా చూసిన సంజయ్.. శివంగిలా విరుచుకుపడడం చూసి షాక్ లో ఉండిపోతాడు. మరోసారి ఇలాంటి పిచ్చిపిచ్చి పనులు చేస్తే లెక్క వేరేలా ఉంటుందని వార్నింగ్ ఇస్తుంది. ఈ విషయం ఇంకాబాలుకి చెప్పలేదు..చెప్తే ఎలా ఉంటుందో తెలుసా అని ఇచ్చిపడేస్తుంది. మీనా వెళ్లిన తర్వాత సంజయ్ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
మనోజ్ రోహిణి సెకెండ్స్ ల కారు కొని ఇంటికి తీసుకొస్తారు. ప్రభావతి నానా హంగామా చేస్తుంది. నువ్వేమీ పూలమ్ముకునే దానివి కాదుకదా సెకెండ్స్ లో కారు కొనాల్సిన అవసరం ఏంటి అంటుంది. బిజినెస్ లో లాభాలు వచ్చిన తర్వాత మార్కెట్లో ఏద కొత్త కారు అయితే అదే కొంటాం అత్తయ్య అంటుంది రోహిణి. అందరూ సెల్ఫీలు దిగుతారు.
మనోజ్ కారు కొన్న సందర్భంగా ముగ్గురు బ్రదర్స్ మందుపార్టీ పెట్టుకుంటారు. మనోజ్, రవి తాగుతుంటారు. అరేయ్ నువ్వు ఏం బిజినెస్ చేస్తావని అడుగుతాడు రవి.. నేను తిరగకుండా ఓచోట కూర్చోవాలి కానీ డబ్బులు మాత్రం రావాలి అంటాడు మనోజ్. అంటే గుడి ముందు కూర్చుని అడుక్కోవాలని సెటైర్ వేస్తాడు బాలు. రవి బాలు నవ్వుకుంటారు. నీకోసం కూడా ఓ బీర్ ఉంచాను వెళ్లి తెచ్చుకో అంటాడు మనోజ్. రెండు బీర్లు కావాలిరా అంటాడు బాలు..
మేడపైన ముగ్గురు బ్రదర్స్ మందుతో మీటింగ్ పెడితే.. ఇంట్లో ముగ్గురు తోడికోడళ్లు మీటింగ్ పెడతారు. మీనా పువ్వులు కడుతుంటుంది.. రోహిణి, శ్రుతి అక్కడే కూర్చుని చూస్తుంటారు. ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తారని శ్రుతి అడిగితే.. మనోజ్ కి మనీ మ్యానేజ్మెంట్ బాగా వచ్చు అంటుంది రోహిణి..అవును రోజూ వింటున్నాం కదా అంకుల్ నుంచి 40లక్షలు తీసుకెళ్లి గాళ్ ఫ్రెండ్ కి ఇచ్చాడని అని సెటైర్ వేస్తుంది శ్రుతి. మీరు కూడా బాలులా తయారయ్యారేంటి అంటుంది రోహిణి. పైన ఏం చేస్తున్నారు ముగ్గురూ అని మాట్లాడుతుంటారు. ఒక్క బీర్ మాత్రమే తాగమని రవికి చెప్పానంటుంది శ్రుతి. బాలుకి ఎవరి పర్మిషన్ అవసరం లేదని అక్కసు వెళ్లగక్కుతుంది. ఏంటి పైనుంచి పెద్ద పెద్ద సౌండ్స్ వినిపిస్తున్నాయ్ అంటుంది శ్రుతి. ఇంకేముందు బాలు బాగా తాగేసి ఏవేవో విరగ్గొడుతున్నాడేమో అని అక్కసు వెళ్లగక్కుతుంది రోహిణి. ఆయన తాగను అని నాతో చెప్పారు అంటుంది మీనా.. అంత సీన్ లేదు ముందు తాగేది బాలునే అంటుంది రోహిణి. బెట్ వేసుకుందామా అని ముగ్గురూ చూద్దామని మేడపైకి వెళతారు..
వినాయక చవితి పూజా విధానం - పసుపు గణపతి పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
పసుపు గణపతి పూజ తర్వాత మీరు తీసుకొచ్చిన గణేష్ విగ్రహానికి పూజ చేసే విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
వినాయక చవితి రోజు చదవాల్సిన కథలు సంస్కృతంలో కాకుండా మీకు అర్థమయ్యేలా చదువుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి






















