News
News
X

Prabhas: 'ప్రాజెక్ట్ K' స్టోరీపై రూమర్స్ - నిజమేనా?

'ప్రాజెక్ట్ K' సినిమా కథ, 'ఒకే ఒక జీవితం' స్టోరీ రెండూ దగ్గరదగ్గరగా ఉంటాయని అంటున్నారు.

FOLLOW US: 

ఇటీవల 'ఆదిపురుష్' సినిమాను పూర్తి చేసిన ప్రభాస్ ఇప్పుడు 'సలార్', 'ప్రాజెక్ట్ K' సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. మధ్యలో 'సాహో', 'రాధేశ్యామ్' రూపంలో పెద్ద ప్లాప్స్ వచ్చినా.. ప్రభాస్ రేంజ్ మాత్రం తగ్గలేదు. ఆయన నటిస్తోన్న సినిమాల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ప్రాజెక్ట్ K'లో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది.

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమా కథ, 'ఒకే ఒక జీవితం' స్టోరీ రెండూ దగ్గరదగ్గరగా ఉంటాయని అంటున్నారు. 

'ఒకే ఒక జీవితం' మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే.. హీరో తన తల్లిని బ్రతికించుకోవడం కోసం టైం ట్రావెల్ చేసి ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్తాడు. అదే పాయింట్ తోనే 'ప్రాజెక్ట్ K' రూపొందుతుందని గాసిప్స్ మొదలయ్యాయి. ఈ వార్తలపై పరోక్షంగా స్పందించారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో 'ప్యారడైజ్‌ వద్ద బస్సు దిగిన ప్రతి ఒక్కరూ బిర్యానీ తినలేరు' అని రాసుకొచ్చారు. దీన్ని బట్టి 'ఒకే ఒక జీవితం' సినిమాకి 'ప్రాజెక్ట్ K' సంబంధం లేదని నాగ్ అశ్విన్ చెప్పకనే చెప్పారు. మరి ఇప్పటికైనా ఈ రూమర్స్ ఆగుతాయేమో చూడాలి!

అవెంజర్స్ రేంజ్ లో 'ప్రాజెక్ట్ K':

'ప్రాజెక్ట్ K' ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతుందని నిర్మాత అశ్వనీదత్ రీసెంట్ గా చెప్పారు. డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తవుతుందని.. 9 నెలలు గ్రాఫిక్స్ కోసం కేటాయించామని తెలిపారు. హాలీవుడ్ అవెంజర్స్ రేంజ్ లో 'ప్రాజెక్ట్ K' ఉంటుందని అన్నారు. ఈ సినిమాతో చైనా, అమెరికా మార్కెట్ ని టార్గెట్ చేస్తామని చెప్పుకొచ్చారు.

సూపర్ హీరోగా ప్రభాస్:

ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపిస్తారని సమాచారం. 'ఆదిపురుష్'లో శ్రీరాముడిగా కనిపించనున్న ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' కోసం సూపర్ హీరో అవతారమెత్తనున్నారు. ఈ విషయాన్ని పరోక్షంగా వెల్లడించింది చిత్రబృందం. ప్రభాస్ పుట్టినరోజు నాడు సూపర్ హీరో అని మెన్షన్ చేస్తూ అతడికి విషెస్ చెప్పింది.

Project K Release Date:

అక్టోబర్ 18, 2023న 'ప్రాజెక్ట్ K' సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ ఆ తేదీకి విడుదల చేయలేని పక్షంలో 2024 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Published at : 15 Sep 2022 02:45 PM (IST) Tags: Nag Ashwin Project K Prabhas Oke Oka Jeevitham Project K movie

సంబంధిత కథనాలు

Dhanush New Song : ఒకే ఒక ఊరిలోనా, ధనుష్ ఎక్కడా 'తగ్గేదే లే'

Dhanush New Song : ఒకే ఒక ఊరిలోనా, ధనుష్ ఎక్కడా 'తగ్గేదే లే'

Bigg Boss Telugu: గీతూను అంత మాట అనేసిన నాగార్జున, రేవంత్‌కు లైన్ క్లియర్!

Bigg Boss Telugu: గీతూను అంత మాట అనేసిన నాగార్జున, రేవంత్‌కు లైన్ క్లియర్!

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

టాప్ స్టోరీస్

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

IND Vs AUS Match: Hydలో నేడు భారీ ట్రాఫిక్ ఆంక్షలు, మీరు క్రికెట్ మ్యాచ్‌కి వెళ్తున్నారా? పార్కింగ్ వివరాలివీ

IND Vs AUS Match: Hydలో నేడు భారీ ట్రాఫిక్ ఆంక్షలు, మీరు క్రికెట్ మ్యాచ్‌కి వెళ్తున్నారా? పార్కింగ్ వివరాలివీ

Lok Sabha Election 2024: సోనియా గాంధీతో నితీశ్, లాలూ భేటీ- టార్గెట్ 2024పై చర్చ!

Lok Sabha Election 2024: సోనియా గాంధీతో నితీశ్, లాలూ భేటీ- టార్గెట్ 2024పై చర్చ!