Ennenno Janmalabandham July 18th Update: పాపం మిస్టర్ యారగెంట్, వేద ముందు పరువు పోయే- ఎట్టకేలకు సారికను పట్టుకున్న యష్, నిజం బట్టబయలు
వేద మీద పడిన నిందని చెరిపేసి తన నిజాయితిని నిరూపించాలని యష్ అనుకుంటాడు. అందుకోసం సారికను వెతికి పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
వేద తన గదికి వచ్చి తనని రెడీ చేసినట్టు యష్ ఊహించుకుంటాడు. కాసేపటికి దాని నుంచి తేరుకుని 'ఇదంతా నా భ్రమ.. వేద రాలేదా.. కానీ ఇది ఎంత బాగుంది నిజంగా వస్తే ఎంత బాగుంటుంది. నీ ఊపిరి మిస్ అవుతున్నాను వేద' అని యష్ ఫీల్ అవుతాడు. ఇక ఆఫీసుకు వెళ్లేందుకు బయటకి వచ్చేసరికి అందరూ యష్ ని చూసి నవ్వుతూ ఇలాగే వెళ్తావా అని అడుగుతారు. ఇలాగే వెళ్తానని చెప్పి బయటకి వచ్చేస్తాడు. ఇక అపార్ట్ మెంట్లో అందరూ యష్ ని వింతగా చూస్తూ ఇదేంటి ఇలా వెళ్తున్నారని అనుకుంటూ నవ్వుకుంటారు. వేద కూడా చూసి యష్ దగ్గరకి వచ్చి ఆఫీసుకి ఇలాగే వెళతారా అని అడుగుతుంది. 'అవును ఏంటి అందరూ నన్ను వింతగా చూస్తారేంటి నేనేదో అమీర్ ఖాన్ లాగా వేరే గ్రహం నుంచి వచ్చినట్టు ఒంటి మీద బట్టలు లేనట్టు' అని కోపంగా అనేసి అక్కడి నుంచి కారు దగ్గరకి వెళతాడు. ఇక వేద యష్ వెనుకే పరుగు తీస్తూ ఒకసారి ఇంటికి వెళ్ళి రండి అని చెప్తుంది కానీ యష్ మాత్రం వినడు. బయల్దేరే ముందు అద్దంలో చూసుకోలేదా అని వేద అంటుంది. కానీ యష్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా సొల్లు చెప్తూ ఒక్కసారిగా ప్యాంట్ లేదని విషయం గ్రహించి బిత్తరపోతాడు. విషయం ఒప్పుకోకుండా కవర్ చేసుకునేందుకు తెగ తిప్పలు పడతాడు.
Also Read: శౌర్యకి మళ్ళీ ఐ లవ్యూ చెప్పిన డాక్టర్ సాబ్- హిమ, నిరుపమ్ పెళ్లి చెడగొట్టేందుకు ప్రేమ్ స్కెచ్
ఇక ఇంట్లో అందరూ యష్ ప్యాంట్ వేసుకోకుండా ఆఫీసుకి వెళ్లాడని నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన యష్ వాళ్ళ ముందు బిల్డప్ కొట్టేందుకు తెగ ప్రయత్నిస్తాడు. డాడీ నువ్వు ప్యాంట్ వేసుకోకపోయిన సూపర్ గా ఉన్నావ్ సూపర్ మ్యాన్ లాగా అని ఖుషి అనేసరికి అందరూ పగలబడి నవ్వుతారు. యష్ ఇక తన గదికి వచ్చి తనని తాను తిట్టుకుంటాడు. 'నా మైండ్ ఎక్కడో పెట్టుకుని బయటకి వెళ్ళాను, పడక పడక ఆ వేద కళ్ళలోనే పడాలా ఆ వేదకి నేను ప్యాంట్ లేకుండా రెడ్ హాండెడ్ గా దొరికిపోవాలా.. నేను ప్యాంట్ వేసుకోని విషయం ప్రపంచం మొత్తం తెలిసిన పరవాలేదు కానీ ఆ మిసెస్ న్యూసెన్స్ కి తెలియాలా.. యష్ ఏం జరుగుతుంది రా నీకు, ఇంట్లో వాళ్ళ ముందు అందరి ముందు పరువు తీసుకుంటావా. అసలు ఆ వేద లేకపోతే నువ్వు ఉండలేవా' అని అనుకుని వేదతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. మరో వైపు వేద కూడా బాధగా కూర్చుని ఉంటుంది.
Also Read: కైలాష్ కి యష్ స్వీట్ కూల్ వార్నింగ్, సారిక కోసం వెతుకులాట- యష్, వేద క్యూట్ రొమాన్స్
కైలాష్ మీద కేసు పెడదాం వాడు ఎంత నీచుడో ఆధారాలతో సహా నిరూపిద్దాం వాడిని జైల్లో పెట్టిద్దామని వేద అక్క, బావ అంటారు. కానీ అందుకు వేద ఒప్పుకోదు. వాళ్ళ మాటలన్నీ కాంచన విని కంగారుపడుతుంది. ఇక యష్ రోడ్డు మీద వెళ్తుండగా ఒక చోట సారిక కనిపిస్తుంది. 'క్షమించు సారిక నిన్ను కలవడానికి వేరే మార్గం లేక కైలాష్ ఫోన్ నుంచి మెసేజ్ చేసి నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. నేను నిన్ను ఇబ్బంది పెట్టాలనో బాధపెట్టాలనో నిన్ను ఇక్కడికి రమ్మనలేదు. అసలు ఏం జరిగిందో చెప్పు, నీకు సపోర్ట్ గా నేనున్నాను' అని యష్ అడుగుతాడు. 'మా అమ్మ తప్ప నాకు ఎవరు లేరు సర్, తనకి ఆరోగ్యం బాగోలేదు తనని కాపాడుకోవాలంటే చాలా డబ్బు కావాలి. మా అమ్మే నా బలహీనత. దాన్ని అవకాశంగా తీసుకుని ఒక దుర్మార్గుడు నన్ను లొంగదీసుకున్నాడు. ఆ దుర్మార్గుడు ఎవరో కాదు మీ సిస్టర్ హజ్బెండ్ కైలాష్' అని చెప్పేస్తుంది.
తరువాయి భాగంలో..
కైలాష్ బయటకి వెళ్తుంటే యష్ ఎదురుపడతాడు. కోపంగా చూస్తూ నేను మీకు చెప్పే వెళ్ళాను కదా నేనే స్వయంగా మిమ్మల్ని సాగనంపుతాను అని. వెరీ స్పెషల్ పర్సన్ మిమ్మల్ని కలవాలని తెగ ఆరాటపడుతుందని చెప్తాడు. సారికా అని పిలిచి ఇంట్లో అందరి ముందు నిలబెడతాడు. ఈ నీచుడు ఆ అమ్మాయిని మోసం చేసి వదిలేశాడు అని యష్ చెప్తాడు. ఇక వేద కోపంగా కైలాష్ దగ్గరకి వచ్చి లాగి పెట్టి చెంప దెబ్బ కొడుతుంది.