RGV On Adipurush Teaser: ఆయన లుక్ నాక్కూడా నచ్చలేదు, ప్రభాస్‌పై కుట్ర పెద్ద జోక్ - ‘ఆది పురుష్’ టీజర్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!
ప్రభాస్ హీరోగా తెరెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఆది పురుష్’. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం షాకింగ్ కామెంట్స్ చేశారు.
‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఈ సినిమాలో తన అద్భుత నటనతో యావత్ దేశ ప్రేక్షకులను అద్భుతంగా అలరించాడు. ఈ సినిమా తర్వాత ఆయన వరుసగా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు. అయితే, ‘బాహుబలి’ అనంతరం వచ్చిన ‘సాహో’, రాధేశ్యామ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ‘ఆది పురుష్’ సినిమా చేస్తున్నారు. రామాయణం కథ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తియినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో గ్రీన్ మ్యాట్ మీదే షూటింగ్ కొనసాగినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. అయోధ్యలోని సరయు నది తీరంలో ఈ టీజర్ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే, ఈ టీజర్ ను చూసి ఆడియోన్స్ షాక్ అయ్యారు. అంతేకాదు, తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో రాముడికి గడ్డాలు, మీసాలు ఉండటం ఏంటనే ప్రశ్నలు ఎదురయ్యాయి. మరోవైపు రావణుడి క్యారెక్టర్ లో కనిపించిన సైఫ్ అలీ ఖాన్ ను చూసి మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణుడు అయిన రావణుడిని ముస్లీం మాదిరిగా చూపించారంటూ హిందూ సంఘాల నాయకులు మండిపడ్డారు. ఈ టీజర్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ తాజాగా ఓ న్యాయవాది కేసు కూడా వేశాడు.
‘ఆది పురుష్’ టీజర్ పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం షాకింగ్ కామెంట్స్ చేశారు. నిజానికి సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి లుక్ తనక్కూడా నచ్చలేదని చెప్పారు. “రామాయణం, రాముడు ఎలా ఉంటాడో మనకు బాగా తెలుసు. అందుకే, ఈ సినిమాలో ప్రతి ఒక్కరి లుక్ ను తప్పు పడుతున్నాం. నాకు ఓ వ్యక్తి ఫోన్ చేసి రాముడు మీసాలతో కనిపించడం ఏంటని ప్రశించాడు. అయితే, రాముడిని వాళ్లు మీసాలతో చూపించాలి అనుకున్నారేమో? అందుకే అలా చూపించారని చెప్పాను. రావణాసురుడు అంటే గంభీరమైన ముఖం ఉంటుంది. పాత సినిమాల్లో రాముడి వేషధారణలను చూసి సైఫ్ అలీ ఖాన్ ను చూసే సరికి ఆయన లుక్ అస్సలు నచ్చలేదు. ఆది పురుష్’ టీమ్ ఈ సినిమాలో రామాయణాన్ని చూపిస్తున్నాం అని చెప్పకుండా.. రామాయణం ఆధారంగా ఓ ఫిక్షనల్ సినిమా చేస్తున్నాం అని చెప్పి ఉంటే ఈ రచ్చ జరిగేది కాదు” అని చెప్పారు. .
బాలీవుడ్ లో కొందరు ప్రభాస్ ఎదుగుదలను తట్టుకోలేక.. ‘ఆది పురుష్’పై కుట్ర చేస్తున్నారనే కామెంట్స్ పైనా ఆర్జీవీ స్పందించారు. “ప్రభాస్ పై కుట్ర అనేది ఓ పెద్ద జోక్. ఇంత కంటే పెద్ద జోక్ నా లైఫ్ లో వినలేదు. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ సినిమా ‘బ్రహ్మాస్త్ర’ టీజర్ విడుదలైనప్పుడు చాలామంది ట్రోల్ చేశారు. సినిమా విడుదలైన తర్వాత ఎవరు వీటి గురించి మాట్లాడలేదు. కొన్ని సినిమాలు బిగ్ స్క్రీన్ లోనే పర్ఫెక్ట్ గా కనపడతాయి. అందుకే, ఒక నిమిషం ఉన్న ట్రైలర్ చూసి సినిమాని జడ్జ్ చేయకూడదు” అని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు.
Me not talking about Adipurush teaser not to @SwapnaJourno https://t.co/OjgHy8DcgS
— Ram Gopal Varma (@RGVzoomin) October 6, 2022
Also Read : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?
Also Read : వేలెత్తి చూపిస్తూ, రక్తం అమ్ముకొని బతుకుతున్నానన్నారు - చిరు ఎమోషనల్ కామెంట్స్!