Ennenno Janmala Bandham: వేద నిజాయితీని యష్ నిరూపించగలడా? అమ్మ కోసం తపిస్తున్న ఖుషి
చక్కని కుటుంబ ప్రేమ కథతో తక్కువ కాలంలోనే ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులని సొంతం చేసుకుంది ఎన్నెన్నో జన్మలబంధం సీరియల్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
తప్పు చెయ్యడం మానవ సహజం వేదని నేను క్షమించాను మీరు కూడా క్షమించండి. ఇంట్లో నుంచి పంపించేయడం లాంటివి చేయవద్దని కైలాష్ నమ్మబలుకుతాడు. తన మాటలు నమ్మమని వేద యష్ ని బతిమలాడుకుంటుంది కానీ యష్ మౌనంగా ఉండిపోతాడు. నీ మొహం చూస్తుంటేనే అసహ్యంగా ఉంది వెంటనే ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని మాలిని అంటుంది. అప్పుడే వేద తల్లిదండ్రులు ఇంట్లోకి వస్తారు. ఏమైంది అల్లుడు గారు మా వేదని మీ అమ్మగారు ఎందుకు తిడుతున్నారని అడుగుతుంది. మాట్లాడండి అల్లుడుగారు అని సులోచన అడుగుతుంటే ఇది మా ఫ్యామిలీ విషయం మీరు కలుగ చేసుకోవద్దని కాంచన అంటుంది. ఏమిటి మీ కుటుంబ విషయమా నా కూతురు ఉంది ఇక్కడ చెప్పు వేద ఏం జరిగిందని నిలదీస్తునది. కాంచన గట్టిగా చెప్పు తమ్ముడు నీ భార్య నా భర్త మీద కుట్ర చేసిందని చెప్పు వాళ్ళకి, చెప్పకూడని పని చేసిందని చెప్పు వాళ్ళకి అంటుంది. ఇక సులోచన కాంచనని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమంటుంది. అసలు ఏం జరిగిందో చెప్పమని మరోసారి అడుగుతుంది. నీ కూతురు నా భర్తతో బూతు పని చేయడానికి బరితెగించిందని కాంచన చెప్తుంది.
నువ్వు చెప్పమ్మా వేద ఏం జరిగిందని అడుగుతుంది. నా కూతురు నిప్పు తాను అలాంటివి చేయదు ఈ కైలాష్ నీచుడని తిడుతుంది. నా ఇంటికి వచ్చి నా కూతురు అల్లుడిని తిడతావా తీసుకుపో ఇక్కడ నుంచి నీ కూతుర్ని అని మాలిక అరుస్తుంది. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు నీ కొడుకు.. మాట్లాడండి అల్లుడుగారూ వేద మీ భార్య తన గౌరవాన్ని కాపాడటం భర్తగా మీ బాధ్యత , వేద లేకపోతే మీకు ఖుషి కూడా దక్కేది కాదు. మీ బిడ్డా బతికిందంటే అది నా కూతురు భిక్ష మాట్లాడండి యశోదర్ గారు అని అరుస్తూ ఎమోషనల్ అవుతుంది. యష్ మౌనంగా చూస్తూ నిలబడతాడు. దీంతో సులోచన కోపంగా ఇప్పటికప్పుడు నా కూతుర్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోతున్నానని చెప్తుంది. ఇదంతా మీరు నమ్ముతున్నారా అని వేద యష్ ని అడుగుతుంది కానీ సమాధానం ఏం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు. సులోచన వేదని అక్కడి నుంచి బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతుంది. వేద గుండెలవిసేలా ఏడుస్తూ వెళ్తుంది.
