Ennenno Janmalabandham September 29th: ఆవేశపడిన దామోదర్, నచ్చజెప్పిన వేద- అవమానంతో రగిలిపోయిన మాళవిక సూసైడ్
యష్, వేదలు పెద్ద నాటకమే ఆడి వసంత్ మనసులో చిత్ర మీద ఉన్న ప్రేమని బయటపెట్టిస్తారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
వేదకి ఇచ్చిన మాట ప్రకారం యశ వసంత్, చిత్రని ఒక్కటి చేస్తాడు యష్. అది చూసి దామోదర్ కోపంగా అన్న దమ్ముల అనుబంధం చాలా బాగుంది నా పరువు తియ్యడానికి ఇన్ని డ్రామాలు ఆడతారా, మీరంతా కలిసి సంతోషంగా ఉన్నారు కానీ మీరు చేసిన పని వల్ల నా చెల్లి పిచ్చిదానిలా ఏడుస్తుందని అరుస్తాడు. దామోదర్ గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి అని యష్ చెప్పడానికి చూస్తున్న దామోదర్ మాత్రం ఏంటి నువ్వు చెప్పేది అని సీరియస్ గా మాట్లాడతాడు.
మీ ఆవేశాన్ని కోపాన్ని అర్థం చేసుకుంటాను. చిత్ర వసంత్ కోసం ఆయన ఇలా చేశారే తప్ప మీ చెల్లిని మోసం చెయ్యాలని కాదు అని వేద నచ్చజెప్పేందుకు చూస్తుంది. మీరు చిత్రని ఎలా చెల్లి అనుకుంటారో అలా నిధి కూడా నాకు చెల్లె అని వేద అంటే ఒక అక్కగా ఆలోచించి ఉంటే మీరు ఇలా చేస్తారా అని దామోదర్ అంటాడు. ఇప్పుడు జరిగింది తెలిసి సమాజంలో నా పరువు ఏం కావాలి అని ఆవేశంగా అంటాడు. నరం లేని సమాజం ఏదో ఒకటి మాట్లాడుతుంది. దాన్ని పట్టించుకుంటే జీవితం ఎలా బాగుంటుంది. ఒకప్పుడు ప్రేమ, పెళ్లి గురించి చాలా అదర్శవంతంగా మాట్లాడిన మీరే ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు. నన్ను, యశోధర్ ని కలిపిన మీరే ఇలా మాట్లాడుతుంటే నమ్మలేకపోతున్నా. మీలా ఆవేశపడకుండా యష్ నిధి భవిష్యత్ గురించి ఆలోచించి వసంత్ ని బలవంతపెట్టలేక ఇలా తన మనసులో మాట అందరి ముందు బయటపడేలా చేశారు. డానికి శిక్ష మాకు వెయ్యండి అంతే తప్ప నిధి జీవితం నాశనం అయ్యే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అని వేద చెప్తుంది.
Also Read: కార్తీకదీపం నాటకంతో సీరియల్ మరో మలుపు, కార్తీక్ భార్య మోనిత కాదని ఫిక్సైపోయిన శివ!
ప్రేమ లేని పెళ్ళికి అర్థం లేదు పెళ్లి చేస్తే మన కళ్ళకి జంటగా కనిపిస్తుంది కానీ వాళ్ళ మధ్య ఒంటరితనమే ఉంటుంది. భార్యాభర్తలని కలిపేది తాళి శాస్త్రోక్తంగా చేసేడి పెళ్లి కాదు అని వేద చాలా చక్కగా చెప్తుంది. ఆవేశం ఆలోచన లేకుండా మనుషులని కూడా దూరం చేస్తుంది, పంతం కన్నా ప్రేమే ముఖ్యమని అర్థం అయ్యింది నా చెల్లెలు మీ ఇంటి కోడలు అవుతుందన్న సంతోషం ఆవిరి అవుతుందని తెలిసి ఆవేశంగా మాట్లాడాను సోరి యశోధర్ ఆవేశంలో నోరు జారాను అని దామోదర్ అంటాడు. ఇంకెందుకు ఆలస్యం మీరు అనుకున్నట్టుగానే చిత్ర, వసంత్ నిశ్చితార్థం జరిపించమని దామోదర్ కూడా చెప్తాడు.
అటు వసంత్ కూడా నిధికి నచ్చజెపుతాడు. అందరూ కలిసి సనతోషంగా వసంత్, చిత్రల ఎంగేజ్మెంట్ చేస్తారు. మాళవికకి ఐసీయూలో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. జరిగింది చూపిస్తారు. యష్ ఫంక్షన్లో అవమానించడం అంతా గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంది. ఎంత ధైర్యం నీకు అంతమందిలో నన్ను అవమానిస్తావా, అందరిలో ఎంత పరువు పొగుట్టుకున్నా అది ఆ వేద ముందు అని మాళవిక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య అక్కడకి వస్తాడు. అమ్మా ఏమైంది ఎదుస్తున్నావ్ అని అడుగుతాడు. ఆ యశోధర్ నన్ను ఎప్పుడు ఇన్సల్ట్ చేస్తూనే ఉంటున్నాడు, నన్ను టార్చర్ పెట్టి పిచ్చిదాన్ని చేస్తున్నాడు అని మాళవిక అరుస్తూ చెప్తుంది. నువ్వు ఎప్పుడు బాగుండాలి అని కొడుకుని ముద్దు పెట్టుకుని తనని బయటకి పంపించేసి డోర్ వేసుకుని సూసైడ్ చేసుకునేందుకు ట్రై చేస్తుంది.
Also Read: నిజం తెలుసుకున్న రుక్మిణి- ఊహించని మాట అడిగిన సత్య, చిన్మయి మీద ఫోకస్ పెట్టిన మాధవ్
విషయం తెలిసి యష్, వసంత్ హాస్పిటల్ కి వస్తారు. అప్పుడే పోలీసులు తన సూసైడ్ కి కారణం ఎవరో తెలుసుకోవాలి వాళ్ళని వదిలిపెట్టకూడదు అని అనడం వాళ్ళు వింటారు. ఆదిత్య అమ్మా అని ఏడుస్తూ ఉంటాడు. అది చూసి యష్ టెన్షన్ పడతాడు. యష్ వచ్చి ఆదిని పలకరిస్తాడు. నాకున్నది మా మామ్ ఒక్కతే తనని కూడా నాతో ఉండనివ్వరా, మీ వల్లనే మామ్ కి అలా జరిగింది అని ఆదిత్య బాధగా యష్ తో అంటాడు.