Mark Antony: 'మార్క్ ఆంటోనీ'గా విశాల్ - ఫస్ట్ లుక్ అదిరిపోలా!
ర్సటైల్ యాక్టర్ విశాల్ బర్త్ డే సందర్బంగా 'మార్క్ ఆంటోని' ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్.
వర్సటైల్ యాక్టర్ విశాల్ హీరోగా సరికొత్త గెటప్ లో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న 33వ చిత్రం 'మార్క్ ఆంటోనీ'. మినీ స్టూడియోస్ పతాకంపై రీతు వర్మ, సునీల్ వర్మ, అభినయ, YGee మహేంద్రన్, నిజగల్ రవి, కింగ్స్లీ నటీ నటులుగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది.
దర్శకుడు ఎస్ జే సూర్య ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్సటైల్ యాక్టర్ విశాల్ బర్త్ డే సందర్బంగా 'మార్క్ ఆంటోని' ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్.
'మార్క్ ఆంటోనీ' ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే హీరో విశాల్ చాలా రౌద్రంగా షాట్ గన్ పట్టుకుని యుద్ధరంగంలో షూట్ చేస్తున్నటువంటి సరికొత్త గెటప్ లో పవర్ ఫుల్ పాత్రలో ఉన్నట్టు కనిపిస్తోంది.
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : మినీ స్టూడియోస్
నిర్మాతలు : ఎస్ వినోద్ కుమార్ -మినీ స్టూడియోస్ రచయిత & దర్శకుడు - అధిక్ రవిచంద్రన్
సంగీతం - జివి ప్రకాష్ కుమార్
డి ఓ పి - అభినందన్ రామానుజం
ఆర్ట్ డైరెక్టర్ -ఆర్ విజయ్ మురుగన్
ఎడిటర్ - విజయ్ వేలుకుట్టి
యాక్షన్ డైరెక్టర్స్ - దిలీప్ సుబ్బరాయన్, పీటర్ హెయిన్, కనల్ కన్నన్, రవివర్మ
కాస్ట్యూమ్ డిజైనర్-సత్య NJ
కొరియోగ్రాఫర్లు - దినేష్, బాబా బాస్కర్, అజహర్
గీత రచయితలు- మధుర కవి, అసల్ కొలారు, అధిక్ రవిచంద్రన్
పబ్లిసిటీ డిజైన్స్ -కబిలన్
Welcome to the world of #MarkAntony, GB pic.twitter.com/qOF8j2GtTm
— Vishal (@VishalKOfficial) August 29, 2022
'లాఠీ'తో అలరించనున్న విశాల్:
విశాల్ ప్రధాన పాత్రలో ఎ. వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమా 'లాఠీ'. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విశాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. సునయన హీరోయిన్ గా నటిస్తోంది. ముందుగా ఆగస్టు 12న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడు సెప్టెంబర్ 15కి వాయిదా వేశారు.
అన్ని భాషల్లో ఈ సినిమాను ఒకే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రమణ, నంద కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. విశాల్ చివరిగా 'సామాన్యుడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కనీసం 'లాఠీ' సినిమాతోనైనా సక్సెస్ అందుకుంటారేమో చూడాలి!
Also Read : ‘ఆంటీ’ ట్రోల్స్‌పై అనసూయ ఆగ్రహం, రౌడీ బాయ్ అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్
Also Read : విజయ్ దేవరకొండ కాదు, అనకొండ - రౌడీ బాయ్ ప్రవర్తనపై ముంబై థియేటర్ ఓనర్ ఫైర్