(Source: ECI/ABP News/ABP Majha)
Director Bobby: ప్రముఖ దర్శకుడు బాబీ ఇంట విషాదం!
టాలీవుడ్ దర్శకుడు బాబీ తండ్రి మరణించారు.
టాలీవుడ్ దర్శకుడు బాబీ(కెఎస్ రవీంద్ర) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి కొల్లి మోహనరావు కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన్ను కొన్నిరోజుల క్రితం హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ట్రీట్మెంట్ పొందుతూనే ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగిన దర్శకుడు బాబీ 2003లో రైటర్ చిన్ని కృష్ణ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత దర్శకుడు దశరథ్, గోపీచంద్ మలినేని వంటి వారి దగ్గర పని చేశారు. 'భద్రాద్రి' సినిమాకు కథ అందించారు. ఆ తరువాత 'డాన్ శీను', 'ఓ మై ఫ్రెండ్', 'బాడీగార్డ్' ఇలా చాలా సినిమాల్లో స్క్రీన్ ప్లే, స్టోరీకి సంబంధించి వర్క్ చేశారు. 'పవర్' సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన.. ఆ తరువాత 'జై లవకుశ'తో మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో 'వాల్తేరు వీరయ్య' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే మరికొంతమంది స్టార్స్ ను తీసుకున్నారు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ లో రవితేజ పాల్గొన్నట్లు ప్రకటించింది టీమ్. చిరుకి తమ్ముడిగా కనిపించనున్నారు రవితేజ.
చిరు, బాబీ సినిమా స్టోరీ:
నిజానికి కథ ప్రకారం.. చిరు, రవితేజ సవతి సోదరులుగా కనిపించబోతున్నారు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఈ సినిమా ఉంటుందట. పూర్తి మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు. తెరపై చిరంజీవి, రవితేజ మధ్య వచ్చే క్లాష్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.
మరోపక్క ఈ సినిమాలో మలయాళ నటుడు బిజూ మీనన్ ను విలన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. ఇక ఈ సినిమాకి 'వాల్తేర్ వీరయ్య' అనే టైటిల్ దాదాపు ఫైనల్ చేసినట్లే. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు చిరు లిస్ట్ లో 'భోళాశంకర్', వెంకీ కుడుముల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆయన నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా దసరా సీజన్ లో రిలీజ్ కానుంది.
బడ్జెట్ వివరాలు..
ఈ సినిమా బడ్జెట్ విషయాలు ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమా కోసం రూ.125 నుంచి రూ.150 కోట్లు ఖర్చు పెడుతున్నారు. రెమ్యునరేషన్లకే రూ.75 కోట్లు ఖర్చు అవుతుందట. చిరంజీవికి అటు ఇటుగా రూ.40 కోట్లకు పైగానే ఇస్తున్నారు. రవితేజకి రూ.18 కోట్లని టాక్. దర్శకుడు బాబీకి ఎలా లేదన్నా ఐదారు కోట్లు ఇస్తారు. మిగిలిన నటీనటులకు టెక్నీషియన్స్ కు కలుపుకొని రూ.75 కోట్లు దాటేస్తుందట.
'ఆచార్య' లాంటి డిజాస్టర్ తరువాత కూడా చిరు సినిమాకి ఈ రేంజ్ లో ఖర్చు పెడుతున్నారంటే గ్రేట్ అనే చెప్పాలి. కానీ ఇలా బడ్జెట్ పెంచుకుంటూ పోవడం వలనే 'ఆచార్య'కి నలభై కోట్లకు పైగా నష్టాలొచ్చాయి. అది తెలిసి కూడా మైత్రి మూవీ మేకర్స్ రిస్క్ చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.
Also Read : ‘ఆంటీ’ ట్రోల్స్‌పై అనసూయ ఆగ్రహం, రౌడీ బాయ్ అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్
Also Read : విజయ్ దేవరకొండ కాదు, అనకొండ - రౌడీ బాయ్ ప్రవర్తనపై ముంబై థియేటర్ ఓనర్ ఫైర్