Ennenno Janmalabandham June 26th: క్షేమంగా ఇంటికొచ్చిన ఖుషి- నీలాంబరి వార్నింగ్ కి వణికిపోయిన అభి, ఖైలాష్
మాళవికని తీసుకొచ్చి వేద ఇంట్లో పెట్టుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ఖుషిని కాపాడేందుకు వేద రిస్క్ చేస్తుంది. రౌడీలు ఉన్న డెన్ లోకి వచ్చి ఖుషిని తీసుకుని కిందకి వస్తుంది. తనని చూసిన రౌడీలు చుట్టుముట్టి అఘాయిత్యం చేసేందుకు ట్రై చేస్తుంటే వేద ఉగ్రరూపం దాల్చి వాళ్ళని చితక్కోడుతుంది. దీంతో వాళ్ళు పారిపోతారు. ఖుషిని ప్రేమగా కౌగలించుకుని చాలా బాధపడుతుంది. ఇంట్లో ఖుషి కోసం అందరు చాలా బాధపడతారు. ఎక్కడ ఉందో ఎలా ఉందోనని మాళవిక కూడ టెన్షన్ పడుతుంది. చెల్లికి ఏం కాదు ఎవరూ భయపడొద్దని ఆదిత్య ధైర్యం చెప్పేందుకు చూస్తాడు. ఈ పని ఎవరో డబ్బుల కోసమే చేసి ఉంటారని మాళవిక డౌట్ పడుతుంది. తమ ప్లాన్ వర్కౌట్ అయినందుకు అభిమన్యు, ఖైలాష్ హ్యాపీగా మందు కొడుతూ ఉంటారు. ఖుషి తన దగ్గర ఉంటే యష్ బాధపడటం చాలా సంతోషంగా ఉంది. అప్పుడే రౌడీలు ఫోన్ చేసి వాళ్ళ అమ్మ వచ్చి తీసుకెళ్లిపోయిందని చెప్పేసరికి షాక్ అవుతారు. అపరకాళిలా మమ్మల్ని చితక్కోట్టి తీసుకుపోయిందని చెప్తారు.
Also Read: సంతోషంగా గడుపుతున్న కృష్ణ,మురారీ- బ్లాక్ మెయిల్ ఆటకి దిగిన ముకుంద
అభిమన్యు ఫోన్ మాట్లాడటం నీలాంబరి వింటుంది. ఎవరితో మాట్లాడుతున్నావని కోపంగా అడుగుతుంది. అబద్ధం చెప్పి కవర్ చేసేందుకు చూస్తారు. అది నమ్మేసిన నీలాంబరి మాయన బంగారమని కాళ్ళకి దణ్ణం పెట్టేస్తుంది. కానీ ఆ పాప కనిపించకపోవడానికి ఖైలాష్ కి ఏదో సంబంధం ఉందని అనుమానపడుతుంది. యష్ ఇంటికి వచ్చాడంటే నువ్వే ఏదో చేసి ఉంటావాని అంటుంది. ఏదైనా సంబంధం ఉందని తెలిస్తే తినే తిండిలో ఎలుకల మందు పెట్టి చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది. యష్ చేతులు ఊపుకుంటూ దిగులుగా ఇంటికి వస్తాడు. మొత్తం వెతికాము ఎక్కడా కనిపించలేదని బాధపడతాడు. వేద ఇంకా రాలేదా అంటాడు. అప్పుడే వేద ఖుషిని తీసుకుని ఇంటికి వస్తుంది. అందరూ ఖుషిని చూసి చాలా సంతోషిస్తారు. రౌడీల దగ్గర నుంచి కాపాడి తీసుకొచ్చినందుకు మాలిని థాంక్స్ చెప్తుంది.
Also Read: భర్త ప్రేమ చూసి మురిసిపోయిన కావ్య- డాక్టర్ రాకతో స్వప్న గుట్టు రట్టు అవుతుందా?
వేద కాలు కుంటుతూ నడుస్తుంటే యష్ గమనిస్తాడు. వాళ్ళతో జరిగిన గోడవలో చిన్న దెబ్బ తగిలిందని చెప్తుంది. వేద కాలి నొప్పితో బాధపడుతుంటే యష్ వస్తాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటే సరిపోయేది కదా ఎందుకు ప్రాణాలకు తెగించి రౌడీలతో పోరాడి కాపాడావని అడుగుతాడు. ఖుషి తన ప్రాణమని ఎవరో వచ్చి తనని కాపాడతారని ఎదురు చూడలేనని చెప్తుంది. మరి నువ్వు నా ప్రాణం కదా నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఎలా ఉంటానని యష్ వేద కాలికి ఆయిల్ రాసి మసాజ్ చేస్తాడు. కాసేపు వేదని పొగిడేపనిలో ఉంటాడు. వాళ్ళిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటున్న టైమ్ లో మాళవిక వచ్చి తలుపు కొడుతుంది. యష్ కోపంగా ఏం కావాలని అడుగుతాడు. ఖుషి ఎలా ఉందో చూద్దామని తన గదిలోకి వెళ్తే మీరు తీసుకెళ్లారని ఆదిత్య చెప్పాడు అందుకే ఇక్కడికి వచ్చానని చెప్తుంది. ఖుషి గురించి నీకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని యష్ తిడతాడు.