By: ABP Desam | Updated at : 10 Feb 2023 11:05 PM (IST)
ఫాస్ట్ ఎక్స్‌లో విన్ డీజిల్ (Image Credits: Vin Diesel Trailer)
హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్’కు ఒక ప్రత్యేకత ఉంది. నమ్మశక్యం కాని యాక్షన్ సీక్వెన్స్‌లను నమ్మించేలా కన్విన్సింగ్‌గా తీయడంలో ఈ చిత్ర బృందం 100 శాతం సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఇందులో పదో భాగం విడుదలకు సిద్ధం అయింది. దీని ట్రైలర్‌ను నిర్మాతలు విడుదల చేశారు.
ఎప్పటిలానే ఇందులో కూడా కార్లు గాల్లోకి లేచిపోవడం, ఒక కారుతో రెండు హెలికాఫ్టర్లను లాగి పారేయడం లాంటి నమ్మశక్యం కాని స్టంట్స్‌ను తీయడానికి ప్రయత్నించారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఆరు భాగాల వరకు ఫ్రెష్ విలన్స్‌ను రంగంలోకి తీసుకు వచ్చేవారు. కానీ ఏడో భాగంలో జాసన్ స్టాటమ్ రివెంజ్ ఫార్ములా సక్సెస్ కావడంతో అక్కడి నుంచి ప్రతి భాగాన్ని అదే ఫార్మాట్‌లో తీస్తున్నారు. ఇది ఫ్యాన్స్‌కు రుచించడం లేదు. కానీ పదో భాగం కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యారు.
ఈ సినిమాలో విలన్‌గా ఆక్వామ్యాన్ ఫేమ్ జేసన్ మోమోవా కనిపించనున్నాడు. అలాగే కెప్టెన్ మార్వెల్ పాత్రలో కనిపించిన బ్రీ లార్సెన్ కూడా ఇందులో భాగం కానుంది. ఏడో భాగం షూటింగ్ తర్వాత యాక్సిడెంట్ కారణంగా చనిపోయిన పాల్ వాకర్‌ను కూడా ఈ సినిమాలో చూపించారు.
విన్ డీజిల్, మిషెల్ రోడ్రిగ్జ్, టైరీస్ గిబ్సన్, క్రిస్ బ్రిడ్జెస్, జేసన్ మోమోవా, నథానీ ఇమ్మాన్యుయెల్, జోర్డానా బ్రూస్టర్, జాన్ సేనా, జాసన్ స్టాటమ్, సుంగ్ కాంగ్, అలన్ రిచ్‌సన్, డేనియలా మెల్‌కోయిర్, స్కాట్ ఈస్ట్‌వుడ్, హెలెన్ మిర్రెన్, చార్లీజ్ థెరాన్, బ్రీ లార్సెన్, గాల్ గాడోట్ ఇందులో నటించనున్నారు.
ఈ సినిమా మే 19వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. మరొక్క భాగంతో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్‌ను ముగించనున్నారు. 11వ భాగాన్ని మరింత పెద్దదిగా మార్చనున్నారు. ఐరన్ మ్యాన్ పాత్రలో కనిపించిన రాబర్ట్ డౌనీ జూనియర్ ఈ సినిమాలో ప్రధాన విలన్ పాత్రలో కనిపించనున్నాడని విన్ డీజిల్ ప్రకటించాడు. తనతో పాటు బోర్న్ సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్న మాట్ డామన్ కూడా ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. రోమ్, రియో డి జనీరో, వాషింగ్టన్ డీసీ, హవానా, అకాబా, చైనా టౌన్‌ల్లో ఈ సినిమాను షూట్ చేశారు.
Baby Movie: ‘బేబీ’ నిర్మాత సంతోషం - దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్, భలే బాగుంది.. మీరూ చూడండి
Bigg Boss Season 7 Telugu: ప్రశాంత్‌పై రతిక దారుణమైన కామెంట్స్ - ‘పవర్ అస్త్ర’తో సమాధానం చెప్పిన రైతుబిడ్డ, ‘అక్క’కు ఇక దబిడి దిబిడే!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్స్ - డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు, ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఔట్?
Vijay Antony: పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
/body>