News
News
X

Ennenno Janmalabandham November 2nd: చిచ్చు పెట్టేందుకు వేదని కలిసిన అభిమన్యు- మాళవిక వాళ్ళకి షాకింగ్ విషయం చెప్పిన లాయర్

మాళవికని కాపాడటానికి చేసే ప్రయత్నంలో యష్ వేదకి దూరం అవుతున్నాడు. దాన్ని తనకి అనుకూలంగా మార్చుకునేందుకు మాళవిక ప్లాన్స్ వేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

వేద యష్ తో గడిపిన క్షణాలు అన్నీ గుర్తు చేసుకుని చాలా బాధపడుతుంది. యష్ ఆఫీసుకి వెళ్తు ఆగుతాడు. వేద నాతో మాట్లాడకపోతే ఏదో వెలితిగా బాధగా ఉందని అనుకుంటాడు. ఏదో విధంగా తనతో మాట్లాడాలని అనుకుని వేద దగ్గరకి వెళతాడు. యష్ వచ్చినా పట్టించుకోకుండా వేద వెళ్లిపోతుంటే తన వెనుకాలే వెళ్ళి మాట్లాడేందుకు చూస్తాడు కానీ తను వెళ్లిపోతూ ఉంటుంది. నీ కారు సర్వీసుకి ఇచ్చావ్ కదా నిన్ను డ్రాప్ చేస్తాను రా వెళ్దాం అని అడుగుతాడు. వద్దని వెళ్ళిపోతుంది. అభిమన్యు వేద హాస్పిటల్ కి వస్తాడు. 

అభి: మిమ్మల్ని చూసి బాధపడాలో జాలి పడాలో అర్థం కావడం లేదు

వేద: మీ టైమ్ వెస్ట్ చేసుకుని నా టైమ్ వెస్ట్ చేయకండి

అభి: మీరు ఇక్కడ పేషెంట్స్ తో బిజీగా ఉన్నారు అక్కడ నీ మొగుడు తన మాజీ భార్యతో చాలా బిజీగా ఉన్నాడు

News Reels

వేద: షటప్ అభిమన్యు.. నా భర్త మీద చాడీలు చెప్పడానికి వచ్చావా, నా భర్త అంటే ఏంటో నాకు తెలుసు, ఆ మాళవిక, మీరంటే ఏంటో కూడా తెలుసు

Also Read: దేవి మీద చెయ్యెత్తిన రుక్మిణి- ఆదిత్యని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్నలు

అభి: యశోధర్ మాళవిక ప్రేమ జంటలా చెట్టాపట్టలేసుకుని తిరుగుతున్నారని తెలుసా

వేద: నా భర్త గురించి నాకు తెలుసు, తప్పులు చేసింది మీరు, మీ  మాటలు వినాల్సిన అవసరం లేదు, నా భర్త మీద గౌరవం తగ్గదు

అభి: నీ మొగుడు నీతో కాపురం చేయడం మానేసి మాజీ పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు.. మొగుడి మీద గుడ్డి నమ్మకం ఉండకూడదు, జాగ్రత్త పడకపోతే మెడలో కట్టిన తాళి ఉంటుంది కానీ భర్త ఉండదు

వేద: పక్క వాళ్ళ జీవితంలోకి తొంగిచూసే అలవాటు మీకు ఉందేమో కానీ నా భర్తకి లేదు

యష్ వాళ్ళు లాయర్ పరమేశ్వరన్ ని కలుస్తారు. యాక్సిడెంట్ కి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకి దొరికిందని చెప్పడంతో యష్, మాళవిక షాక్ అవుతారు. ఇది ఇంత కాంప్లికేట్ అవడానికి కారణం మీ భార్య వేద. తను రోజు రోజు పోలీసులతో మాట్లాడి కేసు గురించి తెలుసుకుంటూ ఉంటుంది. ఎలాగైనా మీరే కాపాడాలి అని యష్ లాయర్ ని అడుగుతాడు. ఒక తప్పు కవర్ చెయ్యడానికి ఎన్ని తప్పులు చేయాల్సి వస్తుందో చూడు, దాపరికం వల్ల నా భార్యకి దూరం అవుతున్నా.. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు అని యష్ అంటాడు. నీకు అన్నింటికన్నీ ముఖ్యం నన్ను, ఆదిత్యని కాపాడటం అది గుర్తు పెట్టుకో అని మాళవిక అంటుంది.

