అన్వేషించండి

Ennenno Janmala Bandham July 8th Update: ఖుషిని తల్లి దగ్గరకి చేర్చిన యష్, గుండెల్ని మెలిపెట్టే సీన్- ప్రేక్షకులని ఏడిపించేసిన వేద

ఇటు ఖుషి అమ్మ గురించి నిద్రలో కలవరిస్తూ ఉంటుంది. మరో వైపు వేద ఖుషి ఫోటో చూస్తూ తనతో గడిపిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుని బాధపడుతుంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

ఇటు ఖుషి అమ్మ గురించి నిద్రలో కలవరిస్తూ ఉంటుంది. మరో వైపు వేద ఖుషి ఫోటో చూస్తూ తనతో గడిపిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుని బాధపడుతుంది. ‘ఎంటమ్మా ఇది పక్కన నువ్వు లేకపోతే నాకు నిద్రపట్టడం లేదమ్మా, నీ చేతులు నన్ను పట్టుకుని నీ శ్వాస నాకు తగులుతుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా దాని పేరే అమ్మ కదా. నేను తపించిపోయింది దాని కోసమే కదా. ఖుషి నాకోసం నువ్వు పుట్టావా నీకోసం నేను పుట్టాన నా బంగారు తల్లివి నువ్వు’   అని వేద ఎమోషనల్ అవుతుంది.

ఇక పేపర్ వాడు వచ్చి పేపర్ ఇస్తాడు. తెలుగు పేపర్ ఆ ఇంట్లో ఇవ్వమని చేపుతుంటే అప్పుడే వేద ఎదురింట్లో నుంచి బయటకి వస్తుంది. వేద గురించి అతడు చాలా గొప్పగా చెప్తాడు. ఇలాంటి మనిషి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. మీరు గొప్ప జాతకులు సర్ మంచి భార్య వచ్చిందని అంటాడు. ఆ మాటలు యష్ మౌనంగా వింటూ ఉంటాడు. ఇక వేద వెళ్లిపోగానే యష్ పేపర్ అక్కడే వెయ్యి కానీ బిల్లు మాత్రం నేనిస్తాననని వ్వడికి చెప్తాడు. ఇక ఇంట్లోకి వెళ్ళిన వేద బాధగా కూర్చుని ఉండటాన్ని చూసి యష్ కూడా బాధపడతాడు.

Also Read: సాక్షితో షికార్లు చేస్తున్న రిషిని చూసి హర్ట్ అయిన వసు - దేవయాని విషపు ఆలోచన పసిగట్టేసిన జగతి, మహేంద్ర

మాళవిక స్వీట్స్ తీసుకుని సంతోషంగా అభి దగ్గరకి వస్తుంది. వేద ఒక రాత్రి అంతా పోలీస్ స్టేషన్ లో ఉందంట అని చెప్తుంది. వేద గంగి గోవు లాంటిది అలాంటి వేదని లాకప్లో వేయించారంటే గ్రేట్ అని అభి అంటాడు. ఇది బయటి వాళ్ళ పని కాదు ఇంట్లోనే ఎవరో చేశారని మాళవిక అంటుంది. ఆ యశోదర్ కి మనం కాకుండా ఇంకెవరో శత్రువులు ఉన్నారని వాళ్ళని మనం మిత్రులని చేసుకుని మన గుప్పెట్లో పెట్టుకోవాలని అభి ఆలోచిస్తాడు. వేద మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళని మనం పావుగా ఉపయోగించుకోవాలని అనుకుంటారు. ఖుషి చేతనే వేదని ఛీ కొట్టిస్తాననని మాళవిక అంటుంది. శబాష్ బంగారం నువ్వేంటో  ఆ వేదకి చూపించు యశోదర్ కి నిరూపించు అని మాళవికని రెచ్చగొడతాడు.

ఇక మాలిని, సులోచన మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తప్పు చేసిన నీ కూతుర్ని సమర్ధించుకోవడానికి సిగ్గు ఉండాలని మాలిని అంటుంది. నా బిడ్డ చేయకూడని తప్పు చేసిందంటే అసలు క్షమించను సులోచన తిరిగి సమాధానం ఇస్తుంది. హద్దు మీరి మాట్లాడుతున్నావ్ ముద్దపప్పు అని మాలిని అంటే బుద్ధి తక్కువగా మాట్లాడొద్దు మాలిని అని  ఒకరినొకరు తిట్టుకుంటారు. వాళ్ళ గోల విని వేద యష్ బయటకి వస్తారు ఇద్దరికీ సర్ది చెప్పి గొడవ ఆపేస్తారు.