అందరూ వెళ్లిపోయాక యష్ దగ్గరకి వేద బావ వస్తాడు. తనని బాగా చూసుకుంటావాని నీ మీద భరోసా పెట్టుకున్నాను కానీ నువ్వు మౌనంగా ఎందుకు ఉన్నవని నిలదీస్తాడు. ఈరోజు కాకపోతే రేపయిన సారిక చేసిన కుట్ర నీ వేద భయటపెడుతుంది. ఇంట్లో అందరూ వేద మీద నిందలు వేస్తుంటే బండరాయిలాగా చూస్తూ నిలబడ్డావే తప్ప మాట్లాడలేకపోయావ్ నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నావ్ అని బాధపడతాడు. నీ బరువుని పరువుని వేద నిలబెట్టింది అలాంటి తన మీద నిందలు వేస్తారా, నువ్వు కూడా నీ కుటుంబంతో కలిసి వేదని అనుమానిస్తున్నవా అని యష్ ని నిలదీస్తాడు. పెళ్ళికి ముందు తర్వాత కూడా వేదకి నీ చేతుల్లో ఎప్పుడు అవమానాలేనా అని ఆవేదనగా మాట్లాడతాడు. కానీ వేద మీ నుంచి ఒక్క మాట ఒక్క భరోసా కోరుకుంది మీరు అది ఇవ్వలేకపోయారని చెప్పి అక్కడ నుచి వెళ్ళిపోతాడు. ఇక యష్ గట్టిగా అరుస్తూ నాకు కావలసింది నోళ్ళు మూయించడం కాదు వేద నిజాయితిని నిరూపించడం అది జరిగిన రోజు అందరికీ సమాధానాలు చెప్తానని కోపంతో రగిలిపోతాడు.
అటు వేద ఇటు యష్ ఇద్దరు బాధపడుతున్న సీన్ ప్రేక్షకుల మనసుల్ని మెలిపెట్టేస్తుంది. వాళ్ళు చేసిన అవమానలన్నీ మర్చిపోయి నిన్ను ఇంత అవమానిస్తారా అని చిత్ర ఆవేదనగా మాట్లాడుతుంది. నేను వెంటనే వెళ్ళి వాళ్ళని నిలదీస్తానని చిత్ర వెళ్లబోతుంటే అందరూ ఆపుతారు. భార్యా భర్తల మధ్య భగవంతుడికి కూడా చోటు ఉండకూడదు, కలుగచేసుకోకూడదని వేద తండ్రి చిత్రకి చెప్తాడు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది యశోదర్ అని అంటాడు.
Also Read: తనను ప్రేమించిన రౌడీబేబీనే శౌర్య అని నిరుపమ్ కి తెలుస్తుందా, సౌందర్యకి జ్వాల ఏం సమాధానం చెబుతుంది!
ఎవరో ఒక్కరు చేసిన తప్పుకు అందరూ బాధపడుతున్నారు, ముఖ్యంగా ఆ పసి మనసు అల్లడిపోతుందని రత్నం, మాలిని ఆవేదన చెందుతారు. వేదని వెనక్కి తీసుకురావాలని అనుకుంటారు. అది విన్న కాంచన సంతోషంగా ఉంది మీరు నాగురించి కాకుండా మీ కోడలు గురించి ఆలోచిస్తున్నారని ఏడుస్తుంది. సంపాదన లేని వాడని మీ అల్లుడంటే తక్కువగా చూస్తున్నారు అని బాధపడుతుంది. కంచు ఏంటి ఆ మాటలు మేము నిన్ను బాగా చూసుకుంటామని మాలిని అంటుంది. అవసరం లేదమ్మా మాకు ఎవరు లేరు బతికిన చచ్చినా ఆయనతోనే ఉంటానని కుమిలి కుమిలి ఏడుస్తుంది. అది చూసి రత్నం దంపతులు బాధపడతారు.
ఖుషి నిద్రలోనే అమ్మా.. అమ్మా అని పిలుస్తుంది. నిద్రలేచిందంటే డాడీ అమ్మ ఏది అని ఏడుస్తుంది తనని ఊరుకోబెట్టడం కష్టం అని యష్ ఆలోచిస్తూ బాధపడతాడు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ వేద చీరని దిండుకు కట్టి తన పక్కన పెడతాడు. నన్ను వదిలి వెళ్లకమ్మ నాతోనే ఉండమ్మా ఐ లవ్యూ అమ్మా అని ఖుషి అని కలవరిస్తుంది. అది చూసి ఎమోషనల్ అవుతాడు. నేటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
తరువాయి భాగంలో..
వేద ఖుషి ఫోటో చూసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక సులోచన, మాలిని గొడవపడుతూ ఉంటారు. తప్పు చేసిన నీ కూతుర్ని సమర్ధించుకోవడానికి సిగ్గు ఉండాలని సులోచనని మాలిని తిడుతుంది. వెధవ పని చేసిన మీ అల్లుడిని వెనకేసుకు రావడానికి బుద్ధి ఉండాలని సులోచన మాలినిని తిడుతుంది. కాసేపు ఇద్దరి మధ్య వాదన జరుగుతూ ఉంటుంటే వేద ఆపేందుకు ప్రయత్నిస్తుంది.