Also read: లాస్యకి వార్నింగ్ ఇచ్చిన నందు- తులసి నుంచి ఇంటిని లాగేసుకునేందుకు అనసూయ స్కెచ్

చేయాల్సిన ఎదవ పని చేసి కూర్చున్నావ్ ఇప్పుడు నేను నా కొడుకు ఆదిత్య ఇరుక్కున్నాం అని యష్ ఫ్రస్టేట్ అవుతాడు. వేద తనకి తాను సర్ది చెప్పుకుంటుంది. ఆదిత్యకి సంబంధించిన విషయం అని చెప్పాడు కదా అలాంటప్పుడు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నా అని అనుకుంటుంది. సరైన సమయంలో మేటర్ మొత్తం నాకు చెప్పేస్తారు అని నమ్మకంగా ఉంటుంది. ఖుషి వచ్చి నాకు తమ్ముడు ఎప్పుడు పుడతాడు అని అడుగుతుంది. ఆ మాటకి ఏం మాట్లాడాలో తెలియక వేద మళ్ళీ బాధపడుతుంది. నీకు తమ్ముడిని ఇచ్చే అదృష్టం నాకు లేదమ్మ, బిడ్డని కనలేని శాపం దేవుడు ఇచ్చాడు అని మనసులో అనుకుంటుంది. వేద అలక ఎలా తీర్చాలా అని యష్ ఆలోచిస్తుంటే అప్పుడే మల్లె పూలు అమ్మే ఆమె వస్తుంది. ఇవి భార్య అలక తీర్చే పూలు అని చెప్పేసరికి వాటిని తన కోసం కొంటాడు.

 

Published at : 02 Nov 2022 07:29 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham Serial November 2nd Episode

సంబంధిత కథనాలు

Prabhas: ప్రభాస్ తో తమిళ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ చర్చలు, భారీ బడ్జెట్ మూవీకి శ్రీకారం!

Prabhas: ప్రభాస్ తో తమిళ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ చర్చలు, భారీ బడ్జెట్ మూవీకి శ్రీకారం!

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

Vikram Gokhale: సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూత, విషాదంలో బాలీవుడ్ !

Vikram Gokhale: సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూత, విషాదంలో బాలీవుడ్ !

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ రాజ్ అవుట్?

టాప్ స్టోరీస్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Batti Vs Revant : రేవంత్ వర్సెస్ భట్టి విక్రమార్క - తెలంగాణ కాంగ్రెస్‌లో పాదయాత్ర చిచ్చు ! కాంగ్రెస్‌ ఇక కోలుకోదా ?

Batti Vs Revant :  రేవంత్ వర్సెస్ భట్టి విక్రమార్క - తెలంగాణ కాంగ్రెస్‌లో పాదయాత్ర చిచ్చు  ! కాంగ్రెస్‌ ఇక కోలుకోదా ?

Aliens: డిసెంబర్‌ నెలలో భూమి మీదకు ఏలియన్స్‌ - గతంలో మహిళ రేప్ ఆరోపణలు!

Aliens: డిసెంబర్‌ నెలలో భూమి మీదకు ఏలియన్స్‌ - గతంలో మహిళ రేప్ ఆరోపణలు!

Sanju Samson Dropped: ఎక్కువ సిక్సర్లు కొట్టినందుకే సంజూపై వేటు! పంతే ముద్దు!

Sanju Samson Dropped: ఎక్కువ సిక్సర్లు కొట్టినందుకే సంజూపై వేటు! పంతే ముద్దు!