Fatima Sana Shaikh: హైదరాబాద్‌లో చాలా చిన్న నిర్మాతలు కూడా అన్నీ చేయాలంటారు - టాలీవుడ్‌పై ఫాతిమా సనాషేక్ ఆరోపణలు
Tollywood: దక్షిణాది చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఎక్కువ అని దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్ ఓ ఇంటర్యూలో చెప్పారు. ఆమె ప్రత్యేకంగా హైదరాబాద్ గురించే ప్రస్తావించారు.

Fatima Sana Shaikh exposes the South Indian industry casting couch : దక్షిణాది చిత్ర పరిశ్రమపై .. బాలీవుడ్ నుంచి బాంబులు వేస్తూనే ఉన్నారు. గతంలో పలువురు తారామణులు దక్షిణాదిలో అవకాశాలు దక్కించుకుని భారీ సక్సెసులు చూసి.. రిటైర్మెంట్ స్టేజ్‌లో దక్షిణాదిపై విమర్శలు చేసేవారు. అక్కడ వేధింపులకు గురయ్యామని చెబుతూ ఉంటారు. అయితే ఉత్తరాదిలో అవి ఉండవా అంటే.. అక్కడ జరుగుతున్న వాటిపై సామాన్యంగా మాట్లాడరు. తాజాగా అమీర్ ఖాన్ దంగల్ సినిమాలో నటించిన ఫాతిమా సనా షేక్ కూడా దక్షిణాదిలో కాస్టింగ్ కౌచ్ ఎక్కువ అని ఆరోపణలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆమె ప్రస్తావించారు.
హైదరాబాద్‌లో ఉండే చాలా చిన్న నిర్మాతలు కూడా అవకాశం ఇస్తే అన్నింటికీ సిద్ధపడతారా అని ఓపెన్ గా అడుగుతారని మండిపడ్డారు. ఇలా ఓ సినిమా అడిషన్ కు సంబంధించి తనతో మాట్లాడారని.. అన్నింటికీ సిద్ధపడాలని పదే పదే చెప్పారని అన్నారు. అయితే తాను ఒప్పుకున్న రోల్ కు సంబంధించి ఎంత కష్టమైనా పడతానని చెప్పానని ఆమె ఆ ఇంటర్యూలో చెప్పారు. అయితే వారు నేరుగా తమ కు కావాల్సింది అడుగుతారని.. తాను సైలెంట్ గా ఉంటానని చెబుతారు. ఎందుకంటే వారు ఎంత మూర్ఖులో తెలుసుకోవడానికి చెప్పేవన్నీ వింటానన్నారు.
ఫాతిమా సనాషేక్ చైల్డ్ ఆర్టిస్టు నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే తాను హిందీ కంటే ఎక్కువగా దక్షిణాది భాషల్లో కాస్టింగ్ కౌచ్ కు గురయ్యానని అంటున్నారు. అయితే ఇప్పటి వరకూ దక్షిణాది భాషల్లో నటించలేదు.
SHOCKING: Dangal actress Fatima Sana Shaikh says many producers from Hyderabad asked her to sleep🛌 with them for a role in film. pic.twitter.com/PAnO4jSF9u
— Manobala Vijayabalan (@ManobalaV) January 31, 2025
కాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క సినీ పరిశ్రమలో మాత్రమే ఉన్నట్లుగా చెబుతూంటారని.. అన్ని చోట్లా ఉంటుందని కొంత మంది నటీమణులు చెబుతూంటారు. స్ట్రిక్ట్ గా ఉంటే.. అందరూ అలాగే ఉంటారని.. అవకాశాల కోసం దిగజారితే వారు కూడా అలాగే ప్రవస్తారని అంటారు. అయితే ఉత్తరాది నటీమణులు మాత్రం ఎక్కువగా సౌత్ ను నిందిస్తూండటం మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది
They are really having a hard time in finding an A-list actress for the film! 🥲
— The King 🦁 (@Thekingg077) February 7, 2025
Anyway good for #FatimaSanaSheikh if things finalises! She has also worked with Basu da before in Ludo (2020) #KartikAaryan #AnuragBasu pic.twitter.com/IQ7xOCMwn9
ఫాతిమా ప్రతిభావంతురాలైన నటిగా గుర్తింపు పొందారు. అయితే ఆమె విమర్శలనుపెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఆ నిర్మాతలెవరో ఆమె బయ ట పెట్టి ఉంటే హాట్ టాపిక్ అయి ఉండేది.
Also Read: గౌతమ్ అదానీ ఇంట మెగిన పెళ్లిబాజాలు, ఇంటివాడైన జీత్ అదానీ- ఏకంగా రూ.10,000 కోట్ల విరాళం





