Also Read: వేద నిజాయితీని యష్ నిరూపించగలడా? అమ్మ కోసం తపిస్తున్న ఖుషి

నా బిడ్డ వేద తప్పు చేసిందంటే మీరు నమ్ముతారా బావగారు అని వేద తండ్రి రత్నాన్ని అడుగుతాడు. మీ బిడ్డ కాదు మన బిడ్డ వేద తప్పు చేసిందంటే నేను నమ్మను గాక నమ్మను అని రత్నం అంటాడు. ఆ మాటకి వేద తండ్రి సంతోషిస్తాడు. ఇప్పుడు మీతో చెప్పిన మాట ఆ రోజు అందరి ముందు చెప్పి ఉండాలి కానీ అల్లుడిని నిలదీయయలేని చేతకానితనం కూతురు కన్నీళ్ళు చూసి ఏమి మాట్లాడలేకపోయానని రత్నం బాధపడతాడు. మనందరికన్న దీని వల్ల ఎక్కువగా నష్టపోయేది ఖుషి అని రత్నం అంటాడు. అందుకోసమైన వేద, యష్ దగ్గరవ్వాలని వాళ్ళు కోరుకుంటారు. అందుకు ఆ భగవంతుడే దారి చూపిస్తారని రత్నం అంటాడు.

ఖుషి నిద్రలేచి అమ్మా అని పిలుస్తుంది ఆ మాటకి వేద గుండెల్లో కలుక్కుమంటుంది. ఆ సీన్ ప్రేక్షకుల గుండెల్ని మెలిపెట్టేస్తుంది. ఖుషి లేచి ఉంటుంది నన్ను వెతుక్కుంతుంది, పాపం ఆకలేస్తుందేమో వెంటనే వెళ్ళి తినిపించాలని వేద పరుగు పరుగున ఇంట్లో నుంచి వెళ్లబోతు ఆగిపోతుంది. ఖుషి వచ్చి డాడీ మమ్మీ ఏది అని యష్ తో పాటు ఇంట్లో అందరినీ అడుగుతుంది. ఏం చెప్పాలో అర్థం కాక అందరూ మౌనంగా ఉంటారు. నాకు మమ్మీ కావాలి అని ఏడుస్తుంది. అందరూ ఎంత సముదాయించిన కానీ ఖుషి మాత్రం మమ్మీనే కావాలని అంటుంది. ఇక వేద తన గదిలో కూర్చుని కుమిలి కుమిలి ఏడుస్తుంటే సులోచన అక్కడకి వస్తుంది. నేను చేసింది తప్ప వేద నిన్ను ఆ ఇంటి నుంచి తీసుకొచ్చి తప్పు చేశానా అంటే లేదమ్మా నా తరుపున నువ్వు అడిగావు  అందులో ఏమి తప్పు లేదని అంటుంది. ‘నా తల్లిగా నువ్వు వచ్చి మాట్లాడేదాక నేను ఒంటరి దాన్ని అయ్యాను, నువ్వు వచ్చి నా తరుపున మాట్లాడావు. నా మీద వేయకూడని నిందలు వేశారు, అన్నిటికంటే నాకు ఒక విషయం బాధగా అనిపించిందమ్మా. నా భర్త నా తరపున ఒక్క మాట కూడా మాట్లాడకుండా బండ రాయిలాగా నిలబడిపోయారు. ఆయన నా భుజం మీద చెయ్యి వేసి నేనునన్నాను అని భరోసా ఇచ్చినట్లైతే ఎంత బాగుండేది. నా బిడ్డ ఖుషి నన్ను అమ్మా అని పిలిస్తుంటే గుమ్మం ఎదురుగా ఉండి కూడా గుమ్మం దాటలేని పరిస్థితిలో ఉన్నాను అది నాకు ఎక్కువ బాధగా ఉంది’ అని వేద తల్లిని కౌగలించుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది.

కాంచన వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్లిపోతామని మాలినితో అంటారు. మా ఆయన మీద ఇంత పెద్ద నింద పడిన తర్వాత ఈ ఇంట్లో ఎలా ఉంటామని కాంచన అంటుంది. నింద వేసింది మేము కాదే ఆ వేద.. మేము అల్లుడుగారిని ఏమి అనలేదు కదా. నా మాట విని ఈల్లు వదిలి వెళ్లిపోవాలానే ఆలోచన మానుకోమని రత్నం వాళ్ళు చెప్తారు. ఇక యష్ ఖుషిని  పిలిచి నీకు ఏమి కావాలని అడుగుతాడు.  అమ్మా కావాలని అంటుంది. వెంటనే యష్ ఖుషిని తీసుకుని వేద దగ్గరకి వెళతాడు.

తరువాయి భాగంలో..

ఖుషి అమ్మా అని పరిగెత్తుకుంటూ వచ్చి వేదని కౌగలించుకుంటుంది. ఇక యష్ వాళ్ళిద్దరి సంతోషాన్ని చూస్తూ ఇంటి గుమ్మం దగ్గరే నిలబడిపోతాడు. అల్లుడుగారు అక్కడే నిలబడిపోయారు ఏంటి లోపలికి రమ్మని వేద తండ్రి పిలుస్తాడు.  

   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Manmohan Singh: మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం మాజీ ప్రధాని అంత్యక్రియలు
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Manmohan Singh: మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం మాజీ ప్రధాని అంత్యక్రియలు
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Devara Japan Release Date: జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Embed widget