అన్వేషించండి

Vamshi Paidipally: దళపతి విజయ్‌తో వంశీ పైడిపల్లి తమిళ చిత్రం.. నిర్మాత దిల్ రాజు!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌తో వంశీ పైడిపల్లి త్వరలోనే భారీ ప్రాజెక్టును తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన విజయ్‌ను కలిశారు.

తమిళ దర్శకులకు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. వారు తెలుగులో సినిమా తీస్తామంటే చాలు.. వెంటనే డేట్స్ ఇచ్చేస్తారు. కథ గురించి కూడా పెద్దగా ఆలోచించరు. ముఖ్యంగా మణిరత్నం, శంకర్, మురుగదాస్ వంటి దర్శకులకు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో తెలిసిందే. అయితే, మన తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి.. ఈ సాంప్రదాయాన్ని తమిళానికి పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారు. చివరికి నిర్మాణ సంస్థ కూడా మనదే. 

ఔనండి.. దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు కోలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. దళపతి విజయ్‌తో భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. వంశీ, రాజులు దళపతిని కలిశారు. ఈ చిత్రం చేయడానికి విజయ్ అంగీకరించడంతో.. వంశీ పైడిపల్లి ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలిపారు. 

ఇది దళపతి విజయ్‌కు 66వ చిత్రం కానుంది. మహేష్‌బాబు నటించిన ‘మహర్షి’ సినిమా ఏ స్థాయిలో హిట్ కొట్టిందో తెలిసిందే. ఆ తర్వాత చిత్రాన్ని కూడా ఆయన మహేష్ బాబుతోనే తీయాలని అనుకున్నారు. కానీ, అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దీంతో ఆ కథనే వంశీ విజయ్‌కు వివరించినట్లు తెలిసింది. విజయ్ కూడా చాలా ఏళ్ల నుంచి పాన్ ఇండియా మూవీ చేయడనికి ఆసక్తి చూపుతున్నారు. పైగా, తెలుగులోనూ ఆయన ఇప్పటివరకు నేరుగా నటించలేదు. ఈ నేపథ్యంలో విజయ్ వెంటనే ఒకే చెప్పినట్లు తెలిసింది. 

Also Read: పవన్ కళ్యాణ్‌కు మోహన్ బాబు కౌంటర్.. నువ్వు నాకంటే చిన్నవాడివి..

విజయ్ నటించిన కొన్ని చిత్రాలు తెలుగులో మంచి విజయమే సాధించాయి. ‘తుపాకీ’, ‘అదిరింది’ ‘మాస్టర్’ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం విజయ్ తమిళంలో ‘బీస్ట్’ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ నటిస్తున్నాడనే సమాచారం తెలియగానే.. దళపతి అభిమానుల సంతోషానికి అవధుల్లేవు. మహేష్‌ బాబుకు మంచి హిట్ ఇచ్చిన వంశీ.. తప్పకుండా తమ అభిమాన హీరోకు బ్లాక్‌బస్టర్ ఇస్తారనే నమ్మకంతో ఉన్నారు. 

Also Read: ‘ఫ్యామిలీ మ్యాన్’ టీమ్‌లోకి రెజీనా, రాశీ ఖన్నా.. బోల్డ్‌ సీన్లతో పిచ్చెక్కిస్తారట!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget