News
News
X

Ennenno Janmalabandham November 3rd: మల్లెపూలు చూసి మురిసిన వేద- యష్ ని ఇరకాటంలో పెట్టిన ఆదిత్య

మాళవిక వేదని తప్పించడం కోసం యష్ జీవితంలోకి మళ్ళీ వస్తుంది. సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
 
ఖుషికి వేద అన్నం తినిపిస్తూ ఉంటుంది. రోజు స్కూల్ కి వెళ్ళి బోర్ కొడుతుంది ఎక్కడికైనా పిక్నిక్ కి వెళ్దామా అని ఖుషి అడుగుతుంది. వేద సరే అంటుంది. మీ దాడి వచ్చాక నేను మాట్లాడతాను ఖుషి పిక్నిక్ అంటే డాడీ వద్దని అంటారా అని చెప్తుంది. ఈ పిక్నిక్ ఐడియా ఏదో బాగుందే, ఈ మధ్య బాగా టెన్షన్ గా కనిపిస్తున్నారు. కాసేపు ఆయన మాజీ భార్యకి సెలవు ఇవ్వండి శ్రీవారు ఇక్కడ ఇంట్లో తమరి ముద్దుల కూతురు, ఖుషికి అమ్మ కూడా ఉంది. మమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టేస్తారా, మీరు కుదరదు అన్నాసరే ముక్కుపిండి అయినా తీసుకుని వెళ్తాం. అయినా ఈ పిక్నిక్ మా కంటే మీకే ఎక్కువ అవసరం అని అనుకుంటుంది.

యష్ మల్లెపూలు తీసుకుని ఇంటికి వస్తాడు. ఖుషి నవ్వుతూ పలకరిస్తుంది. వేద కూడా ముసిముసిగా నవ్వుతూ ఉంటుంది. అది చూసి ఇదేంటి రుసరుసలాడుతుంది అనుకుంటే ముసి ముసి నవ్వులు నవ్వుతుంది ఏంటి అని బిత్తరపోతాడు. మాళవిక గురించి ఆలోచిస్తూ భయపడతాడు ఆదిత్య. మనం ఎక్కడికైనా వెళ్దామా అని ఆదిత్య అడుగుతాడు. నేను నీ దగ్గరే ఉన్నా కావాలంటే ఫ్రెష్ అవడానికి పిక్నిక్ కి వెళ్దాం నువ్వు, ఖుషి, నాన్న, నేను అని చెప్తుంది. మీ అందరితో సంతోషంగా ఉండాలని ఉంది కానీ అది జరగదేమో అని అంటుంటే ఎందుకు జరగదు నాన్నతో నేను మాట్లాడతాను అని ఆదిత్య చెప్తాడు.

Also read: దేవి ప్లాన్ అదుర్స్, అడ్డంగా బుక్కైన రుక్మిణి- ఆదిత్యే తన తండ్రి అని తెలిసిపోతుందా?

అటు ఖుషి యష్ ని పిక్నిక్ కి వెళ్దామని అడుగుతుంది. సరే వెళ్దాం అని ఒప్పుకుంటాడు. అప్పుడే ఆదిత్య యష్ కి ఫోన్ చేస్తాడు. నాకు మీతో ఎక్కడికైనా ఔటింగ్ కి వెళ్లాలని ఉంది తీసుకుని వెళ్తారా అని అడుగుతాడు. ఆ మాటకి యష్ చాలా సంతోషిస్తాడు. మనతో పాటు ఖుషిని కూడా తీసుకుని వస్తారా అని అంటే తీసుకుని వస్తాను అని చెప్తాడు. మీరు నేను ఖుషి మన ముగ్గురితో పాటు మాళవిక అమ్మ కూడా వస్తుందని ఆదిత్య బతిమలాడతాడు. సరే అని ఒప్పుకుంటాడు. మనం మాత్రమే వెళ్దాం మీ వైఫ్ వద్దు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అటు పిక్నిక్ కి వెళ్తున్నాంఅని ఖుషి చాలా సంతోషంగా ఉంటుంది. తను అనుకున్నది జరుగుతున్నందుకు మాళవిక హ్యపీగా ఉంటుంది. నేను కొట్టే ఈ దెబ్బకి ఆ వేద గింగిరాలు తిరుగుతుందని అనుకుంటుంది.

News Reels

మల్లెపూలు తీసుకొచ్చి నా అలక తీరుద్దామని అనుకుంటున్నారా? నా అలక తీరిపోయింది. మీరు మల్లెపూలు తెచ్చినందుకు కాదు మాతో పిక్నిక్ కి తీసుకెళ్తున్నారుగా అందుకు అని వేద వాటిని చూసి మురిసిపోతుంది. అటు యష్ బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడిప్పుడే ఆదిత్య నాకు దగ్గర అవుతున్నాడు. పిక్నిక్ ఐడియా బాగుంది కానీ వేద లేకుండా వెళ్ళడం ఎలా? వేద రావొద్దు అంటే నేను ఒప్పుకునే వాడిని కాదు కానీ అడిగింది నా ఆది అయిపోయాడు ఏం చెయ్యాలి ఆలోచిస్తూ ఉంటాడు.

Also Read: చిచ్చు పెట్టేందుకు వేదని కలిసిన అభిమన్యు- మాళవిక వాళ్ళకి షాకింగ్ విషయం చెప్పిన లాయర్

Published at : 03 Nov 2022 07:39 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham Serial November 3rd Episode

సంబంధిత కథనాలు

Akshay Kumar trolled: ఈ సినిమాను కూడా చెడగొడతావా : అక్షయ్ కుమార్ పై నెటిజన్స్ ఫైర్ ?

Akshay Kumar trolled: ఈ సినిమాను కూడా చెడగొడతావా : అక్షయ్ కుమార్ పై నెటిజన్స్ ఫైర్ ?

కేజీయఫ్ తాత ఇక లేరు - అనారోగ్యంతో కన్నుమూత!

కేజీయఫ్ తాత ఇక లేరు - అనారోగ్యంతో కన్నుమూత!

Bigg Boss 6 Telugu: దెయ్యాల గదిలో ఆదిరెడ్డి, శ్రీహాన్ - వీరు మరీ ఇంత పిరికి వాళ్లా?

Bigg Boss 6 Telugu: దెయ్యాల గదిలో ఆదిరెడ్డి, శ్రీహాన్ - వీరు మరీ ఇంత పిరికి వాళ్లా?

Flop Directors Of Tollywood 2022 : స్టార్ డైరెక్టర్స్ పరువు తీసిన 2022 - ఈ ఏడాది వీళ్ళ స్టార్ బాగోలేదనుకుంట!

Flop Directors Of Tollywood 2022 : స్టార్ డైరెక్టర్స్ పరువు తీసిన 2022 - ఈ ఏడాది వీళ్ళ స్టార్ బాగోలేదనుకుంట!

Enthavaarugaani Teaser : చావు బతుకులతో సైంటిఫిక్ ఆట - 'ఎంతవారు గాని' టీజర్ విడుదల చేసిన అడివి శేష్

Enthavaarugaani Teaser : చావు బతుకులతో సైంటిఫిక్ ఆట - 'ఎంతవారు గాని' టీజర్ విడుదల చేసిన అడివి శేష్

టాప్ స్టోరీస్

Bandi sanjay Drugs Case: బెంగళూరు డ్రగ్స్ కేసు రీ ఓపెన్ చేస్తామని బండి సంజయ్ హెచ్చరికలు ! అసలు ఆ కేసేంటి ? అందులో ఎవరు ఉన్నారు ?

Bandi sanjay Drugs Case: బెంగళూరు డ్రగ్స్ కేసు రీ ఓపెన్ చేస్తామని బండి సంజయ్ హెచ్చరికలు ! అసలు ఆ కేసేంటి ? అందులో ఎవరు ఉన్నారు ?

సీబీఐ కేసుల్లో ఏపీ ప్రజాప్రతినిధులే టాప్- ఏపీలో 10 మందిపై నేరారోపణలు!

సీబీఐ కేసుల్లో ఏపీ ప్రజాప్రతినిధులే టాప్- ఏపీలో 10 మందిపై నేరారోపణలు!

Mandous Cyclone Alert : దూసుకొస్తున్న మాండౌస్‌- శుక్రవారం తీరం రాత్రి తీరం దాటేది ఎక్కడంటే?

Mandous Cyclone Alert : దూసుకొస్తున్న మాండౌస్‌- శుక్రవారం తీరం రాత్రి తీరం దాటేది ఎక్కడంటే?

Rohit Sharma Innings: 'రోహిత్' ది వారియర్- భారత్ మ్యాచ్ ఓడినా అతను మనసులు గెలిచాడు

Rohit Sharma Innings: 'రోహిత్' ది వారియర్- భారత్ మ్యాచ్ ఓడినా అతను మనసులు గెలిచాడు