Ennenno Janmalabandham September 21st: యష్ ని తన వెంట తిప్పుకుంటా అని వేదతో ఛాలెంజ్ చేసిన మాళవిక- చిత్ర, వైభవ్ ని చూసి బాధపడుతున్న వసంత్
వసంత్, నిధి ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. వాటిని చూసి చిత్ర చాలా బాధపడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
యష్ వేరే వాళ్ళతో మాట్లాడుతూనే వేద కోసం కళ్ళతోనే వెతుకుతూ ఉంటాడు. అది వేద గమనించి సర్ ఎవరి కోసమో వెతుకుతున్నారు, కొంపదీసి నాకోసమేనా.. అయినా నా కోసం ఎందుకు ఏదైనా తిట్టడానికా అని అనుకుంటూ తనని చూస్తుంటే మాళవిక వస్తుంది. ఏంటి నీ చూపులన్నీ నా మాజీ మొగుడి మీదే ఉన్నాయ్ అని మాళవిక అంటుంది. నీకు మాజీ అయినప్పుడు అడిగే హక్కు చెప్పే అవసరం నాకు లేదని వేద చెప్తుంది. యష్ నా భర్త చూస్తాను నీకేంటి అని అడుగుతుంది. నేను తన దగ్గర లేకపోయినా యష్ మనసులో నేనే ఉంటాను కావాలంటే ప్రూవ్ చేస్తాను చూడు అని పక్కకి వెళ్ళి నిలబడుతుంది. యష్ మాళవిక వైపు చూస్తాడు. అది చూసి వేద ఫీల్ అవుతుంది. నువ్వు నా స్థానంలో ఆ ఇంటికి వెళ్ళినా నువ్వు మిస్ అవుతుంది యష్ ప్రేమ.. అది ఇంకా నాదగ్గరే ఉందని మాళవిక అంటుంది.
యశోధర్ కి నా మీద ప్రేమ లేకపోవచ్చు, నన్ను భార్యగా కంప్లీట్ గా యాకసెప్ట్ చేయకపోవచ్చు. కానీ నీ మీద ఉన్న ద్వేషం, కోపం నా మీద లేదు ఎప్పటికీ రాదు ఎందుకంటే ఖుషి నన్ను అమ్మగా చూస్తుంది. యశోధర్ కి ఇప్పటికీ నీ మీద ప్రేమ లేదు ఏదో తన బిడ్డని మోసిన తల్లిగా కొద్దిగా గౌరవం ఉండొచ్చు. దాన్ని ఎక్కువగా ఊహించుకుని నన్ను ఏడిపించడానికి దారులు వెతకడం కాదని వేద గట్టిగా చెప్తుంది. యష్ ని మళ్ళీ నా వైపుకి తిప్పుకుని తీరతాను అది నా వల్ల మాత్రమే అవుతుంది, నీ కళ్ల ముందే యష్ నన్ను పిలిచేలా నాతో నడిచేలా చేస్తాను చూస్తూ ఉండు అని మాళవిక వేదతో ఛాలెంజ్ చేస్తుంది. అసాధ్యమైన నీ ఛాలెంజ్ కి ఆల్ ది బెస్ట్ అని వేద చెప్తుంది.
Also Read: రాధతో ఏడడుగులు వేసిన మాధవ్ - ఆదిత్యే రాధ భర్త అని తెలుసుకున్న జానకి
వసంత్ ని నీ ఫ్యామిలీ ఎప్పుడు రాలేదు ఏంటి ఎవరు లేరా అని వేద అడుగుతుంది. ఎందుకు రాలేదు వదిన మీరందరూ ఉన్నారుగా అని చెప్తాడు. సోరి వసంత్ అని వేద అంటుంది. ఎంగేజ్మెంట్ వేడుకలు స్టార్ట్ అవుతాయి. నిధి, వసంత్ కలిసి డాన్స్ వేస్తుంటే అది చూసి చిత్ర ఫీల్ అవుతుంది. అది చూడలేక చిత్ర ఏడుచుకుంటూ పక్కకి వచ్చేస్తుంది. అలా డీలా పడకు ఎంగేజ్మెంట్ నీతోనే జరుగుతుంది, నన్ను నమ్ము అని వేద ధైర్యం చెప్పేందుకు చూస్తుంది. తర్వాత చిత్ర, వైభవ్ కలిసి డాన్స్ వేస్తుంటే వసంత్ చాలా ఇబ్బందిగా ఉంటాడు. అది చూసి వసంత్ తన చేతిలోనే గ్లాస్ తన చేతిలోనే నలిపేయ్యడంతో చేతికి దెబ్బ తగిలి రక్తం కారుతుంది.
మాళవిక వచ్చి అసలు ఏం జరుగుతుంది నాతో మాట్లాడు అని వసంత్ ని అడుగుతుంది. అప్పుడే తన కోసం వచ్చిన వేద వాళ్ళ మాటలు వింటుంది. ఏరోజు అయితే నువ్వు యష్ ని వద్దని అనుకున్నావో ఆ రోజే నేను నిన్ను వద్దని అనుకున్నా ఆ క్షణమే మన రిలేషన్ కూడా కట్ అయ్యిందని వసంత్ అంటాడు. ఏది శాశ్వతమో ఏది దూరమో అది అర్థం చేసుకోమని అంటుంది మాళవిక. నేను నాకు నచ్చిన బెస్ట్ ప్లేస్ లో ఉన్నాను సంతోషంగా ఉన్నాను వెళ్లిపో అని అంటాడు. నీ అంత ఈజిగా నేను నిన్ను వదిలి వెళ్లలేను చెయ్యి చూపించు అని అడుగుతుంది. కానీ వసంత్ మాత్రం వెళ్లిపో అని అరుస్తాడు.
తరువాయి భాగంలో..
యష్ మాళవికతో డాన్స్ చేస్తూ కింద పడిపోతుంది. అందరికీ మన కెమిస్ట్రీ చూపించాలి, మన ప్రేమ గొప్పతనం చూపించాలని మధ్యలోనే ఆగిపోయావు. నీకు డాన్స్ అయినా లైఫ్ అయినా మధ్యలో వదిలేయడం అలవాటే కదా వేదకి నీకు వెలుగుకి, చీకటికి ఉన్నంత తేడా ఉందని యష్ అంటాడు. నా అడుగులో అడుగు వేసి నడవగలవా అని వేద చెయ్యి అందుకుని యష్ డాన్స్ చేస్తాడు.