Pushpa: ఏయ్ బిడ్డా... ఇది అల్లు అర్జున్ అడ్డా! నాలుగో పాటకు రెడీనా?
'పుష్ప' చిత్రం నుంచి మరో పాటను ప్రేక్షకులకు వినిపించడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 19న సినిమాలో నాలుగో పాట 'ఏయ్ బిడ్డా... ఇది నా అడ్డా'ను విడుదల చేయనున్నారు.
'ఏయ్ బిడ్డా.... ఇది నా అడ్డా' అని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటున్నారు. ఆయన అసలు ఏమాత్రం తగ్గడం లేదు. అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప: ద రైజ్'. ఆల్రెడీ ఇందులో మూడు పాటలను విడుదల చేశారు. నాలుగో పాట 'ఏయ్ బిడ్డా... ఇది నా అడ్డా'ను ఈ నెల 19న విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. ఈ సందర్భంగా సోఫాలో రాయల్ గా కూర్చున్న అల్లు అర్జున్ స్టిల్ విడుదల చేశారు. ఐకాన్ స్టార్ అభిమానులకు అది మాంచి కిక్ ఇచ్చేలా ఉంది.
Witness the MASS swag of #PushpaRaj 😎#PushpaFourthSingle on 19th NOV 💥💥#EyyBiddaIdhiNaaAdda #EyyBetaIdhuEnPatta #EyyPodaIthuNjaanaada #EyyMagaIdhuNanJaaga #EyyBiddaYeMeraAdda#PushpaTheRise #PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic pic.twitter.com/wdhPkqJqUo
— Mythri Movie Makers (@MythriOfficial) November 14, 2021
తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాటను విడుదల చేయనున్నారు. దర్శకుడు సుకుమార్ సినిమా అంటే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపల్సరీ. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ప్రతి సినిమా మ్యూజికల్ హిట్. సుకుమార్ నిర్మించిన సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలు కూడా హిట్టే. అలాగే, అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ కూడా మ్యూజికల్ హిట్. ఆల్రెడీ 'పుష్ప: ద రైజ్' నుంచి విడుదలైన మూడు పాటలను ఆడియన్స్, ఫ్యాన్స్ హమ్ చేస్తున్నారు. నాలుగో పాట 'ఏయ్ బిడ్డా... ఇది నా అడ్డా' ఎలా ఉంటుందో చూడాలి.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. హీరో డాన్ గా అవతరించిన తర్వాత వచ్చే పాటగా 'ఏయ్ బిడ్డా... ఇది నా అడ్డా' ఉండబోతుందని సమాచారం. రష్మికా మందన్న కథానాయికగా, మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్, కమెడియన్ కమ్ హీరో సునీల్ ప్రతినాయకులుగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల కానుంది.
Aslo Read: పునీత్ రాజ్ కుమార్ కళ్లతో... మరో పది మందికి చూపు!
Also Read: ఈ వారం కాజల్ సేఫ్.. పాపం అతడు ఎలిమినేట్ అవ్వక తప్పడం లేదు..
Also Read: కేటీఆర్ సార్.. ఈ పాపను ఆదుకోండి, కదిలిస్తోన్న బండ్ల గణేష్ ట్వీట్
Also Read: బాలకృష్ణ కాపాడిన ప్రాణం.. ఆ చిన్నారిని బాలయ్య ముందుకు తీసుకొచ్చిన నాని
Also Read: జనవరిలో మహేష్ బాబు రావడం లేదు. కానీ, ఆయన మేనల్లుడు వస్తున్నాడోచ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